మట్టి రంగులో మరియు అండాకారంలో ఉండే చియా విత్తనాలు చియా మొక్క, సాల్వియా హిస్పానికా (Salvia hispanica) నుండి వస్తాయి. సాధారణంగా 1 మిల్లీమీటర్ వ్యాసంలో ఉండే ఈ చిన్న విత్తనాలు శక్తికి నిల్వలుగా ఉంటాయి. నిజానికి, వాటికీ ఆ పేరు బలం అని అర్ధం వచ్చే ఒక పురాతన మాయన్ పదం వచ్చింది. కొందరు చరిత్రకారుల ప్రకారం, చియా గింజలు మొట్టమొదట అజ్టెక్ తెగలచే సాగు చేయబడ్డాయి, వీరు ఆధునిక మెక్సికో మరియు గ్వాటెమాల చుట్టూ ఉండి ఉంటారు. చియా విత్తనాల యొక్క ఈ శక్తిని కలిగించే లక్షణాలు అమెరికన్ ఇండియన్ తెగలచే చాలా పవిత్రమైనవిగా పరిగణించబడ్డాయి, వారు చియా విత్తనాల అజ్టెక్ పూజారులకు సమర్పించేవారు.
ఈ రోజుల్లో, చియా విత్తనాలను వాణిజ్యపరంగా దక్షిణ అమెరికా అంతటా, మధ్య అమెరికా, మరియు ఆస్ట్రేలియాలలో సాగు చేస్తున్నారు.
గొప్ప చరిత్ర కలిగి ఉండడమే కాక, చియా విత్తనాల యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలు వలన వాటికి చాలా వేగంగా ఆధునిక సూపర్ఫుడ్ అనే పేరు వచ్చింది. ఈ విత్తనాలలో పుష్కలంగా ఒమేగా -3 ఫ్యాటి యాసిడ్లు మరియు ఫైబర్లు ఉండడంతో పాటు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి, ఇవి శరీరానికి పోషకాలు అందించడమే కాక, జీర్ణ రుగ్మతలు, హృదయ సంబంధ వ్యాధులు, మరియు రక్తపోటు వంటి వివిధ సమస్యలపై వ్యతిరేకంగా పోరాడడంలో కూడా మనకు సహాయపడుతాయి. చియా విత్తనాల యొక్క ఈ పోషకరమైన మరియు ఆరోగ్య ప్రయోజనకరమైన లక్షణాలు అన్ని తెలుసుకున్న తర్వాత, చియా గింజలు నిజమైన ఫంక్షనల్ ఫుడ్ (మాములు ప్రయోజనాలే కాక దీర్ఘకాలిక వ్యాధులను తాగించే మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహారాన్ని పదార్దాన్ని ఫంక్షనల్ ఫుడ్ అని అంటారు) అని భావించడం కష్టం కాదు.
చియా విత్తనాల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- శాస్త్రీయ నామం: సాల్వియా హిస్పానికా (Salvia hispanica)
- కుటుంబం: లాబెటే (Labiatae)
- ఇతర పేర్లు: మెక్సికన్ చియా లేదా సాల్బా చియా
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఇది మెక్సికో మరియు గ్వాటెమాల ప్రాంతాల యొక్క స్థానిక మొక్క, అలాగే వాణిజ్యపరంగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బొలివియా, ఈక్వెడార్, నికారాగువా, పెరు మరియు యునైటెడ్ స్టేట్స్ లో కూడా సాగు చేస్తున్నారు.
- సరదా వాస్తవం: కాలిఫోర్నియాకు చెందిన జోసెఫ్ ఎంటర్ప్రైజెస్ Inc నుండి జో పెడోట్ అనే వ్యక్తి, చియా మొలకలను జంతువుల ఆకారపు టెర్రకోట బొమ్మలను విక్రయించారు. కొన్ని వారాలు వాటికీ నీరు పోసిన తర్వాత, చియా మొక్కలు జంతువుల బొచ్చు రూపంలో పెరిగాయి. 2007 లో, US లో, సుమారుగా 5,00,000 ఈ పెంపుడు జంతువుల ఆకారపు చియా మొక్కలు ఇంటిలో ఒక రకమైన కొత్త అలంకరణగా అమ్ముడయ్యాయి.