మయస్తినియా గ్రేవిస్ అంటే ఏమిటి?
మయస్తినియా గ్రేవిస్ (MG) అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ యొక్క అసాధారణ పనితీరు వలన సంభవించే ఒకరకమైన వ్యాధి, ఇది, తద్వారా శరీర కణజాలాలను ప్రభావితం చేసి వాపును మరియు నష్టాన్ని కలిగిస్తుంది. ఇది నరములు మరియు కండరాల మధ్య ఉండే కెమికల్ మెసేజెస్ యొక్క ప్రసారాన్ని ప్రభావితం చేస్తుంది, అవి శరీరంలోని దాదాపు అన్ని కదలికలు మరియు చర్యలకు దోహదపడతాయి. ఇది వివిధ వయస్సుల గల పురుషులు మరియు మహిళలు ఇద్దరిని ప్రభావితం చేస్తుంది. ఇది మహిళల్లో కొంచెం చిన్న వయసులోనే కనిపిస్తుంది మరియు పురుషులలో పెద్ద వయసులో గమనించవచ్చు. వాపు కారణంగా, వివిధ కండరాలలో కదలికలను కలిగించే/సహాయపడే శక్తికి (energy) ఒక క్రముముగా నష్టం వాటిల్లుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- కండరాల బలహీనత
- కంటి కండరాల బలహీనత కారణంగా రెండుగా కనిపించడం
- మాట్లాడే సమయంలో ఇబ్బంది
- బలహీనమైన గొంతుక
- నమలడం మరియు మ్రింగడంలో కఠినత
- శ్వాస తీసుకోవడంలో కష్టం
- బరువులు ఎత్తడంలో సమస్యలు
ఈ లక్షణాలకు చికిత్స చేయకుండా వదిలేస్తే వ్యాధి అధికమవుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
శరీరం యొక్క సొంత రోగనిరోధక వ్యవస్థ పొరపాటుగా/తప్పుగా మెదడు మరియు కండరాల యొక్క నెర్వ్ (నరాల) టెర్మినల్స్ మధ్య ఉన్న ఆరోగ్యకరమైన కణాల మీద దాడి చేసినప్పుడు మయస్తినియా గ్రేవిస్ సంభవిస్తుంది. కణాల మధ్య సందేశాలను తీసుకువెళ్లే ఎసిటైల్ కోలిన్ (acetylcholine) అని పిలువబడే కెమికల్ మెసెంజర్ (రసాయన సందేశాలను తీసుకువెళ్లేది) స్థాయిలు తగ్గిన కారణంగా ఈ కణాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితి ప్రమాదాన్ని పెంచే కారకాలు:
- రోగనిరోధక శక్తిని నియంత్రించే థైమస్ గ్రంథులు (thymus glands) బలహీనపడినప్పుడు
- క్యాన్సర్
- మయస్తినియా గ్రేవిస్ యొక్క కుటుంబ చరిత్ర
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
నరాల పరీక్ష (neurological examination) నిర్వహించబడుతుంది అది వీటిని నిర్దారిస్తుంది
- కండరాల బలహీనత యొక్క తీవ్రత
- కండరాల యొక్క పరిస్థితి
- ప్రతిచర్యలు (Reflexes)
- పరీక్ష ద్వారా కంటి లోపాన్ని పరిశీలించడం
- కండరాల సమన్వయం
ఒక వివరణాత్మక ఆరోగ్య చరిత్ర తీసుకోబడుతుంది. ఇతర పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి
- కెమికల్ మెసెంజర్ అసిటైల్ కోలిన్ (acetylcholine) యొక్క అంచనా
- ఎడ్రోఫోనియం క్లోరైడ్ పరీక్ష (Edrophonium chloride test) అనేది కండరాల కదలికను తనిఖీ చేయగల ఒక విశేషమైన పరీక్ష
- కండరాల కణజాలం యొక్క ఎలెక్ట్రికల్ ఆక్టివిటీని (electrical activity) నమోదు చేసే ఎలెక్ట్రోమయోగ్రఫీ (Electromyography)
- థైమస్ గ్రంధుల తనిఖీ కోసం సిటి (CT) స్కాన్ మరియు ఎంఆర్ఐ (MRI)
- శ్వాస యొక్క బలాన్ని కొలవడానికి ఊపిరితిత్తుల పరీక్ష
ప్రస్తుతం మయస్తినియా గ్రేవిస్కు ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు. చికిత్సలో లక్షణాలను నిర్వహించడం మరియు రోగనిరోధక వ్యవస్థ పనితీరును నియంత్రించడం వంటివి ఉంటాయి.
- రోగనిరోధక శక్తిని మరియు కార్టికోస్టెరాయిడ్లను తగ్గించే మందులు ఉపయోగకరంగా ఉంటాయి. నరాల (nerve cells) మరియు కండరాల మధ్య మెదడు యొక్క సంకేతాలను మెరుగుపర్చడానికి పైరిడోస్టిగ్మైన్ (Pyridostigmine) ఉపయోగించబడుతుంది. రోగనిరోధక వ్యవస్థలోని అసాధారణతను ఎదుర్కోవడానికి ఇంట్రావీనస్ గ్లోబులిన్ (నరలోనికి ఎక్కించే గ్లోబులిన్) అనే ఒక బ్లడ్ (రక్త) ఆధారిత ఉత్పత్తి సహాయపడుతుంది.
- థైమస్ గ్రంధి యొక్క తొలగింపుకు సంబంధించిన శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
- ప్లాస్మా యొక్క మార్పిడి కూడా కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది.
మయస్తినియా గ్రేవిస్కు యొక్క లక్షణాలను తగ్గించడంలో కొన్ని జీవనశైలి మార్పులు కూడా సహాయపడవచ్చు:
- కండరాల బలహీనత తగ్గించడానికి విశ్రాంతి.
- ఒత్తిడిని మరియు వేడికి గురికావడాన్ని తగ్గించాలి/నివారించాలి.