సెర్వికల్ నొప్పి (cervical (neck) pain) అంటే ఏమిటి?
మెడ నొప్పి పురుషులు మరియు మహిళలు అనుభవించే ఒక సాధారణ బాధాకరపరిస్థితి. సాధారణంగా మధ్య వయస్కుల్లో వస్తుంటుందిది. ఈ నొప్పి ‘సెర్వికల్ వెర్టెబ్రయీ’ అనే మెడ భాగంలో పుడుతుంది, కాబట్టి దీన్ని ‘సెర్వికల్ నొప్పి’ అని కూడా పిలుస్తారు. మెడ నొప్పి సాధారణంగా కండర-కంకాళాల రుగ్మత వలన వస్తుంది. మెడ చుట్టూ ఉన్న కండరాలలో ఓ తేలికపాటి నొప్పి ఉంటుంది మరియు దీనివల్ల మెడ యొక్క సాధారణ కదలికలు కష్టమవుతాయి. మెడనొప్పివల్ల, మెడ యొక్క ఎగువ అవయవాలలో స్పర్శ జ్ఞానం కూడా కోల్పోవడం జరుగుతుంది. .
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మెడ నొప్పి తీవ్రమైన లేదా దీర్ఘకాలిక బాధాకర పరిస్థితి కావచ్చు. మెడ నొప్పికి సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు:
- మెడ కండరాలలో పెడసరం లేక బిర్రబిగుసుకుపోవడం
- మెడ కదలికల్లో పరిమితి
- మెడ పైభాగం అవయవాలలో జలదరింపు లేదా తిమ్మిరి
- మెడ ప్రాంతంలో నొప్పి
- భుజాలు నొప్పి మరియు ఎగువ అవయవాలలో నొప్పి
మీరు అనుభవించే అరుదైన లక్షణం పార్శ్వపు తల నొప్పి. దీర్ఘకాల నొప్పి విషయంలో, కొన్ని నరాల సమస్యలు తలెత్తవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మెడ నొప్పి వివిధ కారణాల వలన రావచ్చు. సాధారణ కారణాలు:
- మెడకు తీవ్రమైన బెణుకు
- విప్లాష్ గాయం (Whiplash injury)
- క్రీడల గాయాలు
- డిజెనరేటివ్ డిస్క్ వ్యాధి
- పనిచేసే చోట సకర్మం కాని భంగిమ
- మెడ యొక్క గుంజుడు కదలికలు
- కంప్యూటర్ / మొబైల్ ఫోన్ అధిక వినియోగం
- అలసట లేదా నిద్ర లేకపోవడం
- సెర్వికల్ స్పోండిలోసిస్ , ఆర్థరైటిస్ మరియు బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులు
- ఒత్తిడి మరియు ఆందోళన వంటి భావోద్వేగ కారకాలు
అరుదుగా, మెడ ప్రాంతంలో పెరుగుతున్న కణితి మెడ నొప్పికి కారణం అవుతుంది..
దీన్నిఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
క్షుణ్ణమైన వైద్య చరిత్ర పరిశీలన మరియు భౌతిక పరీక్ష ఆధారంగా మెడ నొప్పి కారణాన్ని నిర్ధారణ చేస్తారు. రోగ నిర్ధారణ చేయడానికి క్రింది విశ్లేషణ సాధనాలు ఉపయోగించబడతాయి:
- వెన్నుపూస కాలమ్ (vertebral column) యొక్క X- రే
- మెడ యొక్క MRI
- రోగి గతంలో నొప్పిని లేదా వాపు కలిగించే రోగమున్నట్లు నిర్ధారణ అయి ఉంటే సి-రియాక్టివ్ ప్రోటీన్ మరియు విటమిన్ సి మరియు విటమిన్ డి ల కోసం రక్తం పరీక్ష.
మెడ నొప్పికి చికిత్స ఇలా ఉంటుంది:
- ఫిజియోథెరపీ - స్వల్పకాలికంగా కీలును కదల్చకుండా పెట్టి ఉంచడం.
- మెడ వ్యాయామాలు
- పల్సెడ్ విద్యుదయస్కాంత క్షేత్ర చికిత్స
- నొప్పి నుండి ఉపశమనం పొందటానికి స్టెరాయిడ్ కాని శోథ నిరోధక మందులు మరియు కండరాల సడలింపులతో చికిత్స
- వేడి కాపాడాలు (హాట్ కంప్రెసెస్)
దీర్ఘకాలిక నొప్పిని కిందివాటి ద్వారా చికిత్స చేయవచ్చు:
- కండరాలను బలపరిచే మరియు ఓర్పు వ్యాయామాలు
- ఫిజియోథెరపీ మరియు డైయాథర్మీ
- నొప్పినివారిణులు (అనాల్జెసిక్స్), మంట, నొప్పిని ఉపశమింపజేసే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) మందులు మరియు కండరాల సడలింపు
- కౌన్సెలింగ్
- ఆక్యుపంక్చర్ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు
- నరాల సమస్య ఉంటే శస్త్రచికిత్స,
మొత్తానికి, మెడ నొప్పి మెడ భాగం (cervical area) నుండే ఉద్భవిస్తుంది. ఈ మెడ నొప్పి కండరాల నొప్పి నుండి నాడీ సంబంధిత సమస్యలు వరకు ఉంటుంది. మెడనొప్పికి ఫిజియోథెరపీ, వ్యాయామం మరియు మందులతో చికిత్స చేయవచ్చు.బాధాకరమైన ఈ మెడనొప్పి పరిస్థితిని నిరోధించడానికి పనిచేసే చోట సరైన భంగిమలో (కూర్చోవడమో లేక నిల్చోవడమూ) పని చేయడం మరియు సరైన వ్యాయామం సహాయపడుతాయి.