కొత్తిమీర లేదా ధనియాలు అన్నది ఒక వార్షిక మూలిక, సంప్రదాయ భారతీయ వంటకాల్లో ఇది విస్తృతమైన ఉపయోగం కలిగిఉంది. ఆహార ఫైబర్ యొక్క ఒక మంచి వనరు, అలాగే, కొరియండ్రమ్ సాటివమ్ అపారమైన ఔషధ విలువ కలిగిఉంది. ఒక సంప్రదాయ నివారిణి మరియు సువాసన ఏజెంట్‌గా కొత్తిమీరను విభిన్న నాగరికతలు ఉపయోగిస్తున్నాయి. కొత్తిమీర మొక్క మొత్తం, లిపిడ్లకు ఒక గొప్ప వనరుగా ఉంది, అనగా పెట్రోసెలినిక్ ఆమ్లం మరియు ముఖ్యమైన నూనెలు వంటివి.
దక్షిణ ఐరోపా ప్రాంతం, మరియు ఉత్తర మరియు నైరుతి ఆఫ్రికా ప్రాంతాలకు స్థానికంగా చెందినది, కొత్తిమీర మొక్క ఒక మృదువైన మూలిక, సాధారణంగా 50 సెం.మీ. ఎత్తు కలిగి ఉంటుంది. ఆకులు పీఠం దగ్గర విస్తృతమైన తమ్మెలుగా ఉంటాయి, బయటి అంచుల వైపుగా సన్నగా మరియు ఈకలు గలవిగా ఉంటాయి మరియు ఆకారంలో అస్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఆయుర్వేదంలో, ఆకలిని పెంచడం, జీర్ణక్రియలో సహాయం చేయడం మరియు అంటువ్యాధులతో పోరాడటం ద్వారా కొత్తిమీర ఒక త్రిషోడిక్ (మూడు ప్రయోజనాలను అందిస్తుంది) మసాలాగా అత్యధిక ప్రశంసలు పొందింది.
కొత్తిమీర అనేక బయోయాక్టివ్ అంశాలను కలిగిఉంటుంది, దీని వల్ల ఈ మూలికలోని వివిధ భాగాలు అనేక ఔషధ లక్షణాలను ప్రదర్శిస్తాయి. వీటిలో యాంటి-బయాటిక్, యాంటి-ఆక్సిడంట్, యాంటి-మైక్రోబయల్, యాంటి-ఎపిలెప్టిక్ (మూర్ఛను నివారిస్తుంది) , యాంటి-డిప్రెసంట్, యాంటి-ఇన్‌ఫ్లమేటరీ (వాపును తగ్గిస్తుంది) యాంటి-డైస్లిపిడెమిక్ (కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ వంటి రక్త లిపిడ్లను తగ్గిస్తుంది), న్యూరోప్రొటెక్టివ్ (మెమరీ కణాలను రక్షిస్తుంది), యాంటి-హైపర్‌టెన్సివ్ (రక్తపోటును తగ్గిస్తుంది) మరియు మూత్రవిసర్జన (మూత్రవిసర్జనను పెంచుతుంది) లక్షణాలను కలిగిఉంది.
కొత్తిమీర గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- వృక్ష శాస్త్రీయ నామం: కొరియండ్రమ్ సాటివమ్
- జాతి: ఎపియాసియె
- వ్యవహారిక నామం: కొరియాండర్, సిలాన్‌ట్రో, చైనీస్ పార్స్లీ
- సంస్కృత నామం: ధనియ
- ఉపయోగించే భాగాలు: ఆకులు, కాండం, విత్తనాలు
- జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, నైరుతి ఆఫ్రికా