కాలేయ పెరుగుదల అంటే ఏమిటి?
ఒక సాధారణ వైరల్ సంక్రమణం (ఇన్ఫెక్షన్) నుంచి గుండె వైఫల్యం వంటి తీవ్రమైన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వంటి ఏవైనా కారణాల వలన కాలేయం పరిమాణం పెరిగినప్పుడు కాలేయ పెరుగుదల లేదా హెపాటోమెగాలి (hepatomegaly) సంభవిస్తుంది. సాధారణంగా, అంతర్లీన కారాణానికి చికిత్స చేస్తే హెపాటోమెగాలి నయం కావచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చాలా సందర్భాలలో, కాలేయ పెరుగుదల ఏ లక్షణములను చూపించదు, కాని అంతర్లీన వ్యాధి కారణంగా లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని లక్షణాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి:
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
కాలేయం వివిధ శరీర విధుల కొరకు కేంద్రంగా ఉంటుంది కాబట్టి, ఈ విధులలోని ఏ విధమైన మార్పులకైనా అనేక వ్యాధి లక్షణాలు కారణమవుతాయి, అది కాలేయ పెరుగుదలకు దారితీస్తుంది.
హెపాటోమెగాలి యొక్క సాధారణ కారణాలు
- కాలేయ వ్యాధులు
- అమీబియా కురుపులు - ఇ. హిస్టోలిటికా (E. histolytica) సంక్రమణ (ఇన్ఫెక్షన్) వలన కాలేయంలో ఒక చీము నిండిన కురుపులు ఏర్పడటం
- హెపటైటిస్ (కాలేయవాపు)
- సిర్రోసిస్
- ఫ్యాటి లివర్
- హీమోక్రోమోటోసిస్ (Haemochromatosis) - శరీరంలో అధికంగా ఐరన్ నిక్షేపణ (చేరిపోవడం)
- కాలేయ తిత్తులు (Liver cysts)
- కాలేయ హేమాంజియోమాలు (Haemangiomas of the liver) - కాలేయ రక్తనాళాల యొక్క వైకల్యం
- పిత్తాశయంలో నిరోధాలు
- అమైలలోయిడోసిస్ (Amyloidosis)
- విల్సన్స్ వ్యాధి (Wilson’s disease) - శరీరంలో అధిక కాపర్ నిక్షేపణ (చేరిపోవడం)
- ఇతర వ్యాధులు
- కాలేయ క్యాన్సర్
- లింఫోమా
- ల్యుకేమియా
- గుండె వైఫల్యం
- పెరికార్డియిటిస్
- మలేరియా మరియు టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
క్రింద పేర్కొన్న కొన్ని పరిశోధనలు వ్యాధికి సంబంధించిన కారణాన్ని నిర్ణయించడానికి అవసరం.
- రక్త పరీక్షలు
- పూర్తి రక్త గణన (CBC, Complete blood count)
- కాలేయ పనితీరు పరీక్షలు (Liver function test)
- సీరం ప్రోటీన్ స్థాయిలు (Serum protein levels)
- హెపటైటిస్ A, B, C, D, మరియు E యాంటిజెన్/యాంటీబాడీ స్థాయిలు
- ప్రబింబన అధ్యయనాలు (Imaging Studies)
- ఉదరం యొక్క సోనోగ్రఫీ (Sonography)
- కడుపు యొక్క కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్
- మాగ్నెటిక్ రెసోనాన్స్ ఇమేజింగ్ (MRI) స్కాన్
-
కాలేయ జీవాణుపరీక్ష (లివర్ బయాప్సీ) - ఇది కాలేయ కణాల (హెపాటోసైట్లు) అంతర్గత నిర్మాణం తెలుసుకోవడం కోసం మరియు రోగనిర్ధారణని ధృవీకరిస్తుంది
హెపాటోమెగాలి చికిత్స పూర్తిగా కాలేయ పెరుగుదల యొక్క కారణం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వ్యాధి సంక్రమణ (ఇన్ఫెక్షన్) వలన ఐతే, యాంటీబయాటిక్స్ సూచించబడవచ్చు; గుండె సమస్యల వలన ఐతే, అంతర్లీన సమస్యకి చికిత్స అవసరం; కొన్నిసార్లు అది పూర్తిగా దానికదే నయం చేసుకోవచ్చు లేదా కేవలం సహాయక ఎంజైములు (supportive enzymes) మాత్రమే అవసరం కావచ్చు. కాలేయం పెరగడం అనేది క్యాన్సర్ కారణంగా ఐతే శస్త్రచికిత్స లేదా కీమో-రేడియేషన్ థెరపీ అవసరం కావచ్చు.