ఆవు హిందువులకు ఒక పవిత్ర జంతువు. ప్రాచీన భారతదేశంలో వ్యవసాయo మరియు పశువుల పెంపకం అనేది పురాతన భారతదేశంలో ఆదాయ వనరుగా ఉన్నప్పటికీ పురాతన కాలం నుంచి ఆవులు ఇక్కడ ఆరాధించబడుతూ ఉన్నాయి. గొప్ప ఆర్థిక ప్రాభల్యం మరియు పాలకు మూలాధారం అయినప్పటికీ, ఆవులను వాటి యొక్క మూత్రం కోసం ఉపయోగించడేవి.
మీరు ఎందుకు గోమూత్రం కావాలని అడుగుతారు?
ఆవుల యొక్క మూత్రం మరియు పేడ గొప్ప ఔషధ విలువను కలిగి ఉన్నాయనేది తెలుసుకోనుటలో మీరు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి, ఆవు నుండి లభించే మూత్రం, నెయ్యి, పెరుగు, పేడ మరియు ఆవు పాలతో కలిపి చేసిన మిశ్రమం పంచగవ్య తయారు అవుతుంది, ఇది ఆయుర్వేదంలో దానిలో గల ఔషధ గుణాలకు పేరు పొందింది. సంస్కృత పదం అయిన సుశ్రుత సంహిత ప్రకారం ఒక ఆవు నుంచి ఉత్పన్నమైన అన్ని ఉత్పత్తుల్లో, ఆవు యొక్క మూత్రం అత్యంత సమర్థవంతమైన రోగ నివారిణిగా పరిగణించబడుతుంది.
ఆయుర్వేదంలో గోమూత్రo అమృతoగా లేదా జీవ జలంగా భావించబడుతుంది. నైజీరియా మరియు మయన్మార్ దేశాలలోని సాధారణ మెడిసిన్ ప్రాక్టీస్నర్లు కూడా తమ మందులలో గోమూత్రాన్ని ఉపయోగిస్తారు.
వేకువజామునకు ముందే యవ్వన దశలో ఉన్న ఆవు యొక్క మూత్రాన్ని సేకరించడం చాలా ఉత్తమం అని కొంతమంది నమ్ముతారు, అయితే చూలుతో ఉన్న ఆవు యొక్క మూత్రం ప్రత్యేక హార్మోన్లను కలిగి ఉండటం వలన అధిక పోషకతత్వాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. సుమారు 80 నయం కాని వ్యాధులు మరియు అనేక ఇతర పరిస్థితులు గోమూత్రం ఉపయోగించి నయo చేయబడతాయని నమ్మబడుతుంది.
గోమూత్రం దాని ఔషధ గుణాలను బట్టి ఉపయోగించడం మాత్రమే కాకుండా అది విస్తృతమైన వివిధ ఉపయోగాలను కలిగి ఉంది. ఇది ఎరువుగా సేంద్రీయ వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. వేప ఆకులతో కలిపినప్పుడు ఇది ఒక అద్భుతమైన బయో పెస్టిసైడ్గా పనిచేస్తుంది. గోమూత్రo సాంప్రదాయికంగా శుభ్రపరిచే ద్రావణాల యొక్క యాంటీ మైక్రోబయాల్ చర్యలను పెంచుతుంది మరియు అందుకే దీనిని శుభ్రపరిచే ఏజెంట్గా ఉపయోగిస్తారు, ప్రత్యేకంగా ఇది నేలను శుద్ది చేయుటకు వాడబడుతుంది. ఆవు మూత్రంతో నేలను తుడవడం వలన అది అన్ని బ్యాక్టీరియాలను తొలగించడం ద్వారా స్థలాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ఇది సౌందర్య సాధన సామగ్రి, ముఖ్యంగా షాంపూ మరియు సబ్బుల్లో కూడా ఉపయోగించబడుతుంది.