విటమిన్ బి లోపం అంటే ఏమిటి?
విటమిన్ బి (బి కాంప్లెక్స్) అనేది విటమిన్ల యొక్క ఒక సమూహం, ఈ క్రిందివి విటమిన్ బి లో ఉంటాయి:
- బి1 (థయామిన్)
- బి2 (రిబోఫ్లావిన్)
- బి3 (నియాసిన్)
- బి5 (పాంతోతేనిక్ ఆమ్లం)
- బి6 (పైరిడోక్సిన్)
- బి7 (బయోటిన్-biotin)
- బి9 (ఫోలిక్ ఆమ్లం)
- బి12 (కోబాలమైన్)
కణాల పనితీరు (సెల్ ఫంక్షన్)కు, మెదడు పనితీరుకు మరియు కనసంబంధ (సెల్యులార్) జీవక్రియకు పైన పేర్కొన్నవన్నీ కీలకమైనవి. విటమిన్ బి యొక్క లోపం క్లిష్టమైన రుగ్మతలకు దారి తీస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అనేక పదార్థాల (components) లోపం కారణంగా విటమిన్ బి లోపం యొక్క వ్యాధి లక్షణాలు విస్తృతంగా మారుతుంటాయి. ఇంకా, బి కాంప్లెక్స్ లోపం యొక్క కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి, వీటిలో ఇవి ఉన్నాయి:
- నోటిలో పూతలు
- పెదవులు పగుళ్లు
- పొలుసులు దేలిన మరియు దురద చర్మం
- బలహీనత
- అలసట
- రక్తహీనత
- చిరాకు
- గందరగోళం
- మతిమరపు
- కడుపు ఉబ్బరం మరియు తిమ్మిరి
- మలబద్ధకం
- చేతులు మరియు కాళ్ళలో తిమ్మిరి తిమ్మిరి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
విటమిన్ బి పుష్కలంగా కలిగిన ఆహార పదార్ధాలను తగినంతగా తీసుకోకపోవడంవల్ల విటమిన్ B లోపం సంభవించవచ్చు, దీన్నే విటమిన్ ‘బి’ ప్రాధమిక లోపం అని సూచిస్తారు. ఉదరకుహర వ్యాధి, దీర్ఘకాలిక అతిసారం, ప్యాంక్రియాటిక్ లోపం, కాలేయ సిర్రోసిస్, జియార్డియాసిస్, అస్కారియాసిస్, క్రోన్స్ వ్యాధి మరియు వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ (ulcerative colitis), వంటి కొన్ని వ్యాధులు విటమిన్ బి కాంప్లెక్స్ లోపానికి దారితీస్తుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి ఎలా చికిత్స చేస్తారు?
రోగ నిర్ధారణ నిర్ణయించడానికి వైద్య (క్లినికల్) చరిత్రతో పాటు సంపూర్ణ వైద్య పరీక్ష సహాయపడుతుంది. దీనితో పాటు, విటమిన్ బి లోపం యొక్క లక్షణాలను నిర్ధారించడంలో సహాయపడే ఒక చికిత్సా ట్రయల్ (వ్యాధి లక్షణాలకు విటమిన్ బి సంక్లిష్ట అనుబంధాల్ని అందించడం) సహాయపడుతుంది. సీరం విటమిన్ బి1, బి2, బి6, బి9, బి 12 స్థాయిలు, హోమోసిస్టీన్ స్థాయిలు వంటి ఇతర నియమిత రక్త పరిశోధనలతో పాటు కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC) వంటి ఈ నిర్దిష్ట రక్త పరిశోధనలు విటమిన్ బి లోపం యొక్క నిర్ధారణలో సహాయపడతాయి.
విటమిన్ బి లోపానికి చికిత్స విటమిన్ బి స్థాయిల డిమాండ్లను నెరవేర్చడంలోనే ఉంటుంది, ఈ నెరవేర్చడమనేది విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం లేదా విటమిన్ బి కాంప్లెక్స్ సప్లిమెంట్ మందుల్ని నోటి ద్వారా గాని లేదా సూది మందుల ద్వారా గాని తీసుకోవడమే.
- విటమిన్ బి ఆహార పదార్థాలు - గుడ్లు, చేపలు, కాలేయం మొదలైనవి విటమిన్ బి యొక్క మాంసాహార మూలాలు. పాలు, చీజ్, ఆకుపచ్చ కూరలు (పాలకూర, మెంతులు, కాలే తదితరమైనవి), పండ్లు (నారింజ, అరటి, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ మొదలైనవి), బీన్స్, నట్స్, దుంప మరియు అవకాడొలు శాఖాహారం మూలాలు.
- సప్లిమెంట్స్: ఓరల్ లేదా ఇంజెక్షన్ విటమిన్ బి సంక్లిష్ట అనుబంధాలు ఈ విటమిన్ బి లోపాన్ని సరిదిద్దడంలో సహాయపడుతుంది.