ఫాస్ఫరస్ (భాస్వరం) లోపం - Phosphorus Deficiency in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

December 21, 2018

March 06, 2020

ఫాస్ఫరస్ లోపం
ఫాస్ఫరస్ లోపం

భాస్వరలోపం (ఫాస్పరస్ డెఫిషియన్సీ) అంటే ఏమిటి?

ఫాస్పరస్ అనేది మానవ శరీరంలో ఉండే రెండవ అత్యంత విస్తారమైన పదార్ధం, ఇది అనేక విధుల్ని నిర్వర్తిస్తుంది. మన ఆహారంలో కలిగే ఈ సూక్ష్మపోషకాహార లోపం పలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

ఇది మా DNA వంటి శరీరంలో అనేక అణు భాగాలలో భాగం, మరియు మా శరీరంలో ఏర్పడిన శక్తి అణువులలో కూడా ఇది ఉంటుంది. శరీరంలో భాస్వరం యొక్క మెజారిటీ ఎముకలలో ఉంటుంది, మిగిలినవి మృదు కణజాలం మొత్తం పంపిణీ చేయబడతాయి. కణ పెరుగుదలకు మరియు శక్తిని పొందటానికి జరిగే ప్రక్రియలో ఆహారాన్ని బద్దలు కొట్టడానికి భాస్ఫరస్ అవసరం. భాస్వరం ఎముక ఆరోగ్యానికి అవసరం.

దీని ప్రధాన సంబంధ సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఫాస్ఫరస్ లోపం యొక్క లక్షణాలు:

శిశువులు మరియు పెరుగుతున్న పిల్లలలో భాస్వరం యొక్క లోపం హానికరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది మరియు ఎముక వైకల్యాలు మరియు దీర్ఘకాలిక వ్యాధులకు దారితీయవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఫాస్ఫరస్ లోపం యొక్క ప్రాధమిక కారణం సారంలేని (పేలవమైన) ఆహారం. అంటే పోషకాహార లోపంతో కూడిన చిరుతిళ్ళు లేక జంక్ ఫుడ్ ఎక్కువగా తినడంవల్ల కూడా కావచ్చు. భాస్వరం అనేక సహజ ఆహార పదార్ధాలలో ఉంటుంది మరియు అందువల్లనే ఫాస్ఫరస్ లోపం చాలా విరళంగా  కన్పిస్తుంది.

రోజూ కొన్ని ఔషధాలను సేవించడం అనేది భాస్వర శోషణలో జోక్యం చేసుకోవచ్చు. ఈ మందులలో యాంటాసిడ్స్ ఉన్నాయి.

అయినప్పటికీ, మెగ్నీషియంలోపం వల్ల శరీరంలో భాస్వరం యొక్క పేలవమైన శోషణం కూడా సంభవిస్తుంది, ఇది ఫాస్ఫరస్ లోపానికి  దారి తీస్తుంది. పెద్దవారికి రోజూ వెయ్యి మిల్లీ గ్రాముల (1000 mg/day) భాస్వరం (RDI ప్రకారం) అవసరం అవుతుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

రక్త పరీక్ష, సంకేతాలు మరియు లక్షణాల ఉనికి ద్వారా డాక్టర్ భాస్వరం లోపాన్ని గుర్తించవచ్చు.

భాస్వరం (ఫాస్ఫరస్) లోపాన్ని అధిగమించడానికి, డాక్టర్ ఆహారం మార్పులు చేసుకోమని సలహా ఇస్తారు. ప్రత్యేకించి ఫాస్ఫరస్ ఎక్కువగా కలిగిఉన్న కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఉన్నాయి, అవేవంటే:

క్రమమైన పద్ధతిలో ఆహారం మార్పులు ద్వారా భాస్వరం లోపం నిర్వహణ తరచుగా ఉత్తమ విధానం. అయితే, డాక్టర్ బహువిధ ఆరోగ్యపోషకాల అనుబంధకాల్ని (మల్టీవిటమిన్ సప్లిమెంట్లను) సిఫారసు చేయవచ్చు.వనరులు

  1. National Health and Medical Research Council. Phosphorus. Australian Government: Department of Health
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Phosphorus in diet.
  3. Institute of Medicine (US) Standing Committee on the Scientific Evaluation of Dietary Reference Intakes. Dietary Reference Intakes for Calcium, Phosphorus, Magnesium, Vitamin D, and Fluoride. Washington (DC): National Academies Press (US); 1997. 5, Phosphorus
  4. Linus Pauling Institute [Internet]. Corvallis: Oregon State University; Phosphorus.
  5. VA Pittsburgh Healthcare System. Phosphorus. U.S. Department of Veterans Affairs,Washington DC.

ఫాస్ఫరస్ (భాస్వరం) లోపం కొరకు మందులు

Medicines listed below are available for ఫాస్ఫరస్ (భాస్వరం) లోపం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.