వేడి తిమ్మిరి అంటే ఏమిటి?
సాధారణంగా చేతులు లేదా కాళ్లలో వచ్చే కండరాల నొప్పులనే “వేడి తిమ్మిర్లు” లేదా కండర నొప్పులుగా చెబుతారు. దీన్నే కండరాలు పట్టేయడం (ఈడ్పులు) అని కూడా అంటారు. కొన్నిసార్లు, వ్యక్తి పొత్తికడుపు ప్రాంతంలో వేడి తిమ్మిరిని (పొత్తికడుపు కండరాలు పట్టేసినట్లుండేది, ఈడ్చినట్లుండేది) అనుభవించవచ్చు. ఈ తిమ్మిరిలు ఎక్కువ సమయం పాటు ఉంటాయి మరియు చాలా తీవ్రంగా నొప్పిని కల్గిస్తాయి. వేడి వాతావరణంలో శారీరకంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల్లో ఈ వేడి తిమ్మిర్లు సాధారణంగా సంభవిస్తాయి.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కాళ్లు, చేతులు లేదా పొత్తికడుపు యొక్క కండరాలలో పదునైన, తీక్షణమైన మరియు తీవ్రమైన నొప్పిని కల్గించడమే వేడి తిమ్మిరి యొక్క ప్రధాన వ్యాధిలక్షణం.
చాలా సందర్భాలలో (లేక చాలామందిలో) వ్యక్తి అధిక చెమటలకు గురికావడం మరియు అధిక దాహాన్ని (ఎక్కువ దప్పిక) అనుభవించడం జరుగుతుంది.
శిశువులు, చిన్నపిల్లలు మరియు వృద్ధులు తమ శరీర ఉష్ణోగ్రతల్ని బాగా నియంత్రించలేరు కాబట్టి వీళ్లకు ఈ వేడి తిమ్మిర్లు రుగ్మత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రధాన కారణాలు ఏమిటి?
వేడిగా ఉండే వాతావరణంలో మితిమీరిన చెమట పట్టడం వలన కలిగే వేడి తిమ్మిరికి ప్రధాన కారణం డిహైడ్రాషన్ (నిర్జలీకరణం) మరియు ఎలెక్ట్రోలైట్లు అసమతుల్యత. తీవ్ర శారీరక శ్రమ కారణంగా ఎలెక్ట్రోలైట్స్ కోల్పోయినప్పుడు, ఇది కండరాల తిమ్మిరికి మరియు కండరాలనొప్పికి దారితీస్తుంది .
తీవ్రమైన శారీరక శ్రమ మరియు కండరాలు అధికంగా అలసిపోయినప్పుడు, అవి శరీరంలో ఏర్పడే సంకోచాలను తమకు తామే క్రమబద్ధీకరించే సామర్థ్యాన్ని కోల్పోవచ్చని, తద్వారా వేడి తిమ్మిర్లుకు దారి తీయొచ్చని కొన్ని వైద్య పరిశోధనలు సూచిస్తున్నాయి. .
దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
డాక్టర్ వ్యాధి లక్షణాల గురించి అడుగుతారు మరియు వ్యక్తిగత కార్యకలాపాల గురించి కూడా ప్రశ్నలు వేసి తెలుసుకుంటారు, తద్వారా వేడి తిమ్మిర్ల నిర్ధారణను చేయగలుగుతారు. నిర్జలీకరణ మరియు ఎలెక్ట్రోలైట్ అసమతుల్యతకు సంబంధించిన సంకేతాలను పరిశీలించడానికి వైద్యుడు శారీరక పరీక్షను కూడా నిర్వహించవచ్చు.
ఒకవేళ ఒక వ్యక్తికి వేడి తిమ్మిర్లు (heat cramps) గనుక వస్తే, అతను / ఆమె తప్పనిసరిగా కింద సూచించిన విధంగా వెంటనే వ్యవహరించాలి:
- శారీరక శ్రమను ఆపివేయాలి
- ఓ చల్లటి ప్రదేశాన్ని ఎంచుకుని విశ్రాంతి తీసుకోండి
- చల్లని నీతితో స్నానం చేయండి
- ద్రవాహారాల్ని మరియు ఓరల్ రీహైడ్రేషన్ లవణాల్ని పుష్కలంగా తీసుకోండి
- కండరాల నొప్పిని తగ్గించడానికిగాను బాధకు గురైన కండరభాగాన్ని మెత్తగా రుద్దుతూ మసాజ్ చేయండి
వ్యక్తి వాంతులు లేదా వికారంతో బాధపడుతుంటే, అప్పుడు డాక్టర్ ఇంట్రావీనస్ (IV) ద్రవాలను (నరాల ద్వారా ద్రవాల్ని శరీరంలోకి ఎక్కించండం) అందిస్తారు. నొప్పికి చికిత్స చేయడానికి, డాక్టర్ నొప్పి-ఉపశమన మందులను కూడా సూచించవచ్చు.