న్యూరోలెప్టిక్ మెలిగ్నెంట్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
న్యూరోలెప్టిక్ మెలిగ్నెంట్ సిండ్రోమ్ (ఎన్ఎంయస్) అనేది యాంటిసైకోటిక్ (antipsychotic) మందుల వాడకం యొక్క ఫలితంగా సంభవించే ఒక ప్రమాదకరమైన పరిస్థితి. యాంటిసైకోటిక్స్ అనేవి అల్జీమర్స్, పార్కిన్సోనిజం, బైపోలార్ డిజార్డర్, కుంగుబాటు మరియు ఆందోళన వంటి రుగ్మతల యొక్క చికిత్సలలో ఉపయోగించే మందులు. ఇది ఒక అరుదైన పరిస్థితి, పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే, మరణానికి కూడా దారితీయవచ్చు; అందువల్ల, న్యూరోలెప్టిక్ మెలిగ్నెంట్ సిండ్రోమ్ యొక్క మొట్టమొదటి సంకేతంతోనే వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చడం అవసరం.
భారత జనాభాలో ఎన్ఎంయస్ యొక్క సంభవం అనేది 1000 మంది యాంటిసైకోటిక్ మందులను ఉపయోగించే కేసులకు 1.40 - .41 గా ఉన్నట్లు గుర్తించబడింది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
యాంటిసైకోటిక్ (antipsychotic) మందులను తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు లేదా వాటి మోతాదు పెంచినప్పుడు వ్యక్తి లక్షణాలను ఎదుర్కొనవచ్చు. 1 -2 వారాలలో ఒక వ్యక్తి అనుభవించే లక్షణాలు:
- 38ºC ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండే జ్వరం, కానీ 40ºC కన్నా తక్కువగా ఉంటుంది
- కండరాల గట్టిదనం
- వణుకు
- కదలికలలో సమస్య
- మాట్లాడడంలో సమస్య
- గందరగోళం
- హృదయ స్పందన రేటు పెరగడం
- శ్వాస రేటు పెరగడం
- మానసిక కలతలు
- అసాధారణ రక్తపోటు
- చెమటలు
- అసంకల్పిత మూత్రవిసర్జన (ఆపుకొనలేని)
- క్రియాటినిన్ కైనెస్ (creatinine kinase) స్థాయిలు పెరగడం
- మూత్రంలో ప్రోటీన్
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
యాంటీసైకోటిక్స్ వలన డోపామైన్ రిసెప్టార్లు (dopamine receptors) నిరోధించబడడం వలన న్యూరోలెప్టిక్ మెలిగ్నెంట్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. డోపమైన్ అనేది నరాల ద్వారా సందేశల ప్రసారం (nerve message transmission) లో సహాయపడే ఒక పదార్ధం. నెర్వ్ రిసెప్టార్లలో డోపమైన్ లేకపోవడం అనేది ఎన్ఎంయస్ కు దారితీస్తుంది. ఈ జీవక్రియ (మెకానిజం) యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు.
ఎన్ఎంయస్ యొక్క ఇతర ప్రమాద కారకాలు:
- 2 లేదా అంతకంటే ఎక్కువ యాంటీ-సైకోటిక్స్ యొక్క ఉపయోగం
- యాంటి-సైకోటిక్స్ యొక్క మోతాదులో ఆకస్మిక పెరుగుదల
- యాంటీ-సైకోటిక్ మందులను ఓరల్ (నోటి ద్వారా) తీసుకోకపోవడం
- డీహైడ్రేషన్ (నిర్జలీకరణము)
- మత్తు మందుల (anaesthetic drugs) ఉపయోగం
- డోపామైన్ రిసెప్టర్ల మీద పనిచేసే మందుల వాడకం
- వాంతుల వ్యతిరేక (Anti-vomiting) మందులు
- న్యూరోలెప్టిక్ మెలిగ్నెంట్ సిండ్రోమ్ యొక్క గత చరిత్ర
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
న్యూరోలెప్టిక్ మెలిగ్నెంట్ సిండ్రోమ్ ను నిర్ధారించడానికి నిర్దిష్ట/ప్రత్యేక పరీక్షలు అందుబాటులో లేవు. కాబట్టి వైద్యులు రక్త పరీక్ష, ఎలెక్ట్రోలైట్ పరీక్ష, మరియు మూత్ర పరీక్ష వంటి పరీక్షలను సిఫార్సు చేస్తారు. కొన్నిసార్లు, వైద్యులు ఇమేజింగ్ పరీక్షలు లేదా ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రామ్ (EEG, electroencephalogram) ను కూడా సిఫార్సు చేస్తారు.
న్యూరోలెప్టిక్ మెలిగ్నెంట్ సిండ్రోమ్ ఒక అత్యవసర వైద్య పరిస్థితి, కాబట్టి వెంటనే వైద్య సహాయం అవసరం. ముందుగా, వైద్యులు న్యూరోలెప్టిక్ మెలిగ్నెంట్ సిండ్రోమ్ ఏ మందుల ఫలితంగా సంభవించిందో వాటిని ఆపమని ఆదేశిస్తారు. అప్పుడు, లక్షణాలకు చికిత్స చేస్తారు. హైపర్ థెర్మియా (అధిక శరీర ఉష్ణోగ్రత) కోసం, శరీరాన్ని చల్లబరచే చర్యలు తీసుకుంటారు అలాగే శరీరం కోల్పోయిన ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్లను పునరుద్ధరించే చర్యలు తీసుకుంటారు. వైద్యులు ఎన్ఎంయస్ అభివృద్ధి యొక్క ప్రమాదం తక్కువగా ఉండే కోత్త మందులను సూచిస్తారు, కాని వాటికి కూడా క్రమమైన పర్యవేక్షణ అవసరమవుతుంది. సాధారణంగా, రికవరీ 7-14 రోజులలో కనిపిస్తుంది.