అశ్వగంధ అంటే ఏమిటి?
ఆయుర్వేదవైద్యం లేదా ప్రత్యామ్నాయ వైద్యంలో మీకు గనుక సంపూర్ణమైన నమ్మకముంటే “అశ్వగంధ” మూలిక గురించి అనేకమార్లు వినే ఉంటారు. ఎందుకు విని ఉండరు? ఎందుకంటే అశ్వగంధ అత్యంత ముఖ్యమైన ఆయుర్వేద మూలికలలో ఒకటి. వేల సంవత్సరాల క్రితమే అశ్వగంధ యొక్క ఉనికి మరియు దాన్ని ఉపయోగించిన సంగతి గురించి అథర్వ(ణ)వేదంలో ఉంటంకించబడింది. భారతీయ సంప్రదాయిక వైద్యవిధానం తరచుగా అశ్వగంధను "మాయామూలిక" గా, ఒత్తిడిని హరించే ఏజెంట్ గా (ఆంగ్లంలో “అడాప్టోజెన్” అంటారు.) సూచించింది. ఎందుకంటే ఇది ఒత్తిడి సంబంధిత లక్షణాలు మరియు ఆందోళనకర రుగ్మతలను తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగించే మూలికల్లో ఒకటి. “అశ్వగంధ” అనే పేరుకు అర్థం - ‘అశ్వ’ అంటే గుర్రం, మరియు ‘గంధ’ అంటే వాసన అని. అదనంగా చెప్పాలంటే అశ్వగంధ వేర్లు గుర్రం యొక్క మూత్రం లేక చెమట వాసనను కల్గి ఉంటాయి కాబట్టి నేరుగా తర్జుమా రూపంలో ఈ మూలికకు “అశ్వగంధ” అనే పేరు స్థిరపడింది. అలాగే ఆయుర్వేద పరిశోధకులు చెప్పే మరో మిషయమేమిటంటే అశ్వగంధను సేవిస్తే గుర్రంకున్నంత లైంగిక శక్తి వస్తుందని.
అశ్వగంధ గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: విటానియా సోమ్నిఫెరా
- కుటుంబము: సోలనాసియే (nightshade family)
- సంస్కృతం పేర్లు: అశ్వగంధ, వరాహకార్ణి (ఆకులు పంది చెవిని పోలి ఉంటాయి), కామరూపిని.
- సాధారణ పేర్లు: వింటర్ చెర్రీ, ఇండియన్ జిన్సెంగ్, పాయిజన్ గూస్బెర్రీ.
- ఉపయోగించే భాగాలు: అశ్వగంధ వేర్లు మరియు ఆకులు ఎక్కువగా మందుల్లో ఉపయోగిస్తారు. కానీ దీని పుష్పాలు మరియు విత్తనాలు కూడా ఉపయోగించబడుతున్నాయి.
- స్థానికంగా లభ్యమయ్యే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: భారతదేశంలోని వేడి ప్రదేశాలు, అందులోను ప్రముఖంగా మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలు, నేపాల్, ఆఫ్రికా మరియు మధ్యతూర్పు (middle east) దేశాల్లో అశ్వగంధ ఉనికి, వాడకాలున్నాయి. ఇది అమెరికా (USA) లో కూడా ప్రవేశపెట్టబడింది.