క్రోన్స్ వ్యాధి - Crohn's Disease in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

November 30, 2018

March 06, 2020

క్రోన్స్ వ్యాధి
క్రోన్స్ వ్యాధి

క్రోన్స్ వ్యాధి అంటే ఏమిటి?

క్రోన్స్ వ్యాధి అనేది పేగుల్లో మంటతో కూడిన ఒక రకం వ్యాధి (inflammatory bowel disease-IBD). ఇది జీర్ణ వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక శోథ స్థితి మరియు ఈ వ్యాధి నోటి నుండి పాయువు వరకు ఏ భాగానికైనా రావచ్చు. ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధానంగా కనిపించే వ్యాధి మరియు పట్టణీకరణం ఫలితంగా ఈ వ్యాధి వ్యక్తులకు దాపురిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రోన్స్ వ్యాధి 0.3% మించి వ్యాపించింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ఈ వ్యాధి ప్రాబల్యం మరియు ఉనికి భారతదేశంలో ఎక్కువగా ఉందని ఓ తులనాత్మక అధ్యయనం వెల్లడించింది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్రాథమికంగా, క్రోన్స్ వ్యాధి చిన్న ప్రేగు యొక్క దిగువ భాగాన్ని బాధిస్తుంది. వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు తేలికస్థాయి నుండి తీవ్రంగా ఉంటాయి మరియు సాధారణంగా క్రమంగా అభివృద్ధి చెందుతాయి, కానీ కొన్నిసార్లు అకస్మాత్తుగా సంభవించవచ్చు. స్పష్టమైన సంకేతాలు లేదా వ్యాధి లక్షణాలు కనబడకుండా వ్యాధి  ఉపశమనంవైపు మొగ్గు చూపి తగ్గిపోతుంది. వ్యాధి చురుకుగా ఉన్నప్పుడు సాధారణంగా కింది వ్యాధి లక్షణాలు అగుపడుతాయి:

తీవ్రంగా వచ్చే క్రోన్స్ వ్యాధి కింది లక్షణాల్ని చూపుతుంది:

  • కళ్ళు, కీళ్ళు మరియు చర్మం యొక్క వాపు
  • పిత్తాశయవాహికల వాపు (లేక హెపాటిక్ వాపు)
  • పిల్లల్లో లైంగిక అభివృద్ధి (sexual development) ఆలస్యమవడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఇది పురుషులు మరియు మహిళలను సమానంగా బాధిస్తుంది మరియు సాధారణంగా 15-35 సంవత్సరాల వయస్సులో ఉండేవారికి వస్తుంటుంది. క్రోన్'స్ వ్యాధికి నిర్దిష్ట కారణం ఏదీ లేదు. కొన్ని కారకాలు వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి:

  • వంశపారంపర్యత: క్రోన్స్ వ్యాధి యొక్క కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది.
  • రోగనిరోధక వ్యవస్థ: ఒక వైరస్ లేదా బాక్టీరియా (సూక్షజీవులు) అసాధారణ రోగనిరోధక-మధ్యవర్తిత్వ స్పందనను ప్రేరేపించవచ్చని సూచించబడింది, ఇది రోగనిరోధక వ్యవస్థచే జీర్ణవ్యవస్థలోని కణాలపై దాడి చేయిస్తుంది, దీనివల్ల వాపు ఏర్పడుతుంది.
  • పట్టణ ప్రాంతంలో జీవిస్తున్న పర్యావరణ కారకాలు మరియు కొవ్వు మరియు శుద్ధి చేసిన ఆహార పదార్ధాలలో ఉన్న ఆహారం కూడా వ్యాధి ప్రాప్టించడంలో భారీ పాత్రను పోషిస్తాయి.
  • ఈ ప్రమాదం తూర్పు ఐరోపా సంతతికి చెందినవారిలో ఎక్కువగా ఉంటుంది.

క్రోన్స్ వ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ఈ వ్యాధికి సాధారణంగా నిర్వహించబడే కొన్ని సాధారణ పరీక్షలు:

  • రక్త పరీక్షలు:
    • ఏధైనా సంక్రమణను గుర్తించేందుకు, రక్తహీనత , వాపు ప్రతిస్పందన మరియు ఏదైనా విటమిన్ లేదా ఖనిజ లోపాలను గుర్తించడం కోసం.
    • జీర్ణాశయంలో రక్త స్రావాన్ని గుర్తించడం కోసం మలపరీక్ష చేసి వ్యాధిని అంచనా వేయవచ్చు.
    • రక్తంలో బయోమార్కర్స్ (ప్రతిరక్షకాలు) ఉండ టాన్ని గుర్తించేందుకు.
  • ఇమేజింగ్ పరీక్షలు:
    • ప్రామాణిక మరియు కాంట్రాస్ట్ X- రే
    • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్
    • లికోసైట్ సింటిగ్రఫీ (Leucocyte scintigraphy)
    • ఎండోస్కోపీ
    • అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (MRI)

చికిత్స ప్రధానంగా మందులసేవనం, ఆహార మార్పులు మరియు కొన్నిసార్లు వ్యాధి సోకిన భాగాన్ని తొలగించడానికి శస్త్రచికిత్సను ఉపయోగించడం పై దృష్టి పెడుతుంది.

  • రోగనిరోధక వ్యవస్థను అణిచివేసి వాపును తగ్గించే మందులు సాధారణంగా సూచించబడతాయి. ఒక ఇమ్యునోమోడ్యూలేటర్ను యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్తో కలిపి ఉపయోగించవచ్చు.
  • ఈ పరిస్థితిలో ఆకలి తక్కువగా ఉన్నందున, ఆహార మార్పులు చేయడంవల్ల  సమతుల్య ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది. మసాలాలతో కూడిన, నూనెతో కూడిన మరియు పీచుపదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలకు  బదులుగా మెత్తని, మసాలాల్లేని, పీచుపదార్తాల్లేని (బ్లాండ్) ఆహారాలు తినడంవల్ల వాపును తగ్గించడంలో సహాయపడవచ్చు.
  • శస్త్రచికిత్స సమర్థవంతమైన ఔషధేతర చికిత్స ఎంపికగా పరిగణించబడుతుంది. దాదాపు 70% రోగులకు చివరకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

స్వీయ రక్షణ మరియు తదుపరి చర్యలు:

  • మీరు తీసుకున్న అన్ని సూచించబడిన మరియు ఓవర్ ది కౌంటర్ (OTC) ఔషధాల జాబితాను రూపొందించండి. ఇది మీకు మరియు మీ వైద్యుడికి మీ పరిస్థితి గురించి మరింత తెలుసుకోవడానికి మరియు మీకు అనుకూలకరమైన చికిత్స ప్రణాళికను తయారు చేయడంలో సహాయపడుతుంది.
  • స్టెరాయిడాల్ కాని శోథ నిరోధక ఔషధాలను నివారించండి, ఎందుకంటే ఇవి సేవిస్తే వ్యాధి పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. మీరు వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటే, మొదట మీ వైద్యునితో సంప్రదించండి.
  • మసాలా ఆహారాల్ని సాధారణంగా తీసుకోవడం మానుకోండి, ఎందుకంటే మసాలా పదార్థాలు తినడంవల్ల మీ అసౌకర్యాన్ని పెంచుతుంది.
  • మీ వ్యాధి లక్షణాలను ఎల్లప్పుడూ అనుసరిస్తూ గమనించండి.
  • తదుపరి సాధారణ వైద్య సందర్శనలకు వెళ్లండి.



వనరులు

  1. Karger. Epidemiology of Inflammatory Bowel Disease in India: The Great Shift East. Basel, Switzerland. [internet].
  2. Crohn’s & Colitis Foundation. What is Crohn’s Disease?. New York, United States. [internet].
  3. American journal of Gastroenterology. ACG Clinical Guideline: Management of Crohn's Disease in Adults. Wolters Kluwer Health; Pennsylvania, United States. [internet].
  4. The Association of Physicians of India. Crohn's disease: The Indian perspective. Mumbai, India. [internet].
  5. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Crohn's Disease.

క్రోన్స్ వ్యాధి కొరకు మందులు

Medicines listed below are available for క్రోన్స్ వ్యాధి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Medicine Name

Price

₹320.0

Showing 1 to 0 of 1 entries