అసలు మెంతులంటే ఏంటి?
మెంతిమొక్క ఒక మూలిక. మెంతులు ఒక సాధారణంగా ఉపయోగించే ఆహార పదార్దాన్ని సూచిస్తాయి. ఇది మధ్యధరా ప్రాంతం, దక్షిణ ఐరోపా మరియు పాశ్చాత్య ఆసియా ప్రాంతాలకు చెందినది. మెంతిమొక్క విత్తనాలు మరియు ఆకులు రెండింటినీ కలిగి ఉంటుంది, వీటి ఆహ్లాదకరమైన రుచి మరియు మూలిక యొక్క సువాసన కారణంగా వంటల కోసం మరియు ఔషధాలలో, ముఖ్యంగా ఆయుర్వేదంలో, దాని అసాధారణమైన లక్షణాలు కారణంగా ఉపయోగించబడుతుంది; మెంతిమొక్క యొక్క పెరుగుదలకు తగినంత సూర్యకాంతి మరియు సారవంతమైన నేల అవసరం మరియు ఇది సాధారణంగా భారతదేశంలో సాగు చేయబడుతుంది. భారతదేశం ఈ మూలిక యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారులలో ఒకటి. ఇక్కడ, మెంతు ఆకులును (మెథి) సాధారణంగా కూరగాయల వలె వండుతారు, మరియు విత్తనాలను మసాలాలు మరియు ఔషధాలలో క్రియాశీల పదార్ధంగా ఉపయోగిస్తారు. దీనిని వేరే ఔషదాలు లేదా మందులలో వాటి యొక్క వేరే పదార్దాల రుచి తెలియకుండా దాచిపెట్టే సంకలిత కర్తలా (additive agent ) కూడా ఉపయోగిస్తారు. ఇంతే కాకుండా, ఇది సాధారణంగా గృహ ఆధారిత నివారణలు (home based remedies) మరియు వివిధ రుగ్మతలు మరియు వ్యాధుల చికిత్సలకు ఉపయోగపడుతుంది, ఇది భారతీయ గృహాలు మరియు వంటశాలలలో ఒక అనివార్య భాగంగా ఏర్పడింది. జీర్ణ వ్యవస్థపై ఈ ఔషధం యొక్క చికిత్సా ప్రభావాల కారణంగా జీర్ణలోపాలును సాధారణంగా ఇంటి నివారణల (home remedies)తో వీటిని ఉపయోగించి చికిత్స చేస్తారు. ఈ వ్యాసంలోని తరువాతి విభాగాలలో అవి చర్చింపబడతాయి.
మెంతుల యొక్క ఉపయోగం మానవాళి చరిత్రలో, ప్రాచీన గ్రీకుల కాలం నుండి ఉంది, వారు శవాలు కుళ్లిపోకుండా చేసే పరిమళ ద్రవ్యములను తయారు చేసే క్రమములో (Process of emblaming)మెంతులు వాడేవారని వారి సమాధులలో ఉన్న మూలికలఅవశేషాల ద్వారా తెలిసింది. దాని బలమైన రుచి మరియు వాసన కారణంగా, ఇంట్లో కాఫీ మరియు పానీయాలలో వాడబడుతున్నది కెఫిన్ కానీ ప్రత్యామ్నాయంగా కాఫీలో దీనిని ఉపయోగిస్తారు.దీని యొక్క ప్రాధిమికనిజాలు మరియు పోషక విలువల గురించి ఒకసారి తెలుసుకుందాము
మెంతుల గురించి కొన్ని ప్రాధిమిక నిజాలు
- శాస్త్రీయ నామము: ట్రెగోనెల్ల ఫోఎనుం-గ్రీసియం (Trigonella foenum -graecum)
- కుటుంబం: ఫాబేసి (బఠాణి కుటుంబం)
- సాధారణ పేర్లు: మెంతులు, మెంతికూర, మేథీ, గ్రీక్ హే, గ్రీక్ క్లోవర్
- సంస్కృత నామం: బహుపర్ణి
- ఉపయోగించే భాగాలు: విత్తనాలు, ఆకులు
- శక్తి శాస్త్రం: వేడి