‘’ఎరుపు బంగారం’అని ప్రముఖంగా తెలుపబడింది, కుంకుమ పువ్వు ప్రపంచంలో అత్యంత విలువైన సుగంధ ద్రవ్యం. ఇది క్రోకస్ సాటివస్ అనే పువ్వు నుండి వస్తుంది. మనకు తెలిసిన కుంకుమ పువ్వు, వాస్తవానికి క్రాకస్ పువ్వు యొక్క ఎండిన నారింజ-ఎరుపు రంగు కీలాగ్రం. కుంకుమ మొక్క, దాని మూలాలను మధ్యధరా ప్రాంతంలో కలిగిఉందని భావిస్తారు. కుంకుమ పువ్వు ఉత్పత్తి దారులలో ఇరాన అతి పెద్ద ఉత్పత్తిదారు, ప్రంపంచం యొక్క మొత్తం కుంకుమ పువ్వు ఉత్పత్తిలో 94% కంటే ఎక్కువ వాటాను ఇది కలిగిఉంది. భారతదేశంలో, జమ్ము & కాశ్మీర్ మరిరు హిమాచల్ ప్రదేశ్‌లో కుంకుమ పువ్వును సాగుచేస్తారు, దేశంలో ఈ మొక్కలను పెంచే అతి పెద్ద ఉత్పత్తిదారుగా జమ్ము & కాశ్మీర్ ఉంది.
పువ్వు నుండి కుంకుమ పువ్వును కోత కోయడం ఒక కష్టమైన పని. కొన్ని సంవత్సరాల వ్యవధిలో కుంకుమ పువ్వు ఒకసారి మాత్రమే పండించడం జరుగుతుంది. 1 కిలోగ్రామ్ కుంకుమ పువ్వు దాదాపుగా 1,60,000 నుండి 1,70,000 వరకూ చిన్న పువ్వులను కలిగిఉంటుంది. కుంకుమ ఉత్పత్తికి అవసరమైన తీవ్రమైన శ్రమ దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా చేసింది. అత్యుత్తమమైన కుంకుమ పువ్వు దాని యొక్క అన్ని ఎరుపు రంగు కలిగిన మరియు ఏకరీతిగా పొడవైన దారాలు ద్వారా గుర్తించబడుతుంది. నీరు లేదా ఏదైనా ద్రవంతో కుంకుమ పువ్వును కలపడం వల్ల, ఆ ద్రవానికి ఒక బంగారు పసుపు రంగు వస్తుంది, ఈ రంగు చూడడానికి గొప్పగా మరియు ఆకర్షణీయంగా ఆ ద్రవాన్ని చేస్తుంది.
కుంకుమ పువ్వు యొక్క ప్రకాశవంతమైన మరియు తియ్యటి వాసనను వివిధ మొఘలాయి వంటకాల నుండి సులభంగా బయటకు గుర్తించవచ్చు. కుంకుమ పువ్వును సాధారణంగా అనేక భారతీయ తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తారు, ప్రత్యేకంగా ఖీర్ మరియు పాయసంలో అదనపు రుచిని జోడించడానికి ఉపయోగిస్తారు. దీనిని బిర్యానీ వంటి మసాలా వంటకాలు, కేకులు మరియు బ్రెడ్‌లలో కూడా ఉపయోగిస్తారు. ఒక సుగంధమైన మొక్కగా దీనిని సాధారణంగా సువాసన ద్రవ్యాలు మరియు సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తారు. చైనా మరియు భారతదేశంలో కుంకుమ పువ్వును ఒక ఫ్యాబ్రిక్ రంగుగా మరియు తరచుగా మతపరమైన ప్రయోజనాల కొరకు, దీనిని ఒక పవిత్రమైన వస్తువుగా కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
అనేక సంవత్సరాలు ఔషధం యొక్క సాంప్రదాయ, ప్రత్యామ్నాయ వ్యవస్థలలో కుంకుమ పువ్వు ఉపయోగించబడింది. ఇది యాంటిఆక్సిడంట్లను అధికంగా కలిగిఉంటుంది మరియు ఇతర మొక్క-ఉత్పన్న సమ్మేళనాలు రోగ నిరోధక వ్యవస్థకు ఉపయోగపడతాయి మరియు మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కుంకుమ పువ్వు యొక్క చికిత్సా లక్షణాల కారణంగా, వీటిని యాంటిసెప్టిక్స్, డైజెస్టివ్స్, యాంటిడిప్రెజంట్స్ మరియు మూర్ఛ వ్యాధిని తగ్గించే పదార్థాలుగా కూడా ఉపయోగిస్తారు. ఈ సుగంధ ద్రవ్యం, పొటాషియం, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలను మరియు విటమిన్ ఎ, విటమిన్ సి మొదలగు వంటి అవసరమైన విటమిన్లను కూడా అధికంగా కలిగిఉంది.
కుంకుమ పువ్వు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- వృక్ష శాస్త్రీయ నామం: క్రోకస్ సాటివస్
- కుటుంబం: ఇరిడేసియే
- వ్యవహారిక పేర్లు: సాఫ్రాన్, కేసర్, జఫ్రాన్
- సంస్కృత నామం: కేసర: (కేసర), కుంకుమతి(కుంకుమతి)
- ఉపయోగించే భాగాలు: మనము ఉపయోగించే కుంకుమ పువ్వు సుగంధపు కర్రలు, పువ్వు యొక్క కీలాగ్రం నుండి వస్తాయి, ఇవి చేతితో పండించబడతాయి మరియు తర్వాత ఎండబెట్టబడి, భవిష్యత్తు వినియోగం కోసం నిల్వ చేయబడతాయి.
- జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: కుంకుమ పువ్వు తన మూలాలను ఆగ్నేయ ఆసియాలో కలిగిఉందని భావించబడుతుంది. గ్రీస్ దీనిని మొట్టమొదట పండించింది. తర్వాత ఇది యురేషియా, లాటిన్ అమెరికా మరియు ఉత్తర ఆఫ్రికాలకు వ్యాపించింది.
- ఆసక్తికర అంశం: త్రివర్ణ భారతీయ జెండా యొక్క మొదటి రంగు, కుంకుమ పువ్వు యొక్క రంగు ద్వారా స్ఫూర్తి పొందింది.