యోని వాపు (వెజైనైటీస్) అంటే ఏమిటి?
యోని వాపు (Vaginitis) అంటే స్త్రీ యొక్క జననాంగం యోని వాపు. ఈ రుగ్మతతో యోనిలో నొప్పి, దురద, మరియు ఉత్సర్గ (ఈ ఉత్సర్గ, కొన్నిసార్లు, ఓ రకమైన దుర్వాసన కలిగి ఉంటుంది) కలిగించే వాపు ఉంటుంది. యోని వాపు సంభవించడానికి సంక్రమణ అనేది అత్యంత సాధారణ కారణం.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
యోనికి సోకిన అంటువ్యాధిని బట్టి యోని వాపు యొక్క వ్యాధి లక్షణాలు కిందివిధంగా వైవిధ్యంగా ఉంటాయి:
బాక్టీరియల్ కారక యోని వాపు ఎలాంటి వ్యాధిలక్షణాల్ని కల్గిఉండక పోవచ్చు, లేదా కింది లక్షణాల్ని కలిగి ఉండవచ్చు:
- తెలుపు లేదా బూడిద రంగులో ఉండే పలుచని యోని ఉత్సర్గ.
- బలమైన చేపలవాసన వంటి వాసన (సాధారణంగా లైంగిక సంభోగం తర్వాత).
- ఈస్ట్ ఇన్ఫెక్షన్ క్రింది లక్షణాలను కలిగిఉంటుంది:
- కాటేజ్ చీజ్ రూపంతో చిక్కటి, తెలుపు ఉత్సర్గ.
- నీళ్లునీళ్లుగా, వాసన లేకుండా.
- దురద పుట్టడం మరియు ఎరుపుదేలడం.
ట్రైకోమోనియనిసిస్ ఇన్ఫెక్షన్లో వ్యాధి లక్షణాలు ఉండకపోవచ్చు లేదా కింది లక్షణాలను కల్గిఉండవచ్చు:
- యోని మరియు యోని రంధ్రంలో (ఉల్వా) దురద, మంట మరియు సలుపు (సలుకు) లాంటి నొప్పి .
- మూత్రవిసర్జన సమయంలో మంట .
- గ్రే-గ్రీన్ రంగుల్లో ఉత్సర్గ (స్రావాలు).
- దుర్వాసనతో కూడిన ఉత్సర్గ (స్రావాలు).
ప్రధాన కారణాలు ఏమిటి?
యోనిలో మార్చబడిన సూక్ష్మజీవుల యొక్క సమతుల్యత వల్ల యోనికి వాపు కలగడం సంభవిస్తుంది మరియు ఈ పరిస్థితికి కారణాలు కింది విధంగా ఉంటాయి:
- అసురక్షితమైన లైంగికచర్యల్లో పాల్గొనడం లేదా చాలామంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం.
- గర్భాశయ పరికరం (IUD) వాడకం.
- అదుపు చేయని చక్కెరవ్యాధి వంటి పరిస్థితులు.
- గర్భం.
- మందులు, ఉదాహరణకు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్.
- కాన్డిడియాసిస్, ట్రైకోమోనియసిస్ వంటి ఇన్ఫెక్షన్లు.
- సబ్బులు, డిటర్జెంట్లు, స్ప్రేలు, డూషెష్ (douches అనేవి పిచికారీవంటిది, దీన్ని శరీర అవయవాలను శుభ్రం చేసుకోటానికి వాడతారు. ఇది ద్రవ పొంగు రూపంలో ఉంటుంది), స్పెర్మిసైడ్లు, లేదా మృదుత్వంతో కూడిన ఫాబ్రిక్స్ కు అలెర్జీ.
- హార్మోన్ల మార్పులు.
ఇది ఎలా నిర్ధారణ చేయబడుతుంది?
వైద్యుడు మొదట సంపూర్ణ వైద్య చరిత్రను తీసుకుంటాడు, దీని తరువాత క్షుణ్ణమైన కటిభాగ (పెల్విక్) పరీక్ష చేస్తారు (అసాధారణమైన ఉత్సర్గ, దాని రంగు, వాసన మరియు నాణ్యత యొక్క తనిఖీ కోసం). వైద్యుడు కొన్నిసార్లు యోని శాంపిల్ యొక్క సూక్ష్మదర్శిని అధ్యయనాన్ని సూచించవచ్చు.
- యోని వాపు సూక్ష్మజీవి (బాక్టీరియల్) సంక్రమణకు యాంటీబయాటిక్స్ మందుల్ని నోటిద్వారా కడుపుకు ఇవ్వడం లేదా పైపూతకు ఇవ్వడం జరుగుతుంది.
- ఫంగల్ ఇన్ఫెక్షన్లకు యాంటీ ఫంగల్ క్రీమ్లు లేదా ఫలవర్తి (సుపోజిటరీలతో) మందులతో చికిత్స పొందడం జరుగుతుంది.
- ట్రైకోమోనియసిస్ కు ఒకే మోతాదు యాంటీబయాటిక్తో చికిత్స ఉంటుంది మరియు భాగస్వాములిద్దరికీ చికిత్స అవసరం.
- అలెర్జీ కేసుల్లో, అలెర్జీ కారకాన్ని బహిర్గతం చేయాలి, లేదా అలర్జీని తొలగించాలి.
యోని వాపు నివారణకు:
- డచింగ్ (Douching) లేదా యోని స్ప్రేలు వాడకూడదు.
- కండోమ్ ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలి.
- వేడితో కూడిన బట్టలు మరియు తేమతో కూడిన బట్టలు వాడకూడదు.
- సౌకర్యవంతమైన లోదుస్తులు ధరించాలి, నూలుతో తయారైన లోదుస్తులు అయితే సౌకర్యవంతమైనవిగా ఉంటాయి .
- లోదుస్తులు తరచుగా మార్చడం, మరీ ముఖ్యంగా ఋతుస్రావం సందర్భంగా తరచుగా లోదుస్తులు మార్చడం సరైన పరిశుభ్రతను కాపాడుకోవటానికి ఉత్తమమైన మార్గంగా సలహా ఇవ్వడమైంది.