అజీర్ణం అంటే ఏమిటి?
“అజీర్ణం” అనేది పొత్తికడుపు లేదా కడుపులో కలిగే ఒక అసౌకర్యం. తేన్పులు రావడం, గుండెల్లో మంట, కడుపులో గ్యాస్ చేరడం, మరియు ఉబ్బరం వంటి వివిధ లక్షణాలను వివరించడానికి ఉపయోగించే ఒక విస్తృత పదం “అజీర్ణం”. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి, జీవనశైలిలో మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు మరియు పట్టణీకరణం కారణంగా ఇటీవలి సంవత్సరాల్లో ఒత్తిడి స్థాయిలు ఎక్కువగా ఉండడం మూలంగా భారతీయుల్లో అజీర్ణం రుగ్మత చాలా సాధారణమైపోయింది. .
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అజీర్ణం అనేది గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం, ఉబ్బరం, వికారం, మారిన రుచి, స్థిరంగా వచ్చే తేన్పులు మరియు నొప్పి వంటి అనేక వ్యాధి లక్షణాలతో కూడిన ఒక విస్తృతపదం. ముఖ్యంగా భోజనం తర్వాత, ముఖ్యంగా ఒత్తిడి లేదా ఆందోళన సమయంలో లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి . అనేకమంది వ్యక్తులు ఒక సమావేశం, పరీక్ష లేదా ప్రదర్శనల ముందు లక్షణాల చరిత్రను గురిచేస్తారు.
ప్రధాన కారణాలు ఏమిటి?
దీర్ఘకాలిక ‘గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్’ వ్యాధి లేదా కడుపు పుండు సాధారణంగా అజీర్ణం యొక్క లక్షణాలకు దారితీస్తుంది; అయితే, అతిసాధారణంగా, సరికాని ఆహారపు అలవాట్లు, దీర్ఘకాల వ్యవధి తరువాత తినడం, నూనెతో కూడుకున్న పదార్థాలను అధికంగా తినటం మరియు ఎక్కువగా మద్యం సేవించడం వంటివి అజీర్ణానికి దారి తీస్తాయి. కడుపుబ్బరం లేక పొత్తి కడుపు ఉబ్బటంతో కూడిన అజీర్ణం సాధారణంగా తినే సమయంలో చాలా గాలిని మింగడం ఫలితంగా వస్తుంది. ఒత్తిడికి లోనవడం, అధికంగా కాఫీ సేవించడం మరియు ఒక అనియతకాలిక నిద్ర పద్ధతులు అజీర్ణం రుగ్మతకు తోడవడమే కాక వ్యాధి మరింత తీవ్రతరమవడానికి కారమమవుతాయి. అజీర్ణానికి ఇతర కారణాల్లో గ్యాస్ట్రిక్ శ్లేష్మనాళిక (lining) ను మంట పెట్టే కొన్ని మందులను తీసుకోవడం కూడా కారణమవచ్చు. వీటితోపాటు, భావోద్వేగ ఒత్తిడి కూడా అజీర్ణానికి సంబంధం కలిగి ఉంటుంది.
అజీర్ణం అనేది ఎలా నిర్ధారించబడుతుంది మరియు దీనికి చికిత్స ఏమిటి?
మీ వైద్యుడు మీకున్న అజీర్ణ రుగ్మత గురించిన వివరణాత్మక చరిత్రను రాబట్టుకుంటాడు మరియు అజీర్ణం యొక్క కారణాన్ని నిర్ధారించడానికి మరియు మీ కోసం ఉత్తమ చికిత్స ప్రణాళికను రూపొందించడానికి పూర్తి భౌతిక పరీక్షను నిర్వహిస్తారు. అజీర్ణం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళ కోసం ఎండోస్కోపీని చేయించామని వైద్యుడు కోరుతాడు. ఈ ఎండోస్కోపీ పరీక్షను అల్సర్ వ్యాధి (పేగుల్లో పుళ్ళు) లేదా గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ ని తనిఖీ చేయడానికి చేస్తారు.. తీవ్రమైన కేసుల్లో మినహా, అజీర్ణం నిర్ధారణలో రక్తం మరియు ఇమేజింగ్ పరీక్షలు ఏమంత ఉపయోగకరం కాదు.
చికిత్స ప్రధానంగా ప్రోటీన్ పంప్ ఇన్హిబిటర్లు మరియు H2- రిసెప్టర్ బ్లాకర్ల వంటి మెగ్నీషియం సల్ఫేట్ లేదా నోటి మందులు కలిగి ఉన్న యాంటాసిడ్ మందుల్ని కలిగి ఉంటుంది. అజీర్ణం ఎక్కువగా జీవనశైలి లోపంగా ఉన్నందున, స్వీయ రక్షణ చర్యలు అజీర్ణ రుగ్మత యొక్క నిర్వహణలో అంతర్భాగంగా ఉంటాయి. ఈ ప్రమాణాలలో నెమ్మదిగా తినడం, సాధారణ భోజనం తినడం, పుష్కలంగా ద్రవాలను త్రాగడం, క్రమంగా వ్యాయామం చేయడం, ఒత్తిడిని నిర్వహించడం, అత్యంత నూనెలు కల్గిన లేదా మసాలాలతో కూడిన ఆహారాన్ని తినకపోవడం, రాత్రిభోజనాన్ని ఆలస్యంగా తినడాన్ని తప్పించడం మరియు కెఫీన్ పదార్థాల సేవనాన్ని మరియు మద్యపానాన్ని తగ్గించడం వంటివి స్వీయ రక్షణ చర్యలే. "జీరా" లేదా జీలకర్ర కాషాయాన్ని సేవించడంవల్ల గ్యాస్, ఉబ్బరం మరియు గుండెల్లో మంటలను సులభంగా అధిగమించవచ్చు.