చర్మ వివర్ణత (స్కిన్ డిస్కొలరేషన్) అంటే ఏమిటి?
మారిన చర్మం యొక్క రంగు అస్తవ్యస్తమైన మచ్చలుగా రూపుదిద్దుకోవడాన్నే “చర్మవివర్ణత” గా సూచిస్తారు. సాపేక్షంగా, చర్మవివర్ణత (skin discolouration) ఓ సాధారణ సమస్య మరియు గాయం, వాపు లేదా మరింత తీవ్రమైన అనారోగ్యం వంటి వివిధ కారణాల వల్ల చర్మవివర్ణత సంభవిస్తుంది. చర్మంలో ‘మెలనిన్’ యొక్క వివిధ స్థాయిల కారణంగా చర్మవివర్ణత రుగ్మత సంభవిస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ చర్మవివర్ణపు వ్యాధి కారణం మీద ఆధారపడి, ఈ రంగుమారిన మచ్చల వ్యాధి లక్షణాలు విభిన్న స్థాయిలను కలిగి ఉంటాయి, ఆ లక్షణాలు కిందివిధంగా ఉంటాయి:
- చర్మంపై డార్క్ రంగుతో లేక నల్ల మచ్చలు లేదా లేత రంగు మచ్చలు లేదా రెండు రకాలైన మచ్చలు (పాచెస్)
- దురద
- చర్మం ఎరుపుదేలడం
- చర్మం మీద ఏర్పడ్డ మచ్చల మీద స్పర్శ తగ్గడం లేదా స్పర్శ పూర్తిగా కోల్పోవడం
- హైపెరాస్టీసియా (పెరిగిన సున్నితత్వం)
ప్రధాన కారణాలు ఏమిటి?
సాధారణ అలెర్జీల నుండి తీవ్రమైన రోగనిరోధక వ్యాధుల వరకు ఉండే విస్తృత శ్రేణి రుగ్మతల ద్వారా చర్మ వివర్ణత (స్కిన్ డిస్కోలరేషన్ కలుగుతుంది. సాధారణ కారణాలలో కొన్ని:
- అలర్జీలు (అసహనీయతలు)
- కాంటాక్ట్ డెర్మటైటిస్ (contact dermatitis)
- ఎక్జిమా (గజ్జి)
- ఇన్ఫెక్షన్
- సూక్ష్మజీవి సంక్రమణ (Bacterial infection)
- ఫంగల్ ఇన్ఫెక్షన్ (రింగ్వార్మ్, టినియా వెర్సికలర్, కాండిడా)
- కాలిన పుండ్లు (కాల్పుడుగాయాలు లేక బర్న్స్)
- రోగనిరోధక వ్యాధులు (ఆటో ఇమ్యూన్ వ్యాధులు)
- సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటసస్
- గ్రేవ్స్ వ్యాధి
- పుట్టుమచ్చలవంటి జన్మతోనే వచ్చే గుర్తులు (birth marks)
- మోల్స్
- స్ట్రాబెర్రీ నావిస్
- పోర్ట్ వైన్ మరకలు
- మంగోలియన్ నీలం మచ్చలు
- హార్మోన్ల సమస్యలు
- నల్లమచ్చల చర్మరోగం
- బుగ్గలు, నుదురు మీద గోధుమవర్ణము గల మచ్చలు
- చర్మ క్యాన్సర్
- బేసల్ సెల్ క్యాన్సర్
- పొలుసుల కణ క్యాన్సర్
- మెలనోమా
- గాయం
- మొటిమల రూపంలో ముక్కు, నుదురు, బుగ్గల మీద సాధారణంగా వ్యాపించే చర్మ వ్యాధి
- రేడియేషన్ థెరపీ
- బొల్లి
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
సాధారణంగా వైద్య చరిత్ర సంగ్రహణతో పాటుగా చర్మ వివర్ణత వ్యాధిని సరిగా పరీక్షించడంతోనే రోగనిర్ధారణ సూచన తెలుస్తుంది, కానీ కొన్ని పరిశోధనలు రోగ నిర్ధారణను ధృవపర్చడానికి మరియు సరైన చికిత్సను అందించడానికి అవసరం. ఈ పరిశోధనలు ఇలా ఉంటాయి:
- రక్త పరిశోధనలు - అలెర్జీలు మరియు స్వీయ రోగనిరోధక వ్యాధుల కోసం తనిఖీ చేసే కొన్ని పరిశోధనలు. ఈ పరిశోధనలు పూర్తి రక్త గణన (CBC), సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP), అణు-అనారోగ్య ప్రతిరోధకాలు (ANA) ఉన్నాయి.
- వుడ్ యొక్క లాంప్ పరీక్ష - ఈ పరీక్ష బాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లను గుర్తించడంలో సహాయపడుతుంది.
- స్కిన్ బయాప్సీ - సూక్ష్మదర్శిని క్రింద కణాలను పరీక్షించడంలో ఇది సహాయపడుతుంది.
చికిత్సా విధానం పూర్తిగా వ్యాధి కారణంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి వ్యాధి కారణం కనుగొన్న తర్వాత, ఇక చర్మ వివర్ణతను (స్కిన్ డిస్కోలరేషన్) తొలగించడం సులభం. చికిత్స అంతర్లీన వ్యాధిని లక్ష్యంగా చేసుకుంటుంది, ఇది స్వయంచాలకంగా చర్మ వివర్ణతను (డిస్కోలరేషన్ను) తొలగిస్తుంది. అయితే, ఇది చాలా పరిస్థితుల్లో సాధ్యపడదు. ఈ చర్మవివర్ణతను తొలగించడంలో సహాయపడే కొన్ని మందులు ఉన్నాయి, ఆ మందుల్లో కొన్నింటిని కింద సూచిస్తున్నాం:
- స్థానికమైన పైపూత మందులు - విటమిన్ A, విటమిన్ E లేదా హైడ్రోక్వినోన్ యొక్క పైపూత మందులు నల్లమచ్చల్ని తొలగించడంలో సహాయపడుతాయి.
- రంగు మారిన చర్మం యొక్క పైపొరను రసాయనిక పదార్థంతో తొలగించే ప్రక్రియ (chemical peeling) - గ్లైకోలిక్ ఆమ్లం లేదా సాలిసైలిక్ ఆసిడ్ (salicylic acid) వంటి బాధా నివారక లవణాలు గల కొన్ని రసాయనాలతో చర్మం యొక్క (పైపొర) బయటి పొరను (ఇది సాధారణంగా రంగు మారిపోతుంది). తొలగించడంలో సహాయపడతాయి
- లేజర్ చికిత్స - లేజర్ చికిత్స నల్ల మచ్చల్ని (డార్క్ పాచెస్ను) లేతరంగులోకి మార్చడానికి సహాయపడుతుంది.