యాంటీ డైయూరేటిక్ హార్మోన్ సరిగ్గా స్రావించకపోవడం అంటే ఏమిటి?
యాంటీ డైయూరేటిక్ హార్మోన్ (ADH) అనేది హైపోథాలమస్ (మెదడులో ఒక చిన్న భాగం) ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది మరియు పిట్యూటరీ గ్రంధి (మెదడు యొక్క అంచు వద్ద ఉంటుంది) ద్వారా విడుదల చేయబడుతుంది. మూత్రపిండాల ద్వారా విసర్జించబడే మూత్రంలోని నీటి శాతాన్ని నియంత్రించడంలో యాంటీ డైయూరేటిక్ హార్మోన్ (ADH) సహాయపడుతుంది. యాంటీ డైయూరేటిక్ హార్మోన్ సరిగ్గా స్రావించకపోవడం (SIADH) అనేది ఒక రుగ్మత, ఇందులో శరీరం అధిక స్థాయిలో యాంటీ డైయూరేటిక్ హార్మోన్ను (ADH) స్రవిస్తుంది. ఈ రుగ్మత శరీరంలో నీరు అధికంగా నిలిచిపోవడానికి దారితీస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
యాంటీ డైయూరేటిక్ హార్మోన్ సరిగ్గా స్రావించకపోవడం యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- తలనొప్పి
- వికారం
- వాంతులు
- మానసిక మార్పులు వీటిని కలిగి ఉంటాయి
- గందరగోళం
- జ్ఞాపక శక్తిలో సమస్యలు (మరింత సమాచారం: జ్ఞాపక శక్తి తగ్గుదల చికిత్స)
- శరీరాన్ని సంతులనం (బ్యాలన్స్) చేసుకోవడంలో సమస్యలు అవి జారీ/కింద పడిపోవడానికి దారితీస్తాయి
- తీవ్ర సందర్భాల్లో, ఇది మూర్ఛ లేదా కోమాకు కూడా దారితీస్తుంది
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
శరీరంలో యాంటీ డైయూరేటిక్ హార్మోన్ (ADH) స్థాయిలను పెంచే కారకాలు యాంటీ డైయూరేటిక్ హార్మోన్ సరిగ్గా స్రావించకపోవడానికి కూడా దారి తీయవచ్చు, అవి:
- కొన్ని రకాల మందులు, వీటిలో ఈ మందులు ఉంటాయి:
- హార్మోన్ల మందులు (వాసోప్రెసిన్ లేదా ADH).
- టైప్ 2 డయాబెటిస్
- మూర్ఛ
- యాంటిడిప్రేస్సంట్లు
- రక్తపోటు లేదా గుండె జబ్బులకు సంబంధించినవి
- క్యాన్సర్
- అనస్థీషియా (మత్తు మందులు) లేదా జనరల్ అనస్థీషియా (సాధారణ మత్తు) ఉపయోగించి శస్త్రచికిత్స చేయడం
- మెదడు రుగ్మతలు:
- స్ట్రోక్
- గాయం
- అంటువ్యాధులు/సంక్రమణలు
- ఊపిరితిత్తుల వ్యాధులు, వీటిలో:
- దీర్ఘకాలిక అంటువ్యాధులు/ఇన్ఫెక్షన్లు/సంక్రమణలు
- క్షయ వ్యాధి
- న్యుమోనియా
- క్యాన్సర్
- మానసిక రుగ్మతలు
- హైపోథాలమస్ లేదా పిట్యూటరీ గ్రంధులలో లోపాలు
- ఈ క్రింది అవయవాలు / శరీర భాగాల యొక్క క్యాన్సర్:
- ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్)
- క్లోమం (Pancreas)
- చిన్న ప్రేగు
- మెదడు
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు రోగి లక్షణాల యొక్క కారణాన్ని తెలుసుకోవడానికి పూర్తి శారీరక పరీక్షను నిర్వహిస్తారు, దాని తరువాత కొన్ని పరీక్షలు జరుగుతాయి, అవి:
- రక్తం మరియు మూత్రంలోని సోడియం స్థాయిని కొలవడం కోసం పరీక్షలు
- రక్తం మరియు మూత్రం యొక్క ఓస్మోలాలిటీ (osmolality) అంచనా కోసం పరీక్షలు
- కంప్రెహెన్సివ్ మెటబోలిక్ ప్యానెల్ (Comprehensive metabolic panel, మూత్రపిండాలు మరియు కాలేయ పనితీరు పరీక్షలు, యాసిడ్/బేస్ బ్యాలన్స్, ఎలెక్ట్రోలైట్స్ మరియు రక్తంలో చక్కెరను పరీక్షించడం)
యాంటీ డైయూరేటిక్ హార్మోన్ సరిగ్గా స్రావించకపోవడం యొక్క కారణం మీద ఆధారపడి చికిత్స ఉంటుంది:
- ద్రవాలను తీసుకోవడం పరిమితం చెయ్యడం. వ్యక్తి/రోగి తీసుకునే ద్రవ పరిమాణాన్ని వైద్యులు నిర్ణయిస్తారు.
- మూత్రపిండాల మీద యాంటీ డైయూరేటిక్ హార్మోన్ (ADH) యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) లేదా ఇంట్రావీనస్ (నరాలలోకి) మందులు సూచించబడవచ్చు. ఇవి మూత్రపిండాలు నీరును అధికంగా విసర్జించేలా సహాయం చేస్తాయి.
- రుగ్మత యొక్క మూల కారణానికి చికిత్స ఈ క్రింది విధంగా ఉంటుంది:
- కణితి కారణం ఐతే, దానికి శస్త్రచికిత్స.
- మందుల మోతాదును మార్చడం లేదా ADH యొక్క అసాధారణ ఉత్పత్తికి కారణమయ్యే మందులను మార్చడం.