చక్కెర రోగుల్లో పాదాల పుండ్లు అంటే ఏమిటి?
చక్కర రోగుల్లో పాదాల పుండ్లు (diabetic foot ulcer) అనేవి ఓ సాధారణ రుగ్మతే కానీ ఇది నియంత్రణ లేని చక్కెరవ్యాధి కల్గిన రోగులకు ఓ పెద్ద సమస్యే. సాధారణంగా, గాయం లేక పుండు మానడానికి మెట్టు ప్రక్రియ (step-by-step) రీతిలో ఓ క్రమాన్ని అనుసరించి పుండు స్థానంలో కోల్పోయిన కణాంతర మాతృకను మరమత్తు చేయడం జరుగుతుంది. అయితే, కొన్ని లోపాలు ఈ సాధారణ ప్రక్రియకు అడ్డుపడి పుండును నయం చేయడాన్ని అడ్డగిస్తాయి. ఇది గాయం యొక్క సుదీర్ఘ వైద్యానికి దారితీస్తుంది. పుండు మానడంలో ఆరోగ్యకరమైన పునరుత్పత్తి కణాంకురణం (granulation) కణజాల నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికి చక్కెరవ్యాధి అడ్డుపడుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
డయాబెటిక్ పాదంలో వచ్చే పుండు ఎప్పుడూ బాధాకరంగా ఉండకపోవచ్చు. నరములు దెబ్బతినకపోతే, పుండు స్థానంలో రోగి నొప్పిని అనుభవిస్తారు. ఇది తీవ్రమైన పరిస్థితి కనుక, వెంటనే చికిత్స చేయాలి. డయాబెటిక్ పుండు మందమైన చర్మానికి సరిహద్దుతో ఎర్రటి బిలంలా ఏర్పడుతుంది. తీవ్రమైన సందర్భాల్లో, ఈ ఎరుపు చట్రంలా ఉండే పుండు కాలిలో చాలా లోతు వరకూ వ్యాపించి అక్కడి నరాలు మరియు ఎముకలను కూడా తాకుతుంది. ఈ పుండు కారణంగా వాపు కూడా కలగొచ్చు. పుండు కల్గించే మంట కారణంగా వాపు, వేడి మరియు నొప్పి కలగొచ్చు. ఈ పుండు చివరి దశల్లో, స్రావాలు, దుర్వాసన, మరియు రంగు మారిన కణాంకురణం (granulation) యొక్క కణజాలం కనిపిస్తాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఇన్సులిన్ ఉపయోగించే చక్కర రోగులకు పాదాల్లో పుండ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అధిక బరువు, పొగాకు వినియోగం మరియు మద్యపానం అనేవి డయాబెటిక్ పుండుకు గురయ్యే ప్రమాద కారకాలు. కొన్నిసార్లు, పాదంలో పుండు వచ్చిన ప్రాంతంలో స్పర్శజ్ఞానాన్ని కోల్పోవడం వలన మీరు పుండును గమనించకపోవచ్చు. పేలవమైన రక్త ప్రసరణ చికిత్సకు అడ్డు తగిలి పాదాల పుండు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది.
చక్కెరరోగుల్లో పాదంలో పుండ్లు ఒక చిన్న ప్రమాణం కల్గిన పుండుగా మొదలవుతుంది. స్పర్శజ్ఞానం లేకపోవడం వలన ఇది సాధారణంగా గుర్తించబడదు, తద్వారా లోతైన చక్కెరవ్యాధి పుండుగా ఏర్పడుతుంది. దీర్ఘకాలంపాటు చికిత్స చేయకుండా వదిలేస్తే , పుండు యొక్క అంటురోగం ఏర్పడుతుంది మరియు చీము కూడా పట్టవచ్చు. ఈ పుండు లేక కురుపు “ఆస్టియోమైఎలిటీస్” అని పిలువబడే ఎముక సంక్రమణకు దారి తీస్తుంది. చికిత్సలో మరింత ఆలస్యం ఏర్పడితే పుండు ఏర్పడిన పాదంలోని భాగం “గ్యాంగ్గ్రీన్” అనే కండరభాగాల్ని కుళ్ళుమ్పజేసే తీవ్రమైన పుండు వ్యాధికి కారణమవుతుంది, అంటే అలాంటి పరిస్థితిలో పాదం తొలగించబడాల్సి వస్తుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
సాధారణంగా, వైద్యులు గాయం పరిశీలించడం ద్వారా డయాబెటిక్ పాదం పుండును నిర్ధారిస్తారు. మీ డాక్టర్ మీ బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు మీఋ నడిచే క్రమాన్ని తనిఖీ చేస్తాడు. మీపాదంలో ఒత్తిడి పాయింట్లు, అసంకల్పతత్త్వం మరియు పాదాల స్పర్శజ్ఞానాన్ని పరీక్షించేందుకు వైద్యుడు ఈ పరీక్షలు చేస్తారు.
మీ డాక్టర్ క్రింది పరీక్షలు చేయించామని సలహా ఇవ్వవచ్చు:
- రక్త పరీక్షలు
- పుండులోని సూక్ష్మక్రిముల్ని పరీక్షించే పుండు సాగు
- ఎంఆర్ఐ (MRI) మరియు సిటి (CT) స్కాన్
- ఎక్స్-రే
రక్తంలో చక్కెర స్థాయిలను కఠినంగా నియంత్రించడం చక్కెరరోగుల పాదం పుండుని నయం చేయడంలో అనుసరించే మొట్టమొదటి చర్య. పాదం పుండు యొక్క చికిత్సలో ప్రధాన లక్ష్యం ఏమంటే సాధ్యమైనంత త్వరగా పండును మాన్పడాన్ని ప్రోత్సహించడం, తద్వారా గాయం (పుండు) సంక్రమణ అవకాశాలు తగ్గుతాయి. వివిధ పద్ధతులను ఉపయోగించి, ఈ పుండ్లపై ఒత్తిడిని తగ్గించడం మరియు చనిపోయిన కణజాలాలను తొలగించడం చేస్తారు. పుండు యొక్క సంక్రమణను నివారించడానికి పండును ఎప్పుడూ కప్పి ఉంచడం చాలా ముఖ్యం.
చక్కెర రోగుల్లో పాదాల పుండ్ల చికిత్సకు ఇతర పద్ధతులు:
- హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ
- ప్రతికూల ఒత్తిడి గాయం చికిత్స (Negative pressure wound therapy)
- పుండును శుభ్రపర్చి, ఆ భాగంలో రక్తనాళాలను పునః స్థాపించడం
- ఓజోన్ చికిత్స
- ఒత్తిడిని తగ్గించడం
- సంక్రమణను నియంత్రించడానికి యాంటీబయాటిక్స్ వంటి మందులు.