అండాశయ క్యాన్సర్ అంటే ఏమిటి?
స్త్రీ శరీరంలో అండాలను ఉత్పత్తి చేసే అవయవం (అండాశయం) యొక్క క్యాన్సర్ ను గర్భాశయ క్యాన్సర్ అని పిలుస్తారు. అండాశయ కణితులు నిరపాయమైనవి (క్యాన్సర్ కానివి) లేదా ప్రాణాంతక (క్యాన్సర్ కలిగించేవి). ఇది అత్యంత ప్రమాదకరమైన స్త్రీ జననేంద్రియాలకు సంభందించిన క్యాన్సర్లలో ఒకటి మరియు సాధారణంగా పెద్ద వయసు స్త్రీలలో కనిపిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అండాశయ క్యాన్సర్ చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది అందువలన, ప్రారంభ దశల్లో దీనిని గుర్తించడం చాలా కష్టం. కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- ఋతు చక్రాలలో అసాధారణతలు.
- లైంగిక సంభోగ సమయంలో నొప్పి.
- గుండెల్లో మంట.
- నడుము మరియు పొత్తికడుపు భాగాల నొప్పి.
- పొత్తికడుపు ప్రాంతంలో వాపు.
- ఆకలిలేమి.
- బరువు తగ్గుదల.
- వికారం.
- మలబద్ధకం.
- ఉబ్బరం.
- శ్వాస ఆడకపోవడం.
- అలసట.
- తరచుగా మూత్ర విసర్జన.
ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) లక్షణాలు కూడా అండాశయ క్యాన్సర్ సంకేతాలు మరియు లక్షణాల వలె ఉంటాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అండాశయ క్యాన్సర్ యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా అర్థం కాలేదు లేదా తెలియలేదు. కొన్ని సాధారణ ప్రమాద కారకాలు:
- సంక్రమిత జన్యు మార్పులు [మ్యూటేషన్లు ](ఉదాహరణకు, BRCA1 / 2, HNPCC వంటివి).
- పిల్లలు లేని మహిళలు.
- ఒత్తిడి.
- సంతానలేమి యొక్క చికిత్స కొరకు ఉపయోగించిన మందులు యొక్క దుష్ప్రభావాలు.
- అండాశయ లేదా రొమ్ము క్యాన్సర్ యొక్క కుటుంబ చరిత్ర ఉండడం.
- ఇతర సంభావ్య ప్రమాద కారకాలు ధూమపానం, పాశ్చాత్య ఆహార విధానం, ఊబకాయం, డియోడరెంట్ల వాడకం, టల్కమ్ పౌడర్, పర్యావరణ కాలుష్యం, చిన్నతనంలో పేదరికం మరియు పోషకాహారలోపం వంటివి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
అండాశయ క్యాన్సర్ నిర్ధారణకు వైద్యులు వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు:
-
ఉదరం మరియు పొత్తికడుపు యొక్క అల్ట్రాసౌండ్
అండాశయాల వ్యాధుల విషయంలో, సాధారణంగా ఆల్ట్రాసౌండ్ను మొదటి నిర్దారణ పరీక్షగా ఉపయోగిస్తారు. -
సిటి (CT) స్కాన్
దీనిని పెద్ద కణితులను గుర్తించడానికి ఉపయోగిస్తారు, కానీ దీనితో చిన్నకణితులను గుర్తించడం సాధ్యం కాదు. -
ఎంఆర్ఐ (MRI) స్కాన్
ఇది మెదడు లేదా వెన్నుముకకు క్యాన్సర్ యొక్క వ్యాప్తిని గుర్తించడంలో సహాయపడుతుంది. -
రక్త పరీక్షలు
అండాశయంలోని క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చేసే CA-125 స్థాయిని గుర్తించడానికి CA-125 పరీక్ష జరుగుతుంది.
క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత, వీటిని ఉపయోగించి చికిత్స చేస్తారు -
- కీమోథెరపీ.
- సర్జరీ.
- రేడియేషన్ థెరపీ.
ఆక్యుపంక్చర్, మూలికా ఔషధాలు (herbal medicine), ధ్యానం మరియు యోగా వంటి కొన్ని సహాయక చికిత్సలు కూడా సాధారణ చికిత్సతో పాటు ఉపయోగించబడతాయి.