గొంతు సంక్రమణ అంటే ఏమిటి?
మన శరీరంలో ఉన్న అన్నవాహికకు ఆహారాన్ని చేరవేసేదే గొంతుభాగం. ఇంకా, గాలిని శ్వాసనాళికకు చేరవేసే పని కూడా గొంతుదే. వైద్య పరిభాషలో, గొంతుని “ఫారిన్క్స్” (సప్తపథ) అని పిలుస్తారు. గొంతు అంటువ్యాధులు గొంతును బాధిస్థాయి, దీనివల్ల గొంతులో మంట పుట్టడం మరియు గొంతు గోకుడు లేక గీరుడుకు గురైనట్లు అనిపిస్తుంది. బాక్టీరియా సూక్ష్మక్రిములు కంటే కూడా వైరస్లు ఇంకా చిన్నవైనా సూక్ష్మజీవులు. గొంతు అంటురోగాలకు వైరస్లు (అతి సూక్ష్మజీవులు) అత్యంత సాధారణ కారణం, అయితే బ్యాక్టీరియా (సూక్ష్మజీవులు) కూడా అంటురోగ కారకాలు కావచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
క్రింది సంకేతాలు మరియు లక్షణాలు సాధారణంగా గొంతు ఇన్ఫెక్షన్లలో అనుభవించబడతాయి:
- ఆహారం మ్రింగుటలో సమస్య
- గొంతు నొప్పి
- బొంగురువోయిన (హోర్స్) గొంతు
- తలనొప్పి
- దగ్గు
- మెడలో శోషరస గ్రంధుల వాపు
- జ్వరం
- వికారం మరియు వాంతులు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
గొంతు అంటువ్యాధులకు ప్రధాన కారణాలు వైరస్లు మరియు బాక్టీరియా.
- సుమారు 90% గొంతు అంటువ్యాధులు వైరస్ల వలన సంభవిస్తా యి. సాధారణంగా గొంతు అంటురోగాలకు కారణమయ్యే వైరస్లు ఫ్లూ, జలుబు, కోరింత దగ్గు, చికెన్ఫాక్స్, మరియు మిసల్స్ వంటివి.
- బాక్టీరియా కారణంగా గొంతు అంటువ్యాధులు సాధారణంగా స్ట్రెప్టోకోకల్ సంక్రమణ వలన కలుగుతాయి.
ధూమపానం, కాలుష్యం మరియు అలెర్జీలు (అసహనీయతలు) గొంతు అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
డాక్టర్ వ్యక్తి యొక్క పూర్తి శారీరక పరీక్షను చేస్తారు మరియు చెవి, ముక్కు లేదా గొంతు చుట్టూతా ఈ సంక్రమణ లక్షణాలున్నాయా అని అడుగుతారు. డాక్టర్ జ్వరం ఉందేమోనని శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తారు మరియు చెవులు, ముక్కు, గొంతు, మరియు గొంతు (మెడ) లోని శోషరస గ్రంథుల్ని కూడా తనిఖీ చేస్తారు. డాక్టర్ గనుక గొంతు సంక్రమణను అయిండొచ్చని అనుమానించినట్లయితే, వారు ఒక స్ట్రెప్ టెస్ట్ మరియు గొంతు ద్రవం యొక్క ప్రయోగశాల పరీక్షను సిఫారసు చేస్తారు.
గొంతు సంక్రమణను అధిగమించడానికి క్రింది చికిత్స పద్ధతు సూచించబడతాయి:
- బ్యాక్టీరియల్ సంక్రమణ విషయంలో యాంటీబయాటిక్స్
- వైరల్ సంక్రమణ చికిత్స
- గొంతు నొప్పి ఉపశమనానికి ఇబూప్రోఫెన్ మరియు ఆస్పిరిన్ వంటి నొప్పి నివారణ మందులు
- నిర్జలీకరణాన్ని నివారించడానికి దండిగా నీటిని తీసుకోవడం ఉంటుంది
నాన్ ప్రిస్క్రిప్షన్ గొంతునొప్పి మందులైన చప్పరించే బిళ్ళలు (lozenges) మరియు మిస్ట్ వేపరైజర్ (mist vapouriser) గొంతు నొప్పి మరియు ఇతర స్థానిక వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతాయి.
మంచి పరిశుభ్రతా పద్ధతులను పాటించడం గొంతు సంక్రమణ నివారణకు సహాయపడుతుంది.