ఎంఫిసిమా అంటే ఏమిటి?
ఎంఫిసిమా ఊపిరితిత్తుల కణజాలానికి హాని కలిగించే ఒక రకమైన దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి (COPD, chronic obstructive pulmonary disease). ఎంఫిసెమా రోగులలో శ్వాసలో ఇబ్బందులకు దారితీస్తుంది అలాగే సౌకర్యవంతంగా వివిధ రోజువారీ కార్యకలాపాలు మరియు క్రీడలలో పాల్గొనకుండా నిరోధించవచ్చు. ఇది దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ మరియు నిరంతర దగ్గు వంటి ఇతర శ్వాస సంబంధిత సమస్యలతో కలిసి ఉండవచ్చు. ఎంఫిసెమాలో, ఊపిరితిత్తులలో ఉన్న ఎల్వియోలీ (వాయు కోసములు) దెబ్బతింటాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఎంఫిసెమా యొక్క ప్రధాన లక్షణాలు ఈ విధంగా ఉంటాయి :
- శ్వాస అందకపోవడం
- ఊపిరి ఆడకపోవడం
- నిరంతర దగ్గు
- అలసట
- ఛాతీ ఆకారంలో మార్పులు (ఛాతీ ఎత్తుగా మారడం)
- ఆక్సిజన్ లేకపోవడం వలన చర్మం నీలం ఛాయలోకి మారడం
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
ఎంఫిసెమా వీటి వలన కలుగుతుంది:
- గాలి ఉండే చికాకు కలిగించే పదార్దాలకు దీర్ఘకాలం పాటు బహిర్గతం కావడం
- ధూమపానం
- తీవ్రమైన గాలి కాలుష్యానికి బహిర్గతం కావడం
- అరుదుగా, ఎంఫిసెమా జన్యుపరంగా కూడా సంభవించవచ్చు.
ధూమపానం అనేది ఎంఫిసెమాకి పెద్ద ప్రమాద కారకంగా పరిగణించబడుతుంది. సిగరెట్టు పొగకు పోరోక్షంగా బహిర్గతం కావడం కూడా ఈ సమస్య ప్రమాదాన్ని పెంచుతుంది. మైనింగ్ పరిశ్రమలో పని చేసే వ్యక్తులకు ఎంఫిసెమా ఒక వృత్తిపరమైన ప్రమాదంగా ఉన్నది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఎంఫిసెమా యొక్క నిర్ధారణ ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలను కలిగి ఉంటుంది. ఈ పరీక్షలు శ్వాస రేటు (breathing rate) మరియు వ్యక్తి ఆక్సిజన్నుఎంత మొత్తంలో తీసుకుంటున్నాడని నిర్ధారించడానికి సహాయపడతాయి. ఇతర నిర్ధారణ పరీక్షలలో ఎక్స్-రే మరియు సిటి (CT) స్కాన్లు ఉన్నాయి.
ఎంఫిసెమా యొక్క నివారణ ఇంకా అందుబాటులో లేదు మరియు చికిత్సలో ఈ వ్యాధి లక్షణాలు మాత్రమే నిర్వహించబడతాయి.
ఊపిరితిత్తులలో వాపు తగ్గించడానికి వైద్యులు వాపు నిరోధక మందులను సూచించవచ్చు.
ఛాతీ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇవ్వవచ్చు.
తీవ్రమైన సందర్భాలలో ఆక్సిజన్ చికిత్స కూడా అవసరమవుతుంది.
వ్యాధి లక్షణాలను నివారించడానికి మరియు వ్యాధి మరింతగా క్షిణించకుండా నిరోధించడానికి నివారణ చర్యలు ఉన్నాయి. అవి:
- ధూమపానం మానివేయాలి
- వాయు కాలుష్యా కారకాలకు బహిర్గతం కాకుండా ఉండాలి
- శ్వాస ముసుగులు (breathing masks) ఉపయోగించాలి
- క్రమముగా వ్యాయామం చెయ్యాలి
- ఛాతీ సంక్రమణల (ఇన్ఫెక్షన్) నుండి రక్షణ పొందడానికి టీకా మందులు (vaccination) వేయించుకోవాలి