ఎర్రగా నిగ నిగలాడుతూ మెరిసే టొమేటో కంటబడితే చూడకుండా కళ్ళు తిప్పుకోవడం ఎవరికైనా అసాధ్యమే. టొమేటోను పలు విధాలుగా తింటాం, జ్యూస్ రూపంలో తాగుతాం, పచ్చి టొమేటోను స్లైడ్లుగా కోసి సలాడ్లలో మిశ్రమంగా వినియోగిస్తాం. ఇంకా సూప్లో కలుపుతాము, కమ్మని దాని రుచిని ఆస్వాదిస్తాం. పోషకాలకు చక్కటి మూలమైన టొమేటో ఓ గొప్ప ఆహారపదార్థమే (superfood), అందుకే దీన్ని అందరూ దాదాపు అన్ని వంటకాల తయారీలో చేర్చాలనుకుంటారు. మధురమైన రసాల (juices) నుండి, భోజనాలకు వండిన వంటకాల వరకు, సలాడ్లులోను టమోటాను దాని సహజమైన రంగు, రుచి మరియు అనామ్లజనకాల కోసం విస్తృతంగా ఉపయోగించబడుతుంది. నిజానికి, టొమాటో అమెరికా లోని న్యూ జెర్సీ రాష్ట్రం అధికారిక కూరగాయగా నియమించబడింది. చాలామంది తమ ప్రత్యేకమైన ఆహారాల్లో (special foods) టమోటాను ఒకటిగా భావిస్తారు.
టమోటాల్ని పండించడం సులభం, అందుకేనేమో టమాటో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన పంటగా మారిందిపుడు. టొమాటో జన్మస్థలం మధ్య అమెరికా ప్రాంతంమైన పెరూ. బంగాళాదుంప, పొగాకు, మిరప, మరియు మిరియాల వంటి “నైట్ షేడ్” (nightshade) మొక్కల కుటుంబానికి చెందినదే టమాటో కూడా. క్రీస్తుశకం 1500 ల మధ్యలో, టమోటాలు మొదట ఐరోపా ఖండానికి వచ్చాయి. తాజా కూరగాయల మార్కెట్లో నాలుగో స్థానంలో ఉన్న అతి ఎక్కువ డిమాండున్న కూరగాయ టమాటో; బంగాళాదుంపలు, ఆకు కోసు (lettuce), మరియు ఉల్లిపాయలు మొదటి మూడు స్థానాల్లో అతి ఎక్కువగా డిమాండున్న కూరగాయలు. టొమాటోల్లో సుమారు 25,000 రకాలున్నట్లు ఊహించబడుతోంది. ఇది అద్భుతమైన ఔషధ లక్షణాలను కలిగి ఉంది. టమోటాలు వేర్వేరు పరిమాణాల్లో మరియు రంగులతో ఉంటాయి మరియు అనేక రకాలుగా తయారు చేసుకుని తినేయవచ్చు. చాలా మంచి రుచి, వాసనల్ని కల్గిన టొమేటో లేకుండా చాలా మంది భోజనాన్ని ఊహించలేరు అంటే అతిశయోక్తి కాదు మరి.
ఆసక్తికరంగా, అమెరికన్లు ఇతర కూరగాయల నుండి కంటే టమోటా నుండీనే ఎక్కువ విటమిన్లు పొందుతున్నారు. ఇది పచ్చిగా ఉన్నప్పుడు దీని రంగు ఆకుపచ్చగా ఉంటుంది, పండైనపుడు ఎరుపు రంగులోకి ఎరుపు రంగులోకి మారి “టొమేటో పండు” అవుతుంది. టమోటా విత్తనాల్ని కలిగి, పుష్పించే మొక్క నుండి పండుతుంది పెరుగుతుంది, వృక్షశాస్త్రపరంగా టొమేటో ఒక కూరగాయగా కాకుండా ఒక పండు అని వర్గీకరించబడింది. వీటిని ఇటాలియన్ ఆహారంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు మరియు వారు చేసే ‘కెచప్’ కు అయితే టొమేటోలు తప్పనిసరి. అంతేకాకుండా, అనేక భారతీయ వంటకాలలో టొమాటోలు ఓ కీలకమైన కూరదినుసు. టొమాటోకు అంత ఆకర్షణీయమైన ఎర్ర రంగు ఎలా వచ్చింది అంటే దాన్లో ఉండే 'కరొటెనాయిడ్ల” నుండి వచ్చింది. కానీ టొమేటోలు కేవలం ఎరుపు రంగులో మాత్రమే కాదు, పసుపు, గులాబీ, ఊదా, నలుపు మరియు తెలుపు రంగులలో కూడా టొమేటోల్ని మనం చూడొచ్చు.
ప్రపంచంలో టొమేటోను అతి ఎక్కువ ప్రమాణంలో పండించే దేశం చైనా. 2009 లో ప్రపంచ ఉత్పత్తిలో నాలుగో వంతు టొమేటోల్ని ఒక్క చైనాయే పండించింది. అమెరికా (యునైటెడ్ స్టేట్స్) మరియు ఇండియా వరుసగా రెండవ మరియు మూడవ అతిపెద్ద టొమేటో ఉత్పాదక దేశాలు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, అమెరికా(USA) లోని ఓక్లహోమాకు చెందిన జి. గ్రాహం అనే ఆయన 1986లో అతి పెద్ద టొమాటోను పండించారు, దాని బరువు 3.51 కిలోలు! టొమాటోను క్యాన్సర్తో పోరాడటానికి, రక్తపోటును నిర్వహించడానికి మరియు మధుమేహం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ను తగ్గించేందుకు ఎక్కువగా వాడతారు. రక్తం వడపోత జరిపేదిగా మరియు తొలగించే ఆహారంగా కూడా పని చేస్తుంది.
ఆరోగ్యానికి మాత్రమే కాక, టొమేటో చర్మరక్షణ కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఇది ఎండవేడిచేత కమిలిన గాయాల (సన్ బర్న్స్) క్కూడా రక్షణ కల్పిస్తుంది.
టమాటా గురించిన ప్రాథమిక వాస్తవాలు
- రాజ్యం (kingdom): ప్లాంట (Plantae)
- కుటుంబం: సోలనాసియా
- తరగతి: డికోటిలెడొనే (Dicotyledonae)
- శాస్త్రీయనామం: సోలనమ్ లైకోపెర్శికం (Solanum lycopersicum)
- మూలం (origin): సాహిత్య పరంగా, ఆంగ్ల పదం 'టొమేటో' అనే పేరు, స్పానిష్ భాషా పదం, 'టమేట్' నుంచి వచ్చింది, దీని అర్థం "ఊదిపోయే పండు" అని. వృక్షశాస్త్రపరంగా (బొటానికల్గా), టమోటా మొక్క ఉద్భవం మధ్య అమెరికాలో, పెరూ సమీపంలో ఎక్కడో ఉద్భవించింది. టొమేటోను మొట్టమొదట 700 AD లో అజ్టెక్లు (అమెరికా యొక్క పురాతన తెగలలో ఒకటి) పండించి వృద్ధి చేశారని నమ్ముతారు
- గ్రూప్: డికోట్స్-Dicots
- ఇతర సాధారణ పేర్లు: 'టొమేట్ (ఫ్రెంచ్), టమేటర్ (హిందీ), పోమోడోరో (ఇటాలియన్)
- తమాషా వాస్తవం (ఫన్ ఫాక్ట్): ప్రతి సంవత్సరం స్పానిష్ పట్టణమైన బునాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద టమోటా పోరాటం జరుగుతుంది. ఈ పండుగను “లా టొమాటినా” అని పిలుస్తారు, దీనిలో సుమారు 40,000 మంది ప్రజలు సుమారు 1,50,000 టమోటలను ఒకరిపై విసురుకొని ఆనందిస్తారు .