జల్దారుపండును (అప్రికోట్) ఆసియాలో ఓ కమ్మని వేసవి పండుగా చెప్పవచ్చు, ఇది చైనాలో ఉద్భవించిందని నమ్ముతారు. చిన్నగా ఉండి, తియ్యని రుచి కల్గిన ఈ పండు పీచుపదార్థాలు, విటమిన్లు మరియు ఖనిజాలకు ఒక అద్భుతమైన సమృద్ధ మూలం. అదనంగా, ఈ పండుకు బంగారు నారింజ రంగునివ్వడానికి కారణమైన బీటా-కెరోటిన్ యొక్క మంచి మూలం. వాస్తవానికి, మొదటిసారి జల్దారు పండు ఐరోపాకు చేరుకున్నప్పుడు గ్రీకు దేశస్థులు ఆ పండ్లను "సూర్యుని యొక్క బంగారు గుడ్లు" అని వర్ణించారు.
జల్దారుపండు సుమారుగా 4 నుండి 5 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటుంది మరియు 35 గ్రాముల బరువు ఉంటుంది. జల్దారు పండ్లను కాచే చెట్లు పర్వత ప్రాంతపు వాలునేలల్లో బాగా పెరుగుతాయి. సమశీతోష్ణ ప్రాంతాలు, ప్రత్యేకించి మధ్యధరా ప్రాంతాలు దాని సాగుకు అనువుగా ఉంటాయి. అప్రికాట్ యొక్క అతిపెద్ద ఉత్పాదక దేశం టర్కీ. ప్రపంచంలోని మొత్తం ఆప్రికాట్ల ఉత్పత్తిలో 27% వాటాను ఒక్క టర్కీనే పండిస్తుంది. భారతదేశంలో, జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాలలో ప్రధానంగా ఈ జల్దారు పండ్లను సాగు చేస్తారు.
జల్దారు పండు ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎండిన ఆప్రికాట్లు ఇనుము యొక్క గొప్ప మూలం. కాబట్టి, మీరు గనుక రక్తహీనతని కలిగి ఉంటే, ఎండిన ఆప్రికాట్లను తినడంవల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈజిప్షియన్లు ‘అమర్-అల్-దిన్’ అని పిలవబడే ఒక ప్రత్యేక పానీయం తయారు చేసేందుకు ఎండిన ఆప్రికాట్లను ఉపయోగీస్తారు. జల్దారు పండు నూనె చర్మం మరియు జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
జల్దారు పండు గురించిన కొన్ని వాస్తవాలు:
- వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: పృనస్ అర్మేనియాక (Prunus armeniaca)
- కుటుంబం: రోసేసియా
- సాధారణ పేరు: ఇంగ్లీష్లో ‘అప్రికోట్’ , హిందీలో ‘ఖుబని’
- సంస్కృత నామం: అంధిగ్రహ
- ఉపయోగించే భాగాలు: పండు, గింజలు
- స్థానిక మరియు భౌగోళిక విస్తీర్ణం: ఆప్రికాట్ యొక్క మూలం స్పష్టంగా తెలియరాలేదు. ఈ పండు యొక్క అసలు సాగుదార్లు చైనీయులేనని ఓ నమ్మకం. అయినప్పటికీ ఆర్మేనియా దేశం ఆప్రికాట్లను మొదటగా పండించిందని మరికొందరు నమ్ముతున్నారు. సమశీతోష్ణ (టెంపరేట్), ప్రాంతాలు, ప్రత్యేకించి మధ్యధరా ప్రాంతాలు, జల్దారు పండు సాగుకు బాగా సరిపోతాయి. టర్కీ, ఇటలీ, రష్యా, స్పెయిన్, గ్రీస్, USA మరియు ఫ్రాన్సులలో కూడా జల్దారు పండు పండ్లను సాగు చేస్తారు.