వేలికి ఫ్రాక్చర్ (వేలు విరగడం) - Fractured Finger in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 01, 2018

March 06, 2020

వేలికి ఫ్రాక్చర్
వేలికి ఫ్రాక్చర్

వేలికి ఫ్రాక్చర్ అంటే ఏమిటి?

వేలికి ఫ్రాక్చర్ అంటే వేళ్ళ ఎముకల (ఫాలంగెస్) కు గాయం కావడం (విరగడం). ఇది సాధారణంగా జరిగే క్రీడా గాయాలలో (sports injuries) ఒకటి మరియు ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించవచ్చు. సమయానికి చికిత్స చేయకపోతే, ఈ ఫ్రాక్చర్లు వివిధ పరిణామాలకు దారి తీస్తాయి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

విరిగిన వేలు యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

  • గాయం జరిగిన ప్రాంతం చుట్టూ ఎరుపుదనం, మంట, మరియు వాపు
  • నొప్పి
  • తాకితేనే నొప్పి కలిగేంత సున్నితత్వం
  • వేలి ఆకృతి మారడం
  • వేలు కదిలించడంలో అసమర్థత
  • ఫ్రాక్చర్ ఉన్న ప్రదేశం కమిలిన గాయపడటం ఏర్పడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

వేలు విరగడానికి కారణాలు:

  • క్రీడలు సమయంలో తగిలిన గాయం అలాగే ఉండిపోవడం వేళ్ల ఫ్రాక్చర్లకు అత్యంత సాధారణ కారణం.
  • తలుపులు వేగంగా మూసుకుంటునప్పుడు వేలు దాని మధ్యలో  ఉండిపోవడం వలన లేదా వేళ్ళను గోడకేసి కొట్టడం వలన కూడా వేళ్ళు విరిగిపోవచ్చు
  • భారీ యంత్రాలతో పనిచేసేటప్పుడు, విద్యుత్ రంపాలు లేదా డ్రిల్లింగ్ మెషీన్ వంటి వస్తువులతో పనిచేస్తున్నప్పుడు  వేళ్ళు విరగవచ్చు.

దీని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వేళ్ళ ఫ్రాక్చర్ యొక్క నిర్ధారణ క్రింది విధంగా ఉంటుంది:

  • గాయం యొక్క కారణం, గాయం యొక్క సమయం, లక్షణాలు, మరియు ఏదైనా మునుపటి గాయం యొక్క చరిత్ర గురించి వైద్యులు  పూర్తిగా తెలుసుకుంటారు.
  • భౌతిక పరీక్షలో ఫ్రాక్చర్ యొక్క స్థానం, విరిగిన ఎముకల సంఖ్య మరియు వేళ్ల యొక్క కదలిక గురించిన అంచనా ఉంటుంది.
  • జాయింట్ల దృఢత్వం మరియు వాటి స్థానభంగం(dislocation) వంటివి పరిశీలించాలి.
  • అరచెయ్యి మరియు వేళ్ళ పరీక్ష కోసం ముందు వెనుకల నుండి, పక్కనుండి మరియు ఐమూలగా  ఎక్స్-రే లును తీయాలి

ఈ పరిస్థితి యొక్క చికిత్సలో ఇవి ఉంటాయి:

  • వేలు ఫ్రాక్చర్ యొక్క చికిత్సలో విరిగిన ముక్కలను ఒక క్రమములో పెట్టి బద్దకట్టు వేయడం జరుగుతుంది. ఒత్తిడి మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగించేందుకు విరిగిన  వేలుని పక్క వేలుతో కలిపి అంటించవచ్చు (కట్టవచ్చు). వైద్యులు ఫ్రాక్చర్ను పరిశీలించి వేళ్లకు ఎంత కాలం పాటు బద్దకట్టు (splint) ఉంచాలో నిర్ణయిస్తారు.
  • వేలి కదలికలను నివారించాలని సూచిస్తారు.
  • అనాల్జెసిక్స్ (analgesics) మరియు చన్నీటి కాపడంతో పాటు చికిత్స సాధారణంగా మూడు వారాల పాటు ఇవ్వబడుతుంది/ సూచించబడుతుంది.
  • తీవ్ర సందర్భాల్లో సర్జరీ అవసరమవుతుంది. విరిగిన ముక్కలను వాటి స్థానంలో ఉంచడానికి కొన్ని పరికరాలు కూడా అవసరం కావచ్చు. వాటిలో బయోకంపేటబుల్ పిన్నులు లేదా స్క్రూలు ఉండవచ్చు.



వనరులు

  1. Orthoinfo [internet]. American Academy of Orthopaedic Surgeons, Rosemont, Illinois. Finger Fractures.
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Hand fracture: Aftercare
  3. American Academy of Family Physicians [Internet]. Leawood, Kansas; Common Finger Fractures and Dislocations
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Finger Injuries and Disorders
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Bone fractures