ఋతుక్రమం (ముట్టు) కావడమనేది వేర్వేరు స్త్రీలు వేర్వేరురకాలుగా అనుభవించే జీవ ప్రక్రియలలో ఒకటి. అయితే కొందరు మహిళలలో, ఋతుస్రావం (ముట్టు) చాలా సమస్యాత్మకంగా ఉంటుంది, మరి వారిలో ఉపశమనం తీసుకురావడానికి మరియు దానికి తోడు ద్వితీయ వైద్య రుగ్మతల్ని (secondary medical conditions) నిరోధించడానికి సరైన చికిత్స చేయవలసి ఉంటుంది.

ఋతుక్రమం సమయం యొక్క దినాల సంఖ్యను తగ్గించడాన్ని వైద్యపరంగా "అమినోరియా చికిత్స" గా పిలువబడుతుంది. ఇంతవరకూ, మహిళల్లో ఋతు లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ప్రారంభదశలో చేసే చికిత్సే ఇది. అయితే ఈ రోజుల్లో, అలాంటి లక్షణాలేవీ లేకుండా మహిళలచే ఇది ఎంపిక చేయబడుతుంది, ఎందుకంటే ఇది జీవిత నాణ్యతను మెరుగుపర్చడానికి మరియు ఉత్పాదకతను పెంచడానికి సూచించబడింది. ఆడవారి ముట్టుసమయం ముగియడానికి చాలామంది మహిళలు వెంటనే మందులు తీసుకుంటారు, అయితే, కొన్ని సహజ ఆహారాలు మరియు విటమిన్ సప్లిమెంట్లు కూడా దానికి సహాయపడవచ్చు. ఈ మందుల దీర్ఘకాలిక వాడకం యొక్క దుష్ప్రభావాలు స్పష్టంగా లేవు, కానీ ఈ పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా మహిళలచే విస్తృతంగా ఆమోదించబడ్డాయి.

  1. పరిచయం - Introduction in Telugu
  2. ఋతుక్రమ సమయాన్ని త్వరగా ముగించేందుకు నిబంధనలు మరియు కారణాలు - Conditions and reasons for ending periods soon in Telugu
  3. రుతుక్రమ (ముట్టు) కాలాన్ని సహజంగా ఎలా ముందుగా ముగించవచ్చు - How to end period early naturally in Telugu
  4. ఋతుక్రమం సమయాన్ని కుదించే మందులు - Medicines to end periods early in Telugu
  5. ఋతుచక్రాలను ఆపడానికి వాడే మందుల యొక్క దుష్ప్రభావాలు - Side effects of medicines to stop periods in Telugu
  6. ఋతుచక్రాలని ప్రారంభ దశలోనే ఆపడానికి సర్జరీ - Surgery to stop periods early in Telugu

కొన్ని సంవత్సరాల క్రితం వరకూ, ఋతు చక్రాల వ్యవధిని తగ్గించే చికిత్సను డిస్మెనోరియా (ఋతుక్రమనొప్పి), మెనోరర్హయా (భారీ రక్తస్రావం), తీవ్రమైన ఋతు తిమ్మిరి మరియు ఇతర అంతర్లీన ఆరోగ్య సమస్యలున్న మహిళలకు మాత్రమే సిఫార్సు చేయబడేది. కానీ ఇటీవల, ముట్టుసమయాన్ని తగ్గించేందుకు లచించే ఈ ఉత్పత్తుల యొక్క అధిక మార్కెటింగ్ కారణంగా తమ క్రమమైన ముట్లసమయంలో కొన్ని రోజులు తగ్గించటానికి మహిళలు పెద్ద సంఖ్యలో సుముఖులవుతున్నారు. ఈ వ్యాసం సూచించిన మందుల ఉపయోగం మరియు ఈ సామర్ధ్యాన్ని కలిగి ఉన్న కొన్ని సహజమైన ఆహార పదార్థాల ఉపయోగంతో ప్రారంభించిన అనేక మార్గాలను చర్చిస్తుంది. వాటి సంబంధిత దుష్ప్రభావాలు కూడా ఈ వ్యాసంలోపేర్కొనబడ్డాయి.

Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

"ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్" ప్రకారం, ఋతుక్రమం అణిచివేత సిఫారసుకు అత్యంత సాధారణ కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

పునరుత్పత్తి వ్యవస్థ యొక్క వ్యాధులు మరియు పరిస్థితులు

కటి ప్రదేశం మరియు పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన కొన్ని రుగ్మతలతో కూడిన పరిస్థితులు మరియు  వ్యాధులను బట్టి వైద్యులు అమెనోర్హీయా చికిత్సను సిఫార్సు చేస్తారు:

  • కటి ప్రాంతంలో (పెల్విక్) దీర్ఘకాలిక నొప్పి
    ఈ పరిస్థితితో  బాధపడుతున్న స్త్రీలు ఋతుక్రమ సమయం మరియు కానీ సమయంలో కూడా తీవ్ర కటిభాగపు నొప్పిని అనుభవిస్తారు, ఇది ఋతుస్రావం సమయంలో అధ్వాన్నంగా మారుతుంది.
  • ఎండోమెట్రియోసిస్
    అండాశయం, ఫెలోపియన్ గొట్టాలు, మరియు ఉదర కుహరం వంటి గర్భాశయం కాక ఇతర ప్రదేశాలలో మరియు అవయవాలలో ఎండోమెట్రియం పెరుగుదల (గర్భాశయం యొక్క అంతర్గత గోడల్లో)నే “ఎండోమెట్రియోసిస్” గా  పిలువబడుతుంది. ఎండోమెట్రియోసిస్ తో బాధపడుతున్న స్త్రీ తను ముట్టు (రుతుక్రమం) సమయాన్ని అనుభవిస్తుంటే, ఎండోమెట్రియం కారడం జరిగి గర్భాశయంలో రక్తస్రావంతో పాటు అసాధారణ ఎండోమెట్రియల్ పెరుగుదల ఇతర ప్రదేశాలకు కూడా వ్యాపిస్తుం. ఫలితంగా, ఆ స్త్రీకి రుతుక్రమం చాలా నొప్పితో కూడుకుని బాధాకరమైనదిగా పరిణమిస్తుంది. అసాధారణ ఎండోమెట్రియల్ పెరుగుదల కారణంగా రుతుక్రమం (ముట్టు) లేనపుడు కూడా అనుభవించడం జరగవచ్చు.
  • డిస్మెనోరియా (ఋతుస్థానమందు నొప్పి)
    చాలామంది మహిళలు వారి ముట్టుకాలంలోని ప్రారంభ రోజులలో తేలికపాటి నొప్పిని ఎదుర్కొంటారు. అయితే, కొందరు స్త్రీలలో, ఈ నొప్పి చాలా తీవ్రంగాను మరియు బలహీనపరిచేదిగా ఉంటుంది. ఈ ముట్టునొప్పి పరిస్థితినే “డిస్మెనోరియా” అని పిలుస్తారు.
  • మెనోరగియా (రుతుక్రమంలో రక్తస్రావం ఎక్కువ కావడం)
    ఎన్.హెచ్.ఎస్ (NHS) ప్రకారం, సాధారణంగా ముట్టుకాలం సాధారణ కాల వ్యవధి 2 నుండి 7 రోజులు. అయితే, కొంతమంది మహిళల్లో భారీ రక్తస్రావం జరుగుతుంటుంది మరియు వారి ముట్టు వ్యవధి ఒక వారం కంటే ఎక్కువరోజులు కొనసాగుతూ ఉంటుంది. ఈ పరిస్థితినే “మెనోరగియా” అని పిలుస్తారు.
  • క్రమరహిత ఋతు రక్తస్రావం
    కొన్ని పునరుత్పత్తి వ్యాధులు ఉన్నాయి, అలాంటివాటిలో PCOS (పాలీసైస్టిక్ అండాశయ సిండ్రోమ్) వ్యాధి వంటి రుగ్మతల్లో అండం (గుడ్డు) సక్రమంగా (రెగ్యులర్ గా) విడుదల కాదు, ఇది క్రమరహిత రక్తస్రావం మరియు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. అటువంటి స్త్రీలలో అండాశయాలు పనిచేయకపోవచ్చు మరియు వారిలో ఋతు చక్రాల కాలవ్యవధి (ముట్టువ్యవధి) మారుతూ ఉంటుంది.
  • తీవ్రమైన రుతుక్రమం (ముట్టు) లక్షణాలు
    ముట్టుకాలంలో తీవ్రమైన వ్యాధిలక్షణాలను అనుభవించే చాలా మంది మహిళలు ఉన్నారు. ఇలాంటి స్త్రీలు కేవలం తీవ్రమైన నొప్పిని మాత్రమే కాకుండా వికారం, వాంతులు, తలనొప్పి , తీవ్రమైన కండరాల తిమ్మిరి, రొమ్ము నొప్పి  మరియు భారీ రక్తస్రావం వంటి ఇతర సంబంధిత-లక్షణాలు కూడా ఉంటాయి.
  • రక్త సంబంధిత రుగ్మతలు
    • రక్తం గడ్డకట్టే రుగ్మతలు: రక్తం గడ్డకట్టవలసిన సాధారణ పవ్యవధిలో రక్తం గడ్డకట్టకపోయినప్పుడు, దాన్నే ‘గడ్డకట్టే రుగ్మత’గా పిలువడం జరుగుతుంది. రక్తం గడ్డకట్టే కారకాల లోపం లోపాలకారణంగా ‘గడ్డకట్టే రుగ్మత’కు గురైన కొందరు స్త్రీలు సుదీర్ఘకాలం రుతుక్రమంతో కూడా బాధపడుతూ ఉంటారు. ఎండోమెట్రియం రుగ్మత కారణంగా రక్తం గడ్డకట్టడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ రక్తం గడ్డకట్టే రుగ్మత సంభవించడం జరుగుతుంది.​
    • రక్తహీనత మరియు రక్తస్రావం అనారోగ్యాలు: రక్తహీనత లేదా ఇతర రక్తస్రావంతో సంబంధమున్న వ్యాధులైన, సికిల్ సెల్ వ్యాధి, వాన్ విల్లెబ్రాండ్ వ్యాధి, హేమోఫిలియా మరియు ఇతర వ్యాధులతో  బాధపడుతున్న స్త్రీలు రుతుక్రమం (ముట్టు) సమయంలో దీర్ఘకాలంపాటు రక్తస్రావానికి గురై బాధపడతారు. దీని కారణంగా, రక్తహీనత లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి.
    • తగ్గించబడిన ప్లేట్లెట్లు: థ్రోంబోసైటోపెనియా వంటి ప్లేట్లెట్ రుగ్మతలలో, మన శరీరంలో తగినంతగా ప్లేట్లెట్లు ఉత్పత్తి చేయలేకపోయి, రక్తస్రావం సమయం సుదీర్ఘమవుతుంది.తక్కువైన ప్లేట్లెట్లు సాధారణంగా రక్తస్రావాన్ని ఆపడానికి విఫలమవుతాయి. అందువల్ల, ఈ వ్యాధికి గురవుతున్న స్త్రీలు దీర్ఘకాలిక రుతుక్రమ (ముట్టు) కాలాన్ని అనుభవిస్తారు.
  • క్యాన్సర్
    ఒక స్త్రీ క్యాన్సర్తో బాధపడుతున్నట్లయితే , ఆమె కెమోథెరపీ చికిత్సను పొందవలసి ఉంటుంది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులు శరీర సాధారణ పనితీరును అడ్డుకుంటాయి మరియు వారి శారీరక బలం కూడా తగ్గిపోతుంది. క్షీణించిన శరీర బలం కారణంగా ఋతుక్రమం (ముట్టు) లక్షణాలను తట్టుకునే సామర్ధ్యం తగ్గుతుంది. ఇది తీవ్రమైన నొప్పి, భారీ రక్తస్రావం, వికారం, వాంతులు మరియు ఇతర ఋతు లక్షణాల ప్రకోపానికి కారణం కావచ్చు.

మానసిక ఆరోగ్య సంబంధిత సమస్యలు

ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు మరియు బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక ఆరోగ్య క్రమరాహిత్యాలు పునరుత్పత్తి ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. అటువంటి మహిళలలో హార్మోన్ల మార్పులు మరియు అండోత్సర్గలోపాలు తీవ్రమైన ఋతు లక్షణాల ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశాల్ని పెంచుతాయి.

నరాల వ్యాధులు

పార్శ్వపు నొప్పి మరియు మూర్ఛ వంటి నరాల వ్యాధుల వలన మహిళ యొక్క నొప్పిని తట్టుకునే సహన పరిధి తగ్గుతుంది మరియు ఆమె తిమ్మిరినొప్పుల తీవ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి, అటువంటి మహిళలకు ఋతుక్రమం యొక్క అసౌకర్యాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది.

ఋతు ప్రకోపాలకు సంబంధించిన ఇతర వ్యాధులు

ఋతుక్రమం (ముట్టు) అనుభవం మీద ప్రభావాన్ని చూపే కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులు అటువంటి మహిళలలో ఋతుక్రమ లక్షణాలను తీవ్రంగా పెంచవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాంటి వ్యాధుల్లో కొన్ని ఇలా ఉన్నాయి:

వృత్తిపరమైన కారణాలు

కొన్నిసార్లు, వృత్తిపరమైన కారణాల వలన, కొంతమంది మహిళలు ఉద్యోగరీత్యా మంచి పనితీరును నిర్ధారించడానికి వారి ఋతుచక్రం యొక్క వ్యవధిని తగ్గించాల్సిన అవసరం ఏర్పడుతుంది. పనిలో ఉత్తమమైన ఫలితాలను అందించటానికి నిశిత దృష్టి, మంచిఏకాగ్రత ముఖ్యమైనవి. అలాంటి వృత్తుల్లో కొన్ని:

  • సైనిక లేదా రక్షణ దళాలు
  • వ్యాయామ క్రీడలు
  • పైలట్లు, వ్యోమగాములు మరియు వారి క్యాబిన్ సిబ్బంది వంటి ఏవియేషన్ మరియు ఏరోస్పేస్ ఉద్యోగాలు.

కొన్ని సహజ ఆహారాలు మరియు విటమిన్ సప్లిమెంట్లు ఉన్నాయి, ఇవి సుదీర్ఘ కాలంపాటు సేవిస్తే ముట్టుకాలం (వ్యవధి) రోజుల్ని తగ్గించడంలో సహాయపడతాయి. మెనోరాగియా (menorrhagia)లోని జీవవైద్య సాహిత్యం యొక్క సమగ్ర సమీక్ష ప్రకారం, కింద కనబర్చిన ఆహార అనుబంధక ఆహార పదార్ధాలు మరియు మూలికలు ముట్టుకాలం రక్తస్రావాన్ని తగ్గించడం మరియు ముట్టుకాలాన్ని త్వరగా ముగించడంలో సహాయపడతాయి:

విటమిన్ ఎ

విటమిన్ ఎ సప్లిమెంట్లను తీసుకోవడంవల్ల ముట్టుకాలం రోజుల సంఖ్యను తగ్గించడానికి వీలవుతుందని (ప్రయోగాత్మకంగా) చూపబడింది. విటమిన్ A యొక్క గరిష్ట మోతాదు పెద్దలకు 3000 mcg. ముట్టు కాలాన్నిత్వరగా ముగించడానికి విటమిన్ A అనుబంధకాల్నిఅధిక మోతాదులో తీసుకోవడానికి సిఫార్సు చేయబడింది. ఈ మోతాదును అర్థం చేసుకునేందుకు డాక్టర్ను సంప్రదించండి.

ఐరన్ (ఇనుము)

శరీరంలో ఇనుము యొక్క లోపం భారీ ఋతుక్రమ రక్తస్రావానికి దారితీయవచ్చని మీలో చాలా మందికి బహుశా తెలియకపోవచ్చు, కొన్నిసార్లు ఇనుము లోపం మీ ముట్టుకాలం (ఋతుక్రమకాలం) వ్యవధిని కూడా పెంచుతుంది. అందువల్ల మీ ఆహారంలో ఇనుము పుష్కలంగా ఉండే నల్లటి ములాసెస్, ఎండుద్రాక్ష, బ్రూవర్ యొక్క ఈస్ట్, బచ్చలికూర, గుడ్లు, బీన్స్ వంటివి మీ ఆహారంలో తీసుకోవడంవల్ల ముట్టుకాలంలో ఒకటి లేక రెండు రోజుల్ని తగ్గించడానికి సహాయపడవచ్చు.

విటమిన్ బి కాంప్లెక్స్

శరీరంలో విటమిన్ బి కాంప్లెక్స్ యొక్క లోపం ఏర్పడ్డప్పుడు, కాలేయం యొక్క పనితీరు తగ్గిపోతుంది. ఫలితంగా, కాలేయం రుతుస్రావానికి కారణమయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ ను నిష్క్రియం చెయ్యలేక పోతుంది. అందువల్ల, విటమిన్ బి కాంప్లెక్స్ ను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మీ రుతుక్రమ (ముట్టుకాల) వ్యవధిని తగ్గిస్తుంది.

విటమిన్ సి మరియు బయోఫ్లోవనాయిడ్లు

విటమిన్ సి మరియు బయోఫ్లోవానాయిడ్లు భారీ రక్తస్రావాన్ని తగ్గించడమే కాకుండా, ఆహారం నుండి ఇనుము యొక్క ఉత్తమ శోషణకు సహాయపడతాయి. అవి కేప్పిల్లరీ గోడల విఘటనను తగ్గిస్తాయి. అందువల్ల విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లు (నిమ్మకాయ , నారింజ, మామిడి, టమోటాలు మరియు మరిన్ని) మరియు కూరగాయలు (బ్రోకలీ, బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, బచ్చలికూర మరియు ఇతర ఆకుపచ్చ కూరగాయలు) వంటి ఆహారాలు కూడా మీ ముట్టుకాలవ్యవధిని త్వరగా ముగించటానికి సహాయపడతాయి. మీరు విటమిన్ సి సప్లిమెంట్లను రోజువారీగా తీసుకోవచ్చు. విటమిన్ C యొక్క గరిష్ట రోజువారీ మోతాదు మగాళ్లకు 75 mg, ఆడవారికి మరియు శిశువుల కోసం 65 mg ఉంటుంది.

విటమిన్ కె

విటమిన్ కె  గడ్డకట్టే యంత్రాంగం ప్రక్రియకు ఒక ముఖ్యమైన పోషక పదార్థం. అనేకమంది స్త్రీలు సాధారణ రక్తస్రావం మరియు గడ్డకట్టే సమయాన్ని కలిగి ఉన్నప్పటికీ, విటమిన్ K పదార్ధాల వినియోగం తేలికపాటి గడ్డ కట్టించే సమస్యలకు సహాయపడవచ్చు. యుక్తవయసు ఆడపిల్లలకు విటమిన్ k రోజువారీ మోతాదు 75 mcg మరియు వయోజన మహిళలకు రోజుకు 90 mcg అవసరం ఉంటుంది. ఏమైనప్పటికీ, మీ ఆరోగ్యం, బరువు, ఎత్తు, మరియు ఇతర వైద్య పరిస్థితులను బట్టి మీ రుతుక్రమ కాలాన్ని త్వరగా ముగించడం కోసం ఈ మోతాదులను మీ వైద్యులు పెంచవచ్చు.

ఇతర పద్ధతులు

వ్యాయామం, మసాజ్, హీట్ థెరపీ, భావప్రాప్తిని పొందడం, నీరు ఎక్కువగా త్రాగటం వంటివి ముట్టు వ్యవధి రోజుల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉండే కొన్ని ఇతర పద్ధతులు. మీ ముట్టుకాలం వ్యవధిని తగ్గించడంలో ఇవి ప్రయోజనకరం కావచ్చు, ఎందుకంటే:

  • వ్యాయామం మీ ఎండోమెట్రియల్ లైనింగ్ ను వేగంగాను మరియు ముందుగా కదిలిస్తుంది, అందువలన, ముట్టుకాలం రోజుల సంఖ్యను తగ్గించడం వీలవుతుంది.
  • కటిప్రాంతం ప్రాంతంలో వేడి చికిత్స మరియు రుద్దడంవల్ల మీ గర్భాశయ కండరాలకు విశ్రాంతినిచ్చి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి సహాయపడతాయి. వేడిచికిత్స, రుద్దడమనే ప్రక్రియలు ముట్టు కాలపు నొప్పిని తగ్గించడంలో చాలా సహాయకారిగా ఉన్నట్లు గుర్తించినప్పటికీ, ఈ ప్రక్రియలు ముట్టుకాలపు రోజుల్ని తగ్గించడంలో సహాయపడవచ్చు లేదా సహాయపడకపోనూవచ్చు.
  • ముట్టు సమయంలో భావప్రాప్తిని (orgasm) పొందడం వల్ల మీ కటిప్రాంతం నొప్పి ఉపశమనంతో పాటుగా ఎండోమెట్రియల్ లైనింగ్ను వేగంగా తొలగిస్తుంది.
Pushyanug Churna
₹449  ₹499  10% OFF
BUY NOW

'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్' పత్రిక ప్రకారం, మహిళల ప్రాధాన్యతలను మరియు ఆమె ఆరోగ్య స్థితిని బట్టి వివిధ చికిత్స ఎంపికలు అమలు చేయబడతాయి, అవేవి అంటే:

నిరంతర మిశ్రమ నోటి గర్భనిరోధక మాత్రలు

ఈ గర్భనిరోధక మాత్రలు హార్మోన్ల యొక్క పలు సూత్రాలుగా ఉంటాయి, వీటిని ప్రతి రోజూ నోటిద్వారా కడుపులోకి తీసుకోవచ్చు, ప్లేసిబో మాత్రలను తీసుకోకుండా (విస్తరించిన-చక్రం అని కూడా పిలుస్తారు) వీటిని తీసుకోవచ్చు.

యోని కాంట్రాసెప్టివ్ రింగ్

యోని కాంట్రాసెప్టివ్ రింగ్ హార్మోన్ల కలయికను కలిగి ఉంటుంది. నెమ్మదిగా హార్మోన్లను నెలలో ఒక సారి విడుదల చేయటానికి ఇది యోనిలో ఉంచబడుతుంది. ఇది నెలవారీ ప్రాతిపదికన మార్చబడుతుంది.

ట్రాన్స్ డెర్మల్ కలయిక కాంట్రాసెప్టివ్లు

ట్రాన్స్డెర్మల్ కాంబినేషన్ కాంటెసెప్టైవ్స్ అనేది పాచెస్ (చర్మం క్రింద పొర) క్రింద ఉండే ఓ అతుకు లేక ప్యాచ్. అవి నెమ్మదిగా హార్మోన్ను అంతర్లీన కణజాలంలో విడుదల చేస్తాయి, ఇది రక్తప్రవాహంలో శోషించబడుతుంది. వీటిని ప్రతి వారం చర్మంలో అమర్చడం జరుగుతుంది.

ప్రొజెస్టిన్లు (progestins)

ఇవి ప్రధానంగా హార్మోన్ ప్రొజెస్టెరాన్ ను కలిగి ఉన్న నోటిద్వారా సేవించే కాంట్రాసెప్టివ్ మాత్రలు. ఉత్తమ ఫలితాల కోసం, ఈ మాత్రల్ని రోజువారీగా తీసుకోవాలి.

DMPA (డిపో మెడ్రోక్సీప్రోజెస్టెరోన్ అసిటేట్-DMPA)

DMPA అనేది శరీరం ఉత్పత్తి చేసే ప్రొజెస్టెరాన్ ను కలిగి ఉంటుంది, ఇది సహజ హార్మోన్ ను చాలా మటుకు పోలి ఉంటుంది. దీన్ని ప్రతి పన్నెండు వారాలకు ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.

డానాజోల్

డానాజోల్ అనేది ఓ స్టెరాయిడ్ ఔషధం, ఇది లైంగిక హార్మోన్ల విడుదలను నిరోధించడానికి లేదా నియంత్రించడానికి పిట్యుటరీ గ్రంధి మరియు అండాశయాలను లక్ష్యంగా చేసుకుంటుంది. వీటిని ప్రతి రోజు నోటిద్వారా కడుపుకు (మౌఖికంగా తీసుకోవాలి.

ప్రోజెస్టిన్-కలిగిన గర్భాశయ వ్యవస్థ

వీటిని లెవోనోర్జెస్ట్రెల్ (levonorgestrel) విడుదల చేయడానికి గర్భాశయంలో ఉంచబడతాయి. ఈ పరికరాలను గర్భాశయంలో ఐదు సంవత్సరాల వ్యవధిపాటు ఉంచుతారు, తర్వాత వాటిని వేరేవాటితో మార్చడం జరుగుతుంది.

GnRH అనలాగ్లు

చికిత్సల్లో ఉపయోగపడే ‘GnRH అనలాగ్లు’ సహజమైన గోనడోట్రోపిన్-విడుదల హార్మోన్లకు సమానమైన హార్మోన్లు. వీటిని నోటి ద్వారా కడుపుకు సేవించవచ్చు, సూది మందులుగా గ్రహించవచ్చు, లేదా నెమ్మదిగా కొంతకాలంపాటు హార్మోన్లను విడుదల చేసే ఇంప్లాంట్ల ద్వారా తీసుకోవచ్చు. ఔషధసేవనానికి పాటించే పాలన మార్గాన్ని బట్టి, వీటిని రోజువారీగా లేదా ప్రతి పన్నెండు వారాలకు తీసుకోవచ్చు.

ఇతర మందులు

ఋతుక్రమ (ముట్టు) లక్షణాలు నుండి ఉపశమనాన్ని అందించడంలో ఇతర మందులు సహాయపడతాయి. ఓవర్-ది-కౌంటర్ ప్రాదిపదికన లభించే పెయిన్కిల్లర్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ముఖ్యంగా ఇబ్యుప్రొఫెన్, పారాసెటమాల్, న్యాప్రోక్సెన్ వంటి NSAID లు (నాన్-స్టెరాయిడ్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) ఇందుకు సయాయపడతాయి. ఈమందులు మంటను-వాపును తగ్గిస్తాయి గనుక అవి మీ ఋతుక్రమం కాలవ్యవధిని త్వరగా ముగించడానికి కూడా ఉపయోగించవచ్చు. చక్కెరవ్యాధి (డయాబెటిస్), ఆస్తమా, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, లేదా ఇన్ఫెక్షన్లు వంటి అంతర్లీన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఇతర మందులు కూడా సహాయపడతాయి.

పైన పేర్కొన్న మందులవాడకంవల్ల అధికభాగం ఒకేరకమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. ఆ దుష్ప్రభావాలు ఇలా ఉంటాయి.:

  • నిరంతర మిశ్రమ నోటి కాంట్రాసెప్టివ్స్ యొక్క దీర్ఘకాలిక వాడకం తర్వాత, నరాల్లో ఏర్పడే  థ్రోమ్బోంఎంబోలిజమ్ (సిరల్లో రక్తం గడ్డకట్టడం) ప్రమాదం.
  • చర్మం యొక్క ప్రతిచర్యలు.
  • బరువు పెరుగుట.
  • ఎముక సాంద్రత తగ్గుదల.
  • క్రమం లేని (అనారోగ్య )ఋతు రక్తస్రావం.
  • ఎన్నో రోజులపాటు ఆగని ముట్టుస్రావం
  • వికారం.
  • వాంతులు.
  • రొమ్ము నొప్పి.
Ashokarishta
₹359  ₹400  10% OFF
BUY NOW

ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్లు , పాలీప్స్ మరియు ఇతర అసాధారణ పెరుగుదల వంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థల వ్యాధులతో బాధపడుతున్న మహిళలు ఈ వ్యాధులకు చికిత్స చేయడానికి మరియు వారి ఋతు లక్షణాలను మెరుగుపర్చడానికి శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంటుంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో వారి గర్భాశయం కూడా తొలగించబడుతుంది. ఇది ముట్లు శాశ్వతంగా నిలిచిపోయేందుకు దారితీస్తుంది.

వనరులు

  1. Paula Adams Hillard. Menstrual suppression: current perspectives. Int J Womens Health. 2014; 6: 631–637. PMID: 25018654
  2. Anna B. Livdans-Forret, DC, Phyllis J. Harvey, M.Ln, Susan M. Larkin-Thier. Menorrhagia: A synopsis of management focusing on herbal and nutritional supplements, and chiropractic. J Can Chiropr Assoc. 2007 Dec; 51(4): 235–246. PMID: 18060009
  3. Powell-Dunford NC et al. Menstrual suppression for combat operations: advantages of oral contraceptive pills. Womens Health Issues. 2011 Jan-Feb;21(1):86-91. PMID: 21185993
  4. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Menstrual Cycle.
  5. National Women's Health Network. Using Birth Control to Regulate or Skip Your Period. [Internet]
Read on app