శతావరి (Asparagus racemosus) అంటే ఏమిటి?
హిమాలయ ప్రాంతానికి ప్రకృతిమాత అంతులేని కానుకల్ని కురిపించింది. ఆ కానుకలు బహువిధమైనవి. మానవుడి అలంకరణకు, వండుకుని తినేందుకు మరియు ప్రత్యేకమైన వైద్యానికి ఉపకరించే మూలికా కానుకలవి. దాదాపు మానవుడి ప్రతి అవసరానికి సహజ ప్రత్యామ్నాయాలు (మూలికల రూపంలో) ఇక్కడ దర్శనమిస్తాయి. హిమాలయపర్వతాల్లో మరియు ఆ పర్వత పాదప్రాంతాల్లో పెరుగుతున్న అడవిమొక్కలలో కనిపించేదే “శతావరి” అనే మూలిక. ఆయుర్వేదవైద్యంలో పేర్కొన్న పురాతనమైన మూలికలలో శతావరి ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధాలలో కనిపిస్తాయి. “చరక సంహిత” మరియు “అష్టాంగ హృదయ్యం” అనే వైద్యగంథాలు రెండింటిలోను శతావరిని "ఆడ టానిక్" (female tonic) గా పిలవడం జరిగింది. కాబట్టి శతావరి ఓ బలవర్ధకౌషధం (tonic) అన్నమాట. నిజానికి, శతావరి అనే మాటకున్న అర్థం మీలో కుతూహలాన్ని రేపవచ్చు. “శతావరి” అంటే “వంద భర్తలను కలిగి ఉన్నది" అని అర్థం. కనుకనే ఇది స్త్రీ పునరుత్పాదక వ్యవస్థ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో తిరుగులేని మూలికగా శతావరి ప్రసిద్ధి చెందింది. అంతేలే అని మీరు అనుకొంటే, మీకు మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెనువెంటనే చెప్పాలి. అదేమంటే, ఆయుర్వేదం ప్రకారం, శతావరిని "నూరు వ్యాధుల్ని మాన్పునది" అని కూడా అంటారు. అదనంగా, శతావరికి ఉన్న “ఒత్తిడి-వ్యతిరేకతా” (అడాప్తోజేనిక్) గుణం మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఒత్తిడి-సంబంధిత సమస్యలకు పరిణామకారి ఔషధీ. ఇది ముసలి వయస్సు-సంబంధిత వ్యాధులకు కూడా ఉపశమనకారిగా పని చేసే చాలా ప్రభావవంతమైన మూలిక. శతావరి మూలికకున్న ప్రాముఖ్యం అంతటిది కాబట్టే ఆయుర్వేదవైద్యం దీనిని "మూలికల రాణి" (queen of herbs) గా పిలుస్తోంది.
శతావరి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- ఔషధీశాస్త్ర నామం (బొటానికల్ పేరు): అస్పరాగస్ రసిమోసస్
- కుటుంబం: లిలియాసియా / ఆస్పరాగసేయే
- సాధారణ పేరు: శతావరి, ఆస్పరాగస్ రూట్, ఇండియన్ ఆస్పరాగస్
- సంస్కృతం పేరు: శతావరి, శట్ములి/శతములి
- ఉపయోగించే భాగాలు: వేర్లు మరియు ఆకులు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: భారత ఉపఖండంలోని ఉష్ణమండల ప్రాంతాలు శతావరికి నిలయంగా ఉన్నాయి, కానీ ఇది భారతదేశ హిమాలయ ప్రాంతాలలో కూడా విస్తారంగా పెరుగుతుంది. శతావరి శ్రీలంక మరియు నేపాల్ ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది.
- శక్తిశాస్త్రం: శరీరానికి శీతలీకరణాన్ని మరియు తేమను కల్గించే గుణం శతావరికి ఉంది. ఆయుర్వేదంలో శతావరి గురించి ప్రస్తావించి, వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుందని చెప్పారు.