పునరుత్పత్తి వ్యవస్థ ఇన్ఫెక్షన్లు అంటే ఏమిటి?
పునరుత్పత్తి వ్యవస్థ ఇన్ఫెక్షన్లు పురుషులు మరియు స్త్రీలు ఇద్దరి జననేంద్రియాలను దెబ్బ తీస్తాయి. ఈ జనన మండల అంటురోగాలు శరీరంలోనే నివసించే సూక్ష్మజీవులు లేదా చుట్టుప్రక్కల నుంచి ప్రవేశించిన సూక్ష్మజీవుల వల్ల సంభవించవచ్చు. అంటువ్యాధులు లైంగికంగా బదిలీ చేయబడినవి అని లేదా అలైంగికంగా బదిలీ చేయబడినవని రెండుగా వర్గీకరించవచ్చు. అలైంగికంగా బదిలీ చేయబడే జనన మండల రోగాలు మహిళలలో చాలా సాధారణం.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అంటువ్యాధుల కష్టాలు మహిళల్లోనే ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఈ అంటురోగాలు ఎక్కువగా వ్యాధిలక్షణ రహితంగా ఉంటాయి అంటే ఎలాంటి వ్యాధి లక్షణాలు గుర్తించలేనివిగా ఉంటాయి. అయినప్పటికీ, యోని ఉత్సర్గ అనేది స్త్రీలలో కనిపించే విలక్షణమైన వ్యాధి లక్షణం. మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థ అంటువ్యాధుల ఇతర సంకేతాలు:
- జననేంద్రియ నొప్పి.
- మూత్ర విసర్జన సమయంలో మండుతున్నట్లుండడం మరియు దురద కల్గడం.
- జననేంద్రియ పుండ్లు.
- ఋతుక్రమ సమయంలో నొప్పి.
- దిగువ పొత్తికడుపు నొప్పి.
- బాధాకరమైన సంభోగం.
మగవాళ్ళ జననమండల వ్యవస్థలో వచ్చే అంటువ్యాధుల యొక్క లక్షణాలు క్రిందివిధంగా ఉంటాయి:
- పురుషాంగం నుండి వాసనతో కూడిన ఉత్సర్గ.
- వాపు మరియు దురద.
- నొప్పి.
- చర్మ గాయాలు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ అంటువ్యాధులు వాటి కారణం ఆధారంగా వర్గీకరించబడ్డాయి:
- ఛంక్రోయిడ్ (Chancroid) అనే గజ్జల్లో వచ్చే పుండు, క్లామిడియా, గోనోరియా, హెర్పెస్, సిఫిలిస్, మరియు మానవ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (హెచ్ఐవి) సంక్రమణం వంటి లైంగికంగా వ్యాపించే వ్యాధులు.
- ఎండోజెనస్ ఇన్ఫెక్షన్లు, ఇవి మహిళల జననేంద్రియ భాగంలో సాధారణంగా సూక్ష్మజీవుల అతిపెరుగుదల కారణంగా సంభవించవచ్చు, ఉదా., వల్వోవెజినల్ల్ కాన్డిడియాసిస్, బాక్టీరియల్ వజైనోసిస్.
- అల్పమైన ప్రసవ పద్ధతులు మరియు అసురక్షిత గర్భస్రావచర్యలు వంటి తప్పుడు వైద్య విధానాల కారణంగా సంభవించే ల్యాట్రోజనిక్ అంటువ్యాధులు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
రోగ నిర్ధారణ రుగ్మత యొక్క లక్షణాలు ఆధారంగా ఉంటుంది. జననమండల అంటురోగాల నిర్ధారణలో శారీరక పరీక్ష పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ ఒక సాధారణ దశ.
శారీరక పరీక్ష కాకుండా, లక్షణాలు యొక్క ఖచ్చితమైన కారణం గుర్తించడానికి వైద్యుడు స్త్రీలలో యోని ఉత్సర్గ యొక్క సూక్ష్మదర్శిని పరీక్షలు, మూత్ర పరీక్ష, మరియు దిగువ పొత్తి కడుపు మరియు కటిభాగం యొక్క సోనోగ్రఫీ పరీక్షను సిఫారసు చేయవచ్చు.
పురుషుల విషయంలో డాక్టర్ మూత్ర విశ్లేషణ, పురుషాంగం ఉత్సర్గ యొక్క సూక్ష్మదర్శిని పరీక్ష, పొత్తికడుపు మరియు కటి భాగం యొక్క సోనోగ్రఫీలను వ్యాధి లక్షణాల యొక్క అంతర్లీన కారణాన్ని గుర్తించడానికి సిఫారసు చేయవచ్చు.
చికిత్స సంక్రమణ యొక్క ఖచ్చితమైన కారణం మీద ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణంగా రుగ్మత యొక్క లక్షణాల నిర్వహణను కలిగి ఉంటుంది. సెఫ్ట్రిక్సాన్, ఎరిథ్రోమైసిన్, మరియు అమోక్సిల్లిన్ వంటి యాంటిమైక్రోబయల్ మందులు డాక్టర్ చేత సూచించబడతాయి.
కొన్ని నివారణ చర్యలు:
- ఎక్కువమంది లైంగిక భాగస్వాములను లేకుండా ఉండడం .
- మంచి వ్యక్తిగత పరిశుభ్రత నిర్వహణ.
- లైంగికంగా వ్యాపించే వ్యాధుల గురించి సమాజ విద్య మరియు కండోమ్లను ఉపయోగించడం.