జిఇఆర్డి (GERD) అంటే ఏమిటి?
జిఇఆర్డి (GERD) ని, గాస్ట్రో-ఇసోఫాగల్ రిఫ్లక్స్ డిసీజ్/వ్యాధి అని కూడా పిలుస్తారు, దీనిలో అన్నవాహిక (ఇసోఫాగస్) చివరిలో ఉండే వలయాకారపు (ring-shaped) కండరం సరిగ్గా మూసుకోదు తద్వారా కడుపులోని పదార్దాలు పైకి అన్నవాహిక లోకి చేరి చికాకును కలిగిస్తాయి. ఇది గుండెల్లో మంట వలె ఉంటుంది. అయితే, ఒక వ్యక్తి గుండెల్లో మంట వారానికి రెండుసార్లు కంటే ఎక్కువగా సంభవిస్తే, అది జిఇఆర్డి (GERD) గా పిలువబడుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
జిఇఆర్డి యొక్క ప్రాధమిక లక్షణం వారంలో రెండుసార్లు కంటే ఎక్కువ గుండెల్లో మంటను అనుభవించడం.
ఇతర లక్షణాలు:
- ఛాతీ మధ్యలో మంటగా ఉంటుంది
- వెక్కిళ్లు (hiccups)
- గొంతులో మంట
- మింగడంలో కఠినత
- చెడు శ్వాస
- కడుపు ఉబ్బరం
- ఏదైనా తిన్న తర్వాత నీరసంగా అనిపించడం
- నోటిలో పాడైన పుల్లని రుచి
- ఏదైనా తిన్న తర్వాత ఛాతీ నొప్పి
- రేగుర్గిటేషన్ ( [Regurgitation] కడుపు ఆమ్లం నోటిలోకి వచ్చి నోటిలో ఒక చెడు రుచిని కలిగించడం)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అన్నవాహిక యొక్క చివరన ఉన్న కండరము బలహీనపడి మరియు కడుపులోని పదార్దములు పైకి గొంతు రాకుండా ఆ కండరము నిరోధించలేకపోయినప్పుడు జిఇఆర్డి (GERD) సంభవిస్తుంది. ఇది అనేక కారణాల వలన సంభవిస్తుంది, అవి:
- ఊబకాయం
- కెఫిన్ లేదా ఆల్కహాల్ ను అధికంగా తీసుకోవడం
- గర్భం
- అధిక కొవ్వు ఆహారం
- ఒత్తిడిని అనుభవించడం
- హియాటల్ హెర్నియా (కడుపు యొక్క పైభాగం ఛాతీ మీదకు రావడం)
- ధూమపానం
- నొప్పి నివారణలు వంటి కొన్ని మందులను తీసుకోవడం
- మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం
ఎలా నిర్ధారణ మరియు చికిత్స?
రోగ నిర్ధారణలో ప్రాధమిక దశ లక్షణాలు గురించి తెలుసుకోవడం. జిఇఆర్డి (GERD) నిర్ధారణ కోసం వివిధ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి, అవి:
- ఎండోస్కోపీ (అన్నవాహికకు ఏదైనా నష్టం ఉంటే, దానిని అంచనా వేయడం)
- మానమోట్రీ ([Manometry] అన్నవాహికకు చివరన ఉన్న కండరం సాధారణంగా పని చేస్తుందో లేదో అంచనా వేయడానికి)
గుండె మంటను నివారించడానికి వైద్యులు కొన్ని చర్యలను సిఫారసు చేయవచ్చు. అవి ఈ విధంగా ఉంటాయి:
- ఆమ్లత (acidity)ని ప్రేరేపించే ఆహారాలను నివారించాలి
- బరువును కోల్పోవడం
- శరీర ఎగువ (పై) భాగాన్ని ఎత్తి పెట్టి ఉంచే ఉపరితలాల పై (surface) పడుకోవాలి
- భోజనం తక్కువ తక్కువ అధికసార్లు తినటం
- సడలింపు (relaxation) పద్ధతులు పాటించాలి
- కెఫిన్, ధూమపానం మరియు మద్యపానాన్ని నివారించాలి
చాలా సందర్భాలలో, గుండెల్లో మంట నుంచి ఉపశమనం అందించడం కోసం మందులు కూడా ఇవ్వబడవచ్చు.
తీవ్రమైన సందర్భాల్లో, కండరాన్నీ బలోపేతం చేయడానికి శస్త్రచికిత్స సిఫారసు చేయబడవచ్చు.