అధిక ట్రైగ్లిజెరైడ్స్ అంటే ఏమిటి?
ట్రైగ్లిజరైడ్లు అనేవి మీ రక్తప్రవాహంలో కనిపించే ఓ రకమైన కొవ్వు పదార్థాలు. ఓ ప్రామాణిక కొలెస్ట్రాల్ పరీక్షలో మనం చూసే నాలుగు సంఖ్యలలో ఒకటి ఈ ట్రైగ్లిజరైడ్ల స్థాయిని తెలుపుతుంది. చాలా ఆహార కొవ్వులు ట్రైగ్లిజరైడ్స్, ఇవి ప్రారంభంలో కొవ్వు కణాలలో నిల్వ చేయబడతాయి, తరువాత రక్తప్రవాహంలోకి విడుదలవుతాయి. రక్తప్రసరణలో అధిక స్థాయి ట్రైగ్లిజెరైడ్లుండడం మన శరీరానికి నిజంగా హాని కలిగించవచ్చు. దీన్నే “హైపర్ ట్రైగ్లిసరిడామియా” అని కూడా పిలుస్తారు,
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణంగా, ట్రైగ్లిజరైడ్స్ యొక్క అధిక స్థాయిలు ఏ నిర్దిష్ట వ్యాధిలక్షణాలకు కారణం కావు.
అయినప్పటికీ, అవి కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఆ వ్యాధులు:
- ఆర్టెరియోస్క్లెరోసిస్ - రక్తనాళాల సంకుచితం మరియు గట్టిపడడం.
- కరోనరీ గుండె వ్యాధి - గుండె యొక్క కఠినమైన మరియు ఇరుకైన రక్త నాళాలు.
- స్ట్రోక్ - మెదడుకు రక్తాన్ని నిరోధించిన స్థితి.
- కడుపులో తీవ్రమైన నొప్పికి కారణమయ్యే ప్యాంక్రియాటైటిస్ .
ప్రధాన కారణాలు ఏమిటి?
హై ట్రైగ్లిజరైడ్స్ అనేక కారకాలు లేదా అంతర్లీన పరిస్థితుల ద్వారా సంభవించవచ్చు, అవేమంటే:
- ఊబకాయం.
- నియంత్రించని మధుమేహం.
- క్రియారహితమైన థైరాయిడ్.
- కాలేయం మరియు మూత్రపిండ వ్యాధి.
- జన్యు ప్రభావం.
- అరుగుదల శక్తిని మించి అధిక కేలరీల ఆహారాల్ని ప్రతి నిత్యం తినడం. (eating more calories than you burn).
- ఎప్పుడూ కూర్చునే ఉండే (సెడెంటరీ) జీవనశైలి.
- మద్యం చాలా తాగడం.
- ధూమపానం.
- మూత్రవిసర్జనకారక మందులు (శరీరం నుండి అదనపు నీటిని తొలగించడం) వంటివి, స్టెరాయిడ్స్, జనన నియంత్రణ మాత్రలు మరియు రోగనిరోధక వ్యవస్థను అణిచివేసే మందులు సేవించడం.
- హార్మోన్ల చికిత్సలో లేదా పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ తో బాధపడుతున్న స్త్రీలు అధిక ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని పొందే ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు.
దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
- వైద్య చరిత్ర మరియు ఇతర పరిశోధనల ఆధారంగా ట్రైగ్లిజరైడ్స్ యొక్క అధిక స్థాయిని నిర్ధారణ చేస్తారు.
- లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష మీ రక్తప్రవాహంలో అధిక ట్రైగ్లిజెరైడ్స్ పరిశీలించడానికి మరియు గుర్తించడానికి సిఫార్సు చేయబడుతుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయి 150 mg / dL ను సాధారణ స్థాయిగా పరిగణింపబడుతుంది.
- మీ డాక్టర్ మీ రక్తం నమూనాలను సేకరించేందుకు ముందు 12 గంటలపాటు ఉపవాసం చేయమని మీకు చెబుతారు.
- అధిక ట్రైగ్లిజరైడ్ స్థాయిల చికిత్స లక్ష్యం అంతర్లీన పరిస్థితులను పరిష్కరించడం మరియు వాటిని నియంత్రించడం.
- హార్మోన్ల స్థాయిలను సమతుల్యపరచడానికి మరియు ఏవైనా మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధిని చికిత్స చేయడానికి ఒక ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించాలి.
- స్టాటిన్స్, నియాసిన్ లేదా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ వంటి కొన్ని మందులను మీ డాక్టర్ మీకుసూచించవచ్చు.
స్వీయ రక్షణ:
- ధూమపానం లేదా మద్యపానాన్ని నివారించండి.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.
- ఓ క్రమమైన నడక (వ్యాహ్యాళినడక) షికార్లకెళ్ళండి మరియు తగినంతగా వ్యాయామాలు చేయండి.