గ్రీన్ టీ రకాలు మరియు ఉపయోగం
మనకు టీ ఎక్కడ లభిస్తుంది? గ్రీన్ టీ అంటే ఏమిటి? గ్రీన్ టీ కంటే ఇతర రకాల టీ లు ఎలా భిన్నంగా ఉంటాయి? ఈ గ్రీన్ టీ మీ సాధారణ టీ కంటే మెరుగైనదా? అవును, మెరుగైనదే! అయితే, ఎలా? ఏవిధంగా గ్రీన్ టీ మామూలు టీ కంటే మెరుగైంది?లాంటి ప్రశ్నలు మనందరి మదిలో మెదుల్తాయి. ఈ ప్రశ్నలన్నింటికీ వరుసగా సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం.
టీ పానీయంలో ఎన్ని రకాలున్నాయో ఆ అన్ని రకాలు కూడా ఒకే ఒక్క “టీ మొక్క” నుండే లభిస్తాయి. ఆశ్చర్యపోతున్నారా? అవును ఒకే రకమైన టీ మొక్క లేదా "టీ ప్లాంట్" నుండే రక రకాలైన టీ పానీయాలు లభిస్తాయి. ముడి తేయాకుల ‘ఆక్సిడెషన్ స్థాయి’ నుండి టీ- పానీయంలో రకాలు జనిస్తాయి. ఈ దిశలో ఆలోచిస్తే ‘బ్లాక్ టీ’ చాలా ఆక్సీకరణ చెందిన టీ మరియు ‘గ్రీన్ టీ’ ఆక్సీకరణ చెందని (unoxidized) టీ పానీయం. ప్రసిద్ధ “ఓలాంగ్ టీ” భాగశః ఆమ్లజనీకరణం (oxidisation) చేయబడింది. అయితే కొన్ని ఇతర రకాలైన టీ లు పులియబెట్టడం మూలంగా తయారవుతాయే కానీ ఎప్పుడూ ఆమ్లజనీకరణం చేయబడవు (Puerh tea).
టీ గురించి అవగాహన చేసుకునే దిశలో మీరు యోచిస్తుండగా మధ్యలో ఈ జీవశాస్త్ర పదం “ఆక్సిడేషన్” (లేదా ఆక్సీకరణం) వచ్చి అడ్డుపడుతోందా? దాని గురించి కూడా వివరిస్తాం. ఆక్సిడేషన్ అంటే ఆహారం ద్వారా ఆక్సిజన్ (ప్రాణవాయువు)ను శోషణ చేయడం. జీవరసాయనికంగా ఆహారంలో మార్పులకు కారణమవుతుంది, ఇక్కడ ఈ టీ విషయంలో, ముడి టీ ఆకులు ఆ మార్పునకు లోనవుతాయి. కట్ చేసి పెట్టిన యాపిల్‌పండును ఎప్పుడైనా గమనించారా, అది గోధుమ రంగులోకి మారడం గమనించే ఉంటారు మీరు. అవునా? అదే ఆక్సీకరణం అంటే. టీ తయారీ విషయంలో భాగశః ఆక్సీకరణం సహజమైంది, మరి మిగిలిన ఆ కొంత ఆక్సీకరణాన్నినియంత్రించిన పరిస్థితులు గల్గిన గదులలో చేయబడుతుంది. ఆ సమయంలో గదుల ఉష్ణోగ్రతను, తేమను కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఆకులు ఒక నిర్దిష్ట స్థాయి ఆక్సీకరణ స్థాయిని చేరుకున్న తర్వాత, అప్పటి వరకూ జరుపుతున్న ఓ నిర్దిష్టస్థాయి వేడి ప్రక్రియ నిలిపివేయబడుతుంది. అయినప్పటికీ, ఆక్సీకరణ అనేది ఒక సహజ ప్రక్రియ మరియు పూర్తిగా నిలిపివేయబడదు. కాని, టీకి ఓ మంచి నిల్వ ఉండే (shelf life) శక్తిని ఇవ్వడానికి ఆక్సీకరణ ప్రక్రియను తగినంతగా తగ్గించవచ్చు.
మీరు రెగ్యులర్ గా తాగే టీ సాధారణంగా పాలు మరియు పంచదారతో ఉడికించిన బ్లాక్ టీ. బ్లాక్ టీ కి పాలు మరియు పంచదార కలిపితే మీ ఆరోగ్యానికి మంచి కంటే మరింత హాని చేస్తుందని వాదించే వారు కొందరున్నారు. కానీ ఆ వాదనను వ్యతిరేకించే వారూ ఉన్నారు. కాబట్టి, దీన్ని గురించి శాస్త్రీయ ప్రమాణాల లేకపోవడంతో, మీ శరీర తత్వానికి ఏది సరిపోతుందో దాని గురించి పోషకాహార నిపుణులతో సంప్రదింపులు జరిపి నిర్ణయించుకోవచ్చు.
మూలికలతో తయారైన టీ రకాలు (హెర్బల్ టీస్) టీ మొక్కకు బదులుగా హైబిస్కస్, జాస్మిన్, చమోమిలే వంటి వివిధ మొక్కల నుండి తయారు చేస్తారు. కాబట్టి, అవి గ్రీన్ టీగా పరిగణించబడవు. అయినప్పటికీ, చాలా రకాలైన రుచులు కల్గిన గ్రీన్ టీ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పుదీనా గ్రీన్ టీ, మల్లెల గ్రీన్ టీ, నిమ్మకాయ గ్రీన్ టీ వంటివి. మార్కెట్ కు వెళ్ళినపుడు టీ ఉత్పత్తి యొక్క యదార్ధత (genuinity) కోసం దానిపై లేబుల్ను తనిఖీ చేయడం మంచిది.
చాలా రకాలైన టీ బ్రాండ్ల టీ పొడి ప్యాక్ చేయబడకుండా, అంటే లూజ్ గా, మార్కెట్లో లభిస్తుంది. అయితే, మీరు టీ ని అమితంగా ఇష్టపడేవారైతే, మరీ అందులోనూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ నే ఉపయోగిస్తూ ఉన్నట్లైన, అలాంటి నాణ్యమైన టీ పొడి “టీ బ్యాగులు” రూపంలో లభిస్తుంది. వాటిని ఎన్నుకొని కొనవచ్చు. ఇలాంటి బ్రాండ్ టీ పొడులు క్యాప్సుల్స్ రూపంలో మరియు టాబ్లెట్ల రూపంలో కూడా లభిస్తుంది.
“డీకాఫీనేటెడ్” (Decaffeinated) గ్రీన్ టీ రకంలో కెఫిన్ పదార్థాన్ని తొలగించి ఉంటారు. కఫిన్ పదార్థాన్ని తట్టుకోలేని లేక తాగలేని వారికి ఇలాంటి కఫిన్ తొలగించిన గ్రీన్ టీ అందుబాటులో ఉంది. ఇలాంటి టీ లో “యాంటీ-ఆక్సిడెంట్లు” తక్కువుంటాయి. అయితే డీకాఫీనేటెడ్ టీ మరియు మామూలు టీ ల మధ్య భేదాన్ని వివరించే అధ్యయనాలు ఏవీ లేవు.
గ్రీన్ టీ రకాలు - Types of Green Tea in Telugu
టీ ప్రపంచపు తలుపులు తడితే టీ రకాల్లో చాలా రకాలు ఉన్నాయన్న సంగతి అవగతమవుతుంది. ఒక్క జపాన్ లోనే కనీసం 10 ప్రముఖ రకాలైన టీ రకాలను పండిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే టీ లలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్పాలంటే మరో కొత్త వ్యాసమే రాయాల్సి ఉంటుంది. అయినా విజ్ఞానం కోసం కొన్ని రకాలైన గ్రీన్ టీ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- సెంచా గ్రీన్ టీ:
సెంచా గ్రీన్ టీ అనేది జపాన్లో దొరికే అతి సామాన్యమైన టి మరియు దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. దీని తయారీలో టీ ఆకులను ఉడికిస్తారు. సేన్చా జపనీయుల గ్రీన్ టీలో అత్యంత సాధారణ రూపం మరియు ఇది సిద్ధం చేయడానికి సులభమైనది. ముడి ఆకులు ఉడికిస్తారు, ఆక్సీకరణను ఆపడానికి ఉడికించన టీ ఆకుల్ని చుట్టలుగా చుట్టి ఎండబెట్టి వాటికి సంప్రదాయ ఆకృతిని ఇస్తారు. వినియోగదారులు ఆ ఆకుల్ని అతి సులభంగా ఓ కప్పు నీటిలో వేడి చేసుకుని టీ గా తాగుతారు.
- గైకోరో గ్రీన్ టీ:
సెంచా గ్రీన్ టీ కి గైకోరో గ్రీన్ టీ కి వ్యత్యాసం ఉంది. అంటే టీ ఆకులను కోసుకోవడంలో (అంటే టీ ఆకు సంగ్రహం) వ్యత్యాసం ఉంది. గైకోరో గ్రీన్ టీ తయారీలో టీ ఆకుల్ని కోసేందుకు 20 రోజులు ముందుగానే టీ మొక్కల్ని ఒక బట్టతో కాపీ ఉంచుతారు. ఇలా చేయడం వల్ల టీ ఆకులు మరింత సువాసనను సంతరించుకుంటాయి. టీ ఆకుల్లో కాటెచిన్ల సంఖ్య ను తగ్గించేందుకు ఇలా బట్ట కప్పుతారు. ఈ టీ యొక్క మరొక రకం, కబుసేచా.” గైకోరో గ్రీన్ టీ కి చాలా సారూప్యంగానే టీ మొక్క పెరుగుతుండీ రకంలో, కాని టీ మొక్క ఒక వారం పాటు మాత్రమే బట్టతో కప్పబడుతుంది .
- మచ్చా గ్రీన్ టీ:
“తెన్చా” అని పిలవబడే మరొక రకపు గ్రీన్ టీ రకాన్ని పొడిగా మార్చడాన్ని “మచ్చా గ్రీన్ టీ” పొడి అని అంటారు. తెన్చా టీ మొక్క గైకోరో గ్రీన్ టీ మొక్క లాగానే నీడలో పెరుగుతుంది, కానీ బట్టతో మొక్కకు చేసే “కవరింగ్” సమయం 20 రోజులు కంటే ఎక్కువగా ఉంటుంది. మరియు ఆకుల్ని రోలింగ్ చేయకుండా ఎండబెట్టబడతాయి. టెన్చా టీ, అది రవాణా చేయబడటానికి కాస్త ముందు దాన్ని పొడిగా మారుస్తారు. దాన్నే “మచ్చా గ్రీన్ టీ” పొడి గా పిలువబడుతుంది.
- చైనీస్ గన్పౌడర్ టీ:
ఈ రకం “చైనీస్ గన్పౌడర్ గ్రీన్ టీ” కి దాని పేరు ఎలా వచ్చిందంటే దాని తయారీలో టీ ఆకుల్ని ఉడకబెట్టిన తర్వాత ఓ ప్రత్యేకమైన రూపంలో చుట్టబడతాయి. దీనికి ఓ ప్రత్యేకమైన పొగకు- సంబంధించిన వాసన (స్మోకీ రుచి) కలిగి ఉండడం వల్ల దీనికి “చైనీస్ గన్పౌడర్ టీ అనే పేరు స్థిరపడింది.