విటమిన్ సి లోపం అంటే ఏమిటి?
విటమిన్ ‘సి’ ని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు మరియు నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని విటమిన్ సి క్షీణత ‘స్కర్వీ’ అనబడే ఓ ప్రాణాంతక వ్యాధికి కారణమవుతుంది. విటమిన్ సి ఓ ప్రథమ పంక్తి యాంటీఆక్సిడెంట్ గా పరిగణించబడుతుంది, అనగా శరీరంలోని హానికరమైన ఆక్సైడ్ల అవశేషాలను తొలగిస్తుంది. విటమిన్ సి లోపం ప్రమాదకారకానికి గురయ్యే జనాభాలో ఒంటరిగా నివసించే పురుషులు, వయసు పైబడుతున్న ముసలి వ్యక్తులు, మానసిక వ్యాధులకు గురైన రోగులు, నిరాశ్రయులు మరియు ఆహార ప్రియులు ఉన్నారు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- బలహీనత
- కండరాల నొప్పి
- కీళ్ళ నొప్పి
- రక్తహీనత
- వాపు
- శ్వాస ఆడకపోవుట
- చర్మం కింద రక్తస్రావం
- దంతాల నష్టం మరియు నోరు/నాలుక పూతలు
- చిగుళ్ళవాపు
- నయం కాని గాయం/పుండు
- పిల్లల్లో చికాకు మరియు ఆందోళన
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- విటమిన్ సి ని తగినంతగా తీసుకోకపోవడం
- జ్వరం (ఫీవర్)
- అతిసారం
- ధూమపానం
- హైపర్ థైరాయిడిజం
- ఇనుము లోపము
- చల్లని / వేడి సంపీడనాలు
- శస్త్ర చికిత్స (సర్జరీ)
- కాల్పుడు గాయాలు (బర్న్స్)
- ప్రోటీన్ లోపం
- మద్యం లేదా మత్తుమందుల (డ్రగ్స్) దుర్వినియోగం
- ముసలితనం (వయస్సు పెరగడం)
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
- వైద్యుడు వివరణాత్మక వైద్య చరిత్ర మరియు కుటుంబ చరిత్రను తీసుకున్న తర్వాత చెక్కు చెదరని చర్మం మరియు చిగుళ్ళలో రక్తస్రావం తనిఖీ పరీక్షలు చేస్తారు.
- వైద్యుడు పూర్తి రక్త గణన పరీక్షతో పాటు స్కర్వీ వ్యాధిని నిర్ధారించడానికి విటమిన్ సి స్థాయి పరీక్షను నిర్వహించవచ్చు.
- రక్తస్రావం ఆపడానికి తీసుకున్న సమయాన్ని అంచనా వేయడానికి మరియు శరీరంలోని హేమోగ్లోబిన్ యొక్క స్థితిని గుర్తించడానికి పూర్తి రక్త తనిఖీ పరీక్షను చేస్తారు.
- బాల్యదశ స్కర్వీ ని నిర్ధారణ చేయడానికి తొడ ఎముక వంటి పెద్ద ఎముకల X- రే.
- ఇతర వ్యాధులను తోసిపుచ్చడానికి వైద్యుడు ఎముక మజ్జ యొక్క జీవాణుపరీక్ష కూడా చేస్తాడు.
- ఎక్స్-రే తగినంత డేటాను అందించని పక్షంలో మాత్రమే MRI చేయబడుతుంది.
చికిత్స:
- విటమిన్ సి భర్తీ అనేది చికిత్స యొక్క ఎంపిక. చికిత్స ప్రారాంభమైన 2 వారాల వ్యవధిలో వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమవుతాయి.
- ఆస్కార్బిక్ యాసిడ్ ను కల్గి ఉండే రసాలు: నిమ్మకాయల మరియు నారింజ తాజా రసాలు శరీరంలో విటమిన్ సి భర్తీకి సహాయపడుతుంది. బ్రోకలీ, ఆకుపచ్చ మిరియాలు, బచ్చలికూర, టొమాటో, బంగాళాదుంప, కాలీఫ్లవర్ మరియు క్యాబేజీ వంటివి కోల్పోయిన విటమిన్ సి ని తిరిగి పొందడానికి సహాయపడతాయి.
- విటమిన్ ‘సి’ ని కల్గిన నమిలే (chewable tablets) మాత్రలు మార్కెట్లలో సులభంగా అందుబాటులో ఉంటాయి మరియు ఇవి స్కర్వీ (విటమిన్ సి లోపం) వ్యాధికి సమర్థవంతమైన చికిత్సగా తోడ్పడతాయి.