కీటకాలు కుట్టడం అంటే ఏమిటి?
కీటకాలు కుట్టడం అనేది చాలా సాధారణం మరియు బయట లేదా ఇంటిలో కూడా ఇది జరుగవచ్చు. అనేక సందర్భాల్లో, ఈ కీటకాల కాటులు కొన్ని గంటల్లో లేదా రోజుల్లో తగ్గిపోతాయి తీవ్రమైన సమస్యలకు దారితీయవు. కానీ కొన్ని సందర్భాల్లో, తీవ్ర ప్రతిస్పందన (రియాక్షన్) కలిగించవచ్చు లేదా మలేరియా లేదా లైమ్ వ్యాధి వంటి అనారోగ్యాలను కూడా కలిగించవచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రతి ఒక్క పురుగు/కీటకం కాటు కలిగించే సంకేతాలు వేరు వేరుగా ఉంటాయి, కానీ చాలా కీటకాల కాటుల వలన కలిగే సాధారణ లక్షణాలు కొన్ని ఉన్నాయి. సాధారణంగా చర్మం మీద ఎర్రగా ఉండే ఒక చిన్న దద్దురు లేదా బొడిపెను గమనించవచ్చు.కీటకం కుట్టిన ప్రదేశం వద్ద దురద, మంట లేదా చాలా నొప్పిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, ఆ ప్రదేశంలో చాలా వేడి ఉత్పన్నమవుతుంది, లేదా తిమ్మిరిగా కూడా ఉండవచ్చు. చిన్న కాటుకి ఇంట్లోనే జాగ్రత్తలు పాటించవచ్చు. ఎక్కువగా ఉన్న సంకేతాలు కొన్ని గంటల్లో తగ్గిపోవచ్చు, మరియు దాని జాడలు అన్ని ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గిపోతాయి.పురుగులు/కీటకాల కాటులకి చాలా సున్నితంగా ఉండేవారికి అనాఫిలాక్టిక్ షాక్ సంభవిస్తుంది, దీనిలో గొంతు నొక్కుకుపోయినట్టు అనిపిస్తుంది మరియు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కందిరీగలు, గుమ్మడి పురుగులు, నల్లులు, దోమలు, తేనెటీగలు మరియు తుమ్మెదలు వంటివి సాధారణంగా కుట్టే కీటకాలు. ఈ కీటకాలలో ఏవైనా కుట్టినప్పుడు, వాటి విషం శరీరంలోనికి చొచ్చుకుపోతుంది మరియు సాధారణంగా గమనింపబడే లక్షణాల ద్వారా శరీరం స్పందిస్తుంది. ఆ విషంలో ఏవైనా సంక్రమణను కలిగించే క్రిములు ఉంటే అది వ్యాధులను కూడా కలిగించవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు కీటకాల కాటులను చాలా సులువుగా నిర్దారిస్తారు లేదా అయినప్పటికీ వ్యక్తి కుట్టిన పురుగుని గుర్తిస్తే చికిత్స సులువుగా ఉంటుంది.
చాలా కీటకాల కాటులకి సాధారణ గృహ సంరక్షణ సరిపోతుంది. కీటకం కుట్టిన ప్రదేశాన్ని శుభ్రంగా కడగాలి, చికాకు మరియు వేడి నుండి ఉపశమనం కలగడానికి ఐస్ ప్యాక్ ఉపయోగించవచ్చు లేదా ఏదైనా క్రీమ్ను పూయవచ్చు. నిరంతరంగా దురద ఉంటే, బేకింగ్ సోడా మరియు నీటిని కలిపిన పేస్టును ఉపయోగించవచ్చు.
వ్యక్తి యొక్క లక్షణాలు మరియు పరిస్థితి తీవ్రంగా ఉంటే, తక్షణ వైద్య సంరక్షణ అందించాలి. దీనిలో వ్యక్తి యొక్క బట్టలను వదులు చేయడం, వ్యక్తిని ఒక వైపుగా తిప్పడం లేదా సిపిఆర్ (CPR) ను చేయటం కూడా ఉంటాయి. తేనెటీగ కుట్టినప్పుడు, విషం మరింతగా వ్యాపించకుండా ఉండడానికి దాని కొండి (స్టింగర్)ను తొలగించడం ముఖ్యం.
యాంటీ-హిస్టామిన్లు మరియు నొప్పి నివారుణులు నొప్పి, వాపు మరియు దురద తగ్గిస్తాయి.