మెలనిన్ లోపం అంటే ఏమిటి?
చర్మం ఉండే మెలనోసైట్లు (melanocytes) అని పిలవబడే ప్రత్యేక కణాలు మెలనిన్ (melanin) ను ఉత్పత్తి చేస్తాయి, ఈ మెలనిన్ చర్మ రంగుకు బాధ్యత వహిస్తుంది. ఈ కణాలకు ఏదైనా గాయం జరిగితే అది మెలనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. కొన్ని రుగ్మతలు శరీరంలోని ఒక భాగాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయి, కొన్ని మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. అధిక మెలనిన్ చర్మాన్ని ముదురు రంగులో మారుస్తుంది, అయితే తక్కువ మెలనిన్ చర్మాన్ని లేత రంగులోకి మారుస్తుంది. మెలనిన్ యొక్క స్థాయి దాని నిర్దిష్ట స్థాయి కంటే తగ్గిపోయినప్పుడు, అది బొల్లి (vitiligo) , దీని వలన చర్మంపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి, అల్బునిజం లేదా చర్మపు రంగును ప్రభావితం చేసే ఇతర సమస్యలు వంటి వ్యాధులకు దారి తీస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మెలనిన్ లోపం అనేది ఈ క్రింది సంకేతాలు మరియు లక్షణాలను చూపించే వివిధ వ్యాధుల రూపంలో ఉంటుంది:
- చాలా చిన్న వయస్సులోనే జుట్టు, గడ్డం, మీసం, కనుబొమ్మలు మరియు కనురెప్ప వెంట్రుకలు నెరవడం
- నోటిలో చర్మం యొక్క రంగు తగ్గిపోవడం
- చర్మం యొక్క రంగు మారిపోవడం (Depigmentation)
- చర్మంలో ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాగాల డిపిగ్మెంటేషన్ (రంగు మారిపోవడం)
- శరీరంలో ఒక వైపున మాత్రమే ప్రభావితం చేసే డిపిగ్మెంటేషన్
- మొత్తం శరీరాన్ని ప్రభావితం చేసే డిపిగ్మెంటేషన్
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మెలనిన్ లోపం అనేది మెలనోసైట్లను ప్రభావితం చేసే మరియు తద్వారా మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితంచేసే ఏదైనా అంతర్లీన కారణం వలన కావచ్చు. ఈ క్రింద ఉన్న కొన్ని కారణాలు మెలనిన్ లోపానికి దారితీస్తాయి:
- మెలనిన్ యొక్క పాక్షిక లేదా పూర్తిగా లోపానికి దారితీసే వంశపారంపర్య సంక్రమిత లోపం (Inherited deficiency), ఉదా. ఆల్బినిజం
- స్వయం ప్రతిరక్షక రుగ్మత (ఆటోఇమ్మ్యూన్ డిసార్డర్) కారణంగా శరీరంలోని కొన్ని లేదా అన్ని ప్రాంతాలలో మెలనోసైట్ల యొక్క నష్టం, ఉదాహరణకు, బొల్లి
- చర్మ గాయాలు పుండు, కాలిన గాయం, బొబ్బలు, సంక్రమణం/ఇన్ఫెక్షన్ మొదలైనవి. చర్మ కణాల యొక్క శాశ్వత నష్టానికి దారి తీసి మరియు దెబ్బతిన్న చర్మంలోని మెలనిన్ భర్తీ కాదు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగ నిర్ధారణ ఈ కింది వాటిపై ఆధారపడి ఉంటుంది:
- వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర
- తెలుపు మచ్చల తనిఖీ కోసం శారీరక పరీక్ష
- మధుమేహం లేదా థైరాయిడ్ సమస్యల ఉనికిని గుర్తించడానికి రక్త పరీక్షలు
- ప్రభావిత చర్మం యొక్క జీవాణుపరీక్ష (బయాప్సీ)
చికిత్స మెలనిన్ లోపం యొక్క కారణం మీద ఆధారపడి ఉంటుంది. వైద్యులు ఈ క్రింది వాటిని సిఫార్సు చేయవచ్చు:
- కార్టికోస్టెరాయిడ్ క్రీమ్లు
- నారో-బ్యాండ్ అల్ట్రా వయొలెట్ B చికిత్స (Narrow-band ultraviolet B therapy)
- ఫోటోకీమోథెరపీ (Photochemotherapy)
- లేజర్ చికిత్స
కొన్ని సమర్థవంతమైన గృహ చిట్కాలు:
- సన్ స్క్రీన్లు
- కాన్సిలర్ (concealer) వంటి సౌందర్య సాధనాలు (Cosmetics)