ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా అంటే ఏమిటి?
గర్భాశయం మూడు పొరలతో కూడి ఉంటుంది, అవి పెరిమెట్రియం, మాయోమెట్రియం మరియు ఎండోమెట్రియం. ఎండోమెట్రియం అనేది అండాశయాల ద్వారా విడుదలయ్యే హార్మోన్ల వలన వృద్ధి చెందే చిన్న ఎపిథీలియల్ కణాలతో తయారు చేయబడిన లోపలి పొర. ఎండోమెట్రియమే ప్రతి ఋతుచక్రంలో పెరిగి మరియు రాలిపోయి రక్తస్రావానికి కారణమవుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలలో కొన్ని మార్పులు కారణంగా, ఈ ఎండోమెట్రియం మందంగా మారిపోయి, ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా అనే సమస్యకు దారితీస్తుంది. ఇది క్యాన్సర్ కాదు, కానీ కొన్ని సందర్భాల్లో, చివరకు క్యాన్సర్కు కూడా దారితీయవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఎండోమెట్రియాల్ హైపెర్ప్లాసియా యొక్క లక్షణాలు గర్భాశయానికి మాత్రమే పరిమితం కావు; సాధారణమైన లక్షణాలను కూడా అభివృద్ధి చేస్తాయి, వాటిలో ఈ క్రిందవి ఉంటాయి:
- అసాధారణ ఋతు రక్తస్రావం (అధిక రక్తస్రావం లేదా తరచుగా ఋతు చక్రాలు సంభవించడం)
- ఋతు చక్రాల మధ్య సమయంలో రక్తస్రావం
- రుతువిరతి పొందినప్పటికీ యోని రక్తస్రావం
- అధిక రక్తస్రావం వలన రక్తహీనత
- బలహీనత
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
ఎండోమెట్రియం ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిలకు చాలా సున్నితంగా ఉంటుంది. సాధారణంగా, ఈస్ట్రోజెన్ అనేది ఎండోమెట్రియల్ గోడలని మందంగా పెరగడానికి ప్రేరేపిస్తుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, అది ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియాకు దారితీస్తుంది. ఇది స్త్రీలలో సంభవిస్తుంది
- ఊబకాయం
- హార్మోన్ ప్రత్యామ్నాయ చికిత్స యొక్క దీర్ఘకాల వాడకం (HRT,hormone replacement therapy)
- వంధ్యత్వం (infertility)
- పాలీసైస్టిక్ అండాశయ వ్యాధి (PCOD, Polycystic ovarian disease)
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్య పరీక్షలతో కూడిన ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం అనేది ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియాను తెలుపుతుంది. క్రింద పేర్కొన్న కొన్ని పరిశోధనలు ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియాను నిర్ధారించడానికి మరియు క్యాన్సర్ సంభావ్యతను తొలగించడానికి అవసరం:
- పెల్విక్ అల్ట్రాసౌండ్ (Pelvic Ultrasound) - ఎండోమెట్రియం యొక్క మందాన్ని గమనించడానికి మరియు దాని కారణం తెలుసుకోవడానికి
- ట్రాన్స్ వెజైనాల్ అల్ట్రాసౌండ్ (Transvaginal Ultrasound) - ఎండోమెట్రియంలో మార్పులను సూక్ష్మంగా విశ్లేషించడానికి
- హిస్టెరోస్కోపీ (Hysteroscopy) - ఒక ఎండోస్కోప్ ఉపయోగించి ఎండోమెట్రియంను పరిశీలించడానికి
- ఎండోమెట్రియాల్ బయాప్సీ (Endometrial Biopsy) - ఎండోమెట్రియం యొక్క చిన్న కణజాల నమూనాలను తీసి మైక్రోస్కోప్ (సూక్ష్మదర్శిని) తో పరిశీలించి రోగ నిర్ధారణ చేస్తారు మరియు ఈ నిర్ధారణ ఎండోమెట్రియాల్ క్యాన్సర్ను సంభావ్యత అనుమానాన్ని కూడా తొలగిస్తుంది
తర్వాత క్యాన్సర్కి అవకాశాలను పరిశీలించేందుకు ప్రతి 2-3 సంవత్సరాలకు సాధారణ పెల్విక్ ఆల్ట్రాసౌండ్ను నిర్వహిస్తారు.
ఎండోమెట్రియాల్ హైపర్ప్లాసియా కొరకు చికిత్స పద్ధతులు
- పరిశీలన (Observation) - ఇది చాలా సామాన్యమైన పద్ధతి, ఎందుకంటే రుతువిరతి (మెనోపాజ్) పొందిన తరువాత, ఈస్ట్రోజెన్ లేకపోవటంతో, హైపెర్ప్లాసియా మందగిస్తుంది లేదా లక్షణాలు తగ్గుతాయి.
- మందుల ద్వారా నిర్వహణ - రుతువిరతి (మెనోపాజ్) తర్వాత కూడా యోని రక్తస్రావ లక్షణాలు లేదా లక్షణాల పెరుగుదల ఉన్న స్త్రీలకు నోటి ద్వారా తీసుకునే ప్రొజెస్టెరోన్ మాత్రలతో చికిత్స చేయడం సాధారణ పద్దతి.
- శస్త్ర చికిత్స - మందుల చికిత్స చేసినప్పటికీ నిరంతర లక్షణాలు ఉన్న కొంతమంది రోగులలో, ఎండోమెట్రియుమ్ను ఎండోమెట్రియల్ అబ్లేషన్ (endometrial ablation) ద్వారా వేరు చేయబడుతుంది లేదా తీవ్రమైన కేసుల్లో అండాశయాలతో సహా మొత్తం గర్భాశయం తొలగించబడుతుంది