పాలు ఒక సంపూర్ణ పోషకాహారం మరియు సమతుల్య ఆహారం యొక్క అతి ముఖ్యమైన భాగాల్లో ఒకటి. పాలు అన్ని పోషకాలను సరైన మొత్తంలో కలిగి ఉంటుంది. వాస్తవానికి, ఇది కండరాల మరియు ఎముక ఆరోగ్యాన్ని నిర్మించడానికి అవసరమైన ప్రోటీన్లు మరియు కాల్షియం లను అత్యంత సమృద్ధిగా కల్గిన వనరుల్లో ఒకటి. భారత ప్రజల్లో ఉన్న ఓ ప్రగాఢ నమ్మకం ప్రకారం, దేశం లోని పల్లె ప్రజలు (country folk) ఎందుకు ఆరోగ్యాంగా ఉంటారంటే వాళ్ళు కల్తీలేని అసలు-సిసలైన స్వచ్ఛమైన పాలను కావలసినంతగా పొందుతారు కాబట్టి. పాలు అధిక పోషకాలతో కూడినదే కాకుండా, ఇది పేగుల్లో ఆరోగ్యసహాయక సూక్ష్మజీవుల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది మరియు పాలు లో ఉన్న విటమిన్ A కళ్ళ ఆరోగ్యానికి శ్రీరామరక్ష వంటిది. శరీరం మంచి ఆరోగ్యకరమైన పేగులు కలిగిఉంటే ఆవ్యక్తి యొక్క మంచి ఆరోగ్యానికి అవి ఎంతో దోహదపడతాయి.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రకారం, పశువుల (పెంటి జీవాల) స్తనాల నుండి స్రవించే స్రావాన్ని “పాలు” అని నిర్వచించింది, ఇంకా జీవాలనుండి వచ్చిన ఈ పాలకు ఏదీ కలపడం గాని లేదా పాలనుండి ఏదీ తొలగించటం కానీ జరగకూడదు, అవే “పాలు” అని నిర్వచించింది. దురదృష్టవశాత్తు, ఈ రోజుల్లో స్వచ్ఛమైన పాలను పొందడం చాలా కష్టంగా ఉంది. సాధారణంగా నీరు లేదా ఇతర పదార్ధాలను పాలకు కలిపి అమ్ముతున్నారిపుడు. అంటే పాలు కల్తీ చేయబడుతున్నాయి. ఈ మోసపూరిత చర్యలు పాల నాణ్యతను క్షీణింపజేస్తాయి మరియు కొన్ని సందర్భాల్లో ఇలాంటి కల్తీ పాలు మనుషులు తాగడానికి పనికిరానివిగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి మంచి నాణ్యత కల్గిన పాలను అందించే విధంగా పాలు మరియు పాల ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించడానికి భారతదేశం అంతటా వివిధ యూనిట్లు ఏర్పాటు చేయబడుతున్నాయి.
పాలు మరియు పాల-ఆధారిత ఆహారాల్ని తరచూ తినే వారు ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల మందికి (ఆరు బిలియన్ల మంది ప్రజలు) పైగానే ఉన్నారు. టీ, వెన్న పెరుగు, పాలు, క్రీము మరియు జున్ను వంటి పాల ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి భోజనంలోను వినియోగిస్తారు. లస్సీ మరియు మజ్జిగ (హిందీలో ‘చాచ్’) లాంటి పానీయాలు సంప్రదాయ భారతీయ ఆహారాల యొక్క ముఖ్యమైన భాగంగా ఉంటాయి మరియు వేడి కేకులు (hot cakes) పాల నుండి తయారైన పురాతన అమెరికన్ వంటకాల్లో ఒకటి. వాస్తవానికి, పురాతన కాలం నుండి మానవ భోజనం యొక్క ముఖ్యమైన భాగాలలో పాలు కూడా ఒకటి. US డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్డిఏ) ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారాన్ని తయారు చేయడానికి పాలు మరియు పాల ఉత్పత్తులను కూడా చేర్చాలని దాని ఆహార పదార్ధాల విషయ సూచికలో ఖచ్చితంగా పేర్కొంది. పాలు సాధారణంగా పశువులైన ఆవు, ఎనుము మరియు మేక వంటి జంతువులు నుండి లభిస్తాయి. ఆరోగ్య భద్రతా ప్రయోజనాల దృష్ట్యా తాగేందుకు ముందుగా పాలను బాగా వేడి చేయాలి. అయితే, అధిక సమయంపాటు పాలను ఉడికించినట్లయితే అందులోని పోషకాలు కొంతమేరకు కోల్పోతాయి.
పాలు గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు :
- సాధారణ హిందీ మరియు సంస్కృతం పేరు: దూధ్ (dudh, doodh), దుగ్ద్ (dugdh).
- ప్రపంచంలో పాల ఉత్పత్తి: ఐక్యరాజ్య సమితి (UN) యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే పాలలో 18% పాలను భారతదేశమే ఉత్పత్తి చేస్తోంది. అయితే, భారతీయ పాల ఉత్పత్తి యొక్క ప్రధాన భాగం గేదెల నుండి వస్తుంది. అమెరికా, చైనా, పాకిస్థాన్ మరియు బ్రెజిల్ మొత్తం పాలు ఉత్పత్తి పరంగా భారత్ తర్వాత కొంతకాలంగా అనుసరిస్తున్నాయి.
- సరదా వాస్తవాలు:
- ఒక ఆవు ప్రతిరోజూ 6.3 గాలన్ల పాలను మరియు తన మొత్తం జీవితకాలంలో 3,50,000 గ్లాసుల పాలను ఉత్పత్తి చేస్తుంది.
- ఆవులు ప్రతిరోజూ వంద పౌండ్ల ఆహారాన్ని తినడంతో పాటు యాభై గాలన్ల నీటిని తాగుతాయి.
- ఒక 8-ఔన్సుల పాలు గ్లాసులో లభించే కాల్షియం స్థాయిని పొందడానికి, 1/4 కప్పు బ్రోకలీ, ఏడు నారింజలు లేదా ఆరు ముక్కల (స్లైసెస్) గోధుమ రొట్టెను తినవచ్చు.
- రైతులు పాలను గ్యాలన్లలో కొలవరు, అయితే పౌండ్లలో కొలుస్తారు.
- ఎన్ డి డి బి (NDDB) లేదా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది భారతదేశంలో పాల నాణ్యత మరియు పరిమాణాలకి బాధ్యత వహించే ఓ కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థ, ఇది భారతదేశ ప్రభుత్వంచే స్థాపించబడింది మరియు గుజరాత్లోని ఆనంద్ వద్ద దీని ప్రధాన కార్యాలయం ఉంది.