చర్మ క్యాన్సర్ అంటే ఏమిటి?
చర్మ క్యాన్సర్ అనేది క్యాన్సర్లలోని అత్యంత సాధారణ రకాలలో ఒకటి. ఇది చర్మ కణాల యొక్క అసాధారణ అభివృద్ధి కారణంగా ఏర్పడే ఒక పరిస్థితి/సమస్య దీనికి శరీరం అంతటా వ్యాపించే సామర్ధ్యం ఉంటుంది. చర్మ క్యాన్సర్ను సరైన సమయాని నిర్ధారించినట్లయితే, దాని చికిత్స అనేది అత్యంత ప్రభావవంతమైనదిగా ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చర్మ క్యాన్సర్ను మూడు విధాలుగా విభజించవచ్చు, వీటిలో ప్రతి ఒక్క దాని యొక్క సంకేతాలు మరియు లక్షణాల కొంచెం భిన్నముగా. మూడు రకాల చర్మ క్యాన్సర్లు మరియు వాటి లక్షణాలు, సంకేతాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- బేసల్ సెల్ స్కిన్ క్యాన్సర్ (Basal cell skin cancer) - ఇది చర్మపు క్యాన్సర్ల యొక్క అత్యంత సాధారణ రకం, ఇది సాధారణంగా అపారదర్శక (translucent ) రూపాన్ని కలిగి ఉండే చిన్న చిన్న మెరిసే లేదా తెల్లని గడ్డల వలె కనిపిస్తుంది.
- స్క్వేమస్ సెల్ స్కిన్ క్యాన్సర్ (Squamous cell skin cancer) - ఇది గరుకైన ఉపరితలంతో ఉండే గులాబీ రంగు గడ్డలా కనిపిస్తుంది.
- మెలనోమా (Melanoma) - చర్మ ఉపరితలంపై నల్లని మచ్చలు లేదా గడ్డల వలె కనిపిస్తుంది.
ఈ గడ్డలు మరియు దద్దుర్లు సమయంతో పాటు శరీర ఉపరితలం అంతటా వ్యాపిస్తాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చర్మ క్యాన్సర్ అభివృద్ధికి ప్రాథమిక/ముఖ్య కారణం సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలకు (ultraviolet radiation) అధికంగా చర్మం గురికావడం/బహిర్గతం కావడం.
చర్మ క్యాన్సర్ ప్రమాదం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారికి ప్రముఖంగా ఉంటుంది మరియు లేత లేదా తెల్లని చర్మ రంగు ఉన్నవారికి కూడా ఉండవచ్చు ఎందుకంటే వారి చర్మంలో మెలనిన్ ఏర్పడటంలో కొరత/లోపం ఉంటుంది.
చర్మ క్యాన్సర్ అభివృద్ధికి దారితీసే ఇతర కారణాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- అధిక సంఖ్యలో పూట్టుమచ్చలు (moles) ఉండడం
- గతంలో చర్మ క్యాన్సర్ యొక్క నిర్ధారణ జరగడం
- ముఖం మీద అధికంగా మచ్చలు ఉండడం
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
చర్మ క్యాన్సర్ సాధారణంగా సాధారణ వైద్యులు (general physician) లేదా చర్మవ్యాధి నిపుణుడిచే నిర్ధారణ చేయబడుతుంది.
రోగి చర్మ క్యాన్సర్ యొక్క సంకేతాలను చూపిస్తే నిర్ధారణను ధృవీకరించడానికి బయోప్సీ అత్యంత సాధారణ పరీక్ష. బేసల్ సెల్ స్కిన్ క్యాన్సర్ విషయంలో, అది ఇతర భాగాలకు వ్యాప్తి చెందదు కాబట్టి ఎటువంటి ఇతర పరీక్షలు అవసరం ఉండవు, అయితే, మిగిలిన రెండు రకాల చర్మ క్యాన్సర్లలో వ్యాధి యొక్క వ్యాప్తిని గుర్తించేందుకు మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. ఈ పరీక్షలలో క్యాన్సర్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి శోషరస కణుపుల (లింఫ్ నోడ్ల) యొక్క ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ (FNA, Fine Needle Aspiration) నిర్వహించడం జరుగుతుంది.
చర్మ క్యాన్సర్ చికిత్సలలో మెలనోమా కాని (non-melanoma) చర్మ క్యాన్సర్లకు శస్త్రచికిత్సా లేని పద్ధతులు (non-surgical methods) ఉంటాయి. దానిలో క్రయోథెరపీ (cryotherapy), క్యాన్సర్ వ్యతిరేక క్రీమ్లు (anti-cancer creams), ఫోటోడైనామిక్ థెరపీ (anti-cancer creams) లేదా గైడెడ్ రేడియోథెరపీ (guided radiotherapy) వంటివి ఉంటాయి.
మెలనోమా చర్మ క్యాన్సర్ విషయంలో, దశ ఆధారిత (staged) చికిత్సలు మెలనోమా కాని చర్మ క్యాన్సర్ యొక్క చికిత్సల వలె ఉంటాయి, అయినప్పటికీ మెలనోమా చర్మ క్యాన్సర్ యొక్క చివరి దశలలో ప్రభావిత చర్మపు కణజాలాన్ని తొలగించి కొత్త కణజాలంతో మార్చడానికి శస్త్రచికిత్స యొక్క అవసరం ఉంటుంది.