కవసాకి వ్యాధి - Kawasaki Disease in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 03, 2018

March 06, 2020

కవసాకి వ్యాధి
కవసాకి వ్యాధి

కవసాకి వ్యాధి అంటే ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా గుండె వ్యాధికి కవసాకి వ్యాధియే ప్రధాన కారణం. ఈ వ్యాధి చిన్న పిల్లలను బాధిస్తుంది, అందులోను ఎక్కువగా ఐదేళ్లలోపు పసివాళ్లకు సోకుతుందిది. దీని బారిన పడే చిన్న పిల్లల్లో 3 సంవత్సరాల వయసు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలే 70 శాతం ఉంటారు. వ్యాధిని ముందుగానే నిర్ధారణ చేసి, చికిత్స చేస్తే, ఆ తర్వాత శిశువు భవిష్యత్ అభివృద్ధిపై ఈ రుగ్మత ఎలాంటి ప్రభావాన్ని చూపదు. ఇది భయపెట్టే వ్యాధే అయినప్పటికీ, ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కవసాకి వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు విలక్షణమైన జట్టుగా కిందివిధంగా ఉంటాయి:

  • జ్వరం, ఇది 5 రోజులు లేదా అంతకంటే ఎక్కువకాలం ఉంటుంది
  • దద్దుర్లు
  • చేతులు మరియు పాదాల వాపు
  • కంటిలోని తెల్లటి భాగంలో (తెల్ల కనుగుడ్డు) చికాకు కలగడం మరియు ఎరుపెక్కడం  (మరింత చదువు: ఎరుపు కళ్ళు చికిత్స )
  • మెడలో శోషరస గ్రంథుల వాపు
  • నోరు, పెదవులు మరియు గొంతు యొక్క చికాకు మరియు వాపు

కంటి వ్యాధిలో చీము ఉండదు, అయితే ఈ కళ్ళజబ్బు రెండు కళ్ళకూ సంభవిస్తుంది. దిగువ మరియు ఎగువ అవయవాలలో వాపు మరియు దద్దుర్లు దాదాపు ఎల్లప్పుడూ ఉంటాయి. శరీరం అంతటా ధమనులు ఎర్రబడుతాయి.

గుండె యొక్క హృదయ ధమనుల యొక్క వాపు ప్రమాదకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. ధమనుల యొక్క అంతర్గత కండరాలు, మృదువుగా, నున్నగా ఉంటాయివి,  బలహీనపడటం మరియు అనూరిజం (aneurysm) అనబడే రక్తనాళము యొక్క విపరీత వాపు లేదా ఊదుడుకు (balloning) దారి తీయవచ్చు. ఈ విపరీతమైన ఊదుడు కొనసాగితే ఆనూరిసమ్స్ విరిగిపోతాయి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కవాసకి వ్యాధికి స్పష్టమైన కారణం లేదు. ఒక వైరస్ వల్ల కలిగే వ్యాధి కావచ్చునని పరిశోధకులు కొన్ని ఆధారాలను అందించారు. అంతేకాకుండా, కొందరు పిల్లల్లో ఈ వ్యాధి రావడానికి జన్యుపరమైనపూర్వానుకూలం కలిగి ఉండవచ్చు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

కవసాకి వ్యాధి నిర్ధారణకు నిర్దిష్ట పరీక్ష లేదు. అందువలన, రోగనిర్ధారణ ఎక్కువగా క్లినికల్ ఉంటుంది, అనగా, అన్ని ఇతర సంబంధిత వ్యాధుల్ని తోసిపుచ్చాల్సి ఉంటుంది. రక్తనాళాలపై కవసాకి వ్యాధి యొక్క ప్రభావాన్ని పర్యవేక్షించాలని డాక్టర్ కోరుకుంటారు మరియు ఈ ప్రయోజనం కోసం ECG, ఆంజియోగ్రఫీ, మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. హృదయ ధమనుల మీద ఎలాంటి ప్రభావము కనిపించకపోతే, పిల్లవాడు పూర్తిగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. 95% కవసాకి రోగుల వైద్యకేసుల్లో ఇలా కోలుకోవడమే జరుగుతుంది.

చికిత్స, నొప్పి, జ్వరం మరియు వాపు తగ్గించడానికి ఇచ్చే మందులతో ప్రారంభమవుతుంది. ఇది సురక్షితంగా ఆస్పిరిన్తో చేయబడుతుంది, ఇది రక్తం గడ్డ కట్టడాన్నినివారిస్తుంది. ఇమ్యునోగ్లోబులిన్ ఎ ని 12 గంటలపాటు నరాలద్వారా ఎక్కించడం జరుగుతుంది. దీనికి ప్రతిస్పందించని శిశువులకు స్టెరాయిడ్లతో భర్తీ చేయబడుతుంది.



వనరులు

  1. National Health Service [Internet]. UK; Overview - Kawasaki disease
  2. American Heart Association. Kawasaki Disease. [Internet]
  3. Nathan Jamieson, Davinder Singh-Grewal et al. Kawasaki Disease: A Clinician's Update. Int J Pediatr. 2013; 2013: 645391. PMID: 24282419
  4. D Eleftheriou et al. Management of Kawasaki disease. Arch Dis Child. 2014 Jan; 99(1): 74–83. PMID: 24162006
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Kawasaki Disease

కవసాకి వ్యాధి వైద్యులు

Dr. Manoj Kumar S Dr. Manoj Kumar S Orthopedics
8 Years of Experience
Dr. Ankur Saurav Dr. Ankur Saurav Orthopedics
20 Years of Experience
Dr. Pritish Singh Dr. Pritish Singh Orthopedics
12 Years of Experience
Dr. Vikas Patel Dr. Vikas Patel Orthopedics
6 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

కవసాకి వ్యాధి కొరకు మందులు

Medicines listed below are available for కవసాకి వ్యాధి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.