మీనియర్స్ వ్యాధి అంటే ఏమిటి?
మీనియర్స్ వ్యాధి అనేది మూడు రకాల లక్షణాలను చూపే ఒక వ్యాధి ఇది అంతర్గత/లోపల చెవిలో మార్పులు కారణంగా సంతులనం మరియు వినికిడి లోపానికి దారితీస్తుంది, ఎందుకంటే ఈ రెండు చర్యలను మానవ శరీరంలోని లోపలి చెవి నియంత్రిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మీనియర్స్ యొక్క సాధారణ లక్షణాలు మరియు సంకేతాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- తిరుగుతున్న భావన (Spinning sensation) లేదా వెర్టిగో (vertigo)
- టిన్నీటస్ అని పిలవబడే చెవిలో ఒక పదునైన రింగుమనే శబ్దం
- ఆకస్మిక వినికిడి నష్టం/లోపం
- చెవి లోపల ఒత్తిడిని అనుభవించడం
- వికారం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఖచ్చితమైన కారణం ఇంకా గుర్తించబడలేదు; ఏమైనప్పటికీ, వివిధ కారణాల యొక్క కలయిక మీనియర్స్ వ్యాధికి దారితీయవచ్చు.
మీనియర్స్ వ్యాధి యొక్క కొన్ని కారణాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- చెవిలోని ద్రవాలలో రసాయనాల యొక్క అసమతుల్యత (Chemical imbalance)
- సంతులనం మరియు వినికిడిని ప్రభావితం చేసే చెవిలోని ద్రవం యొక్క నిర్మాణం లేదా చేరిక
- సుదీర్ఘకాలం పాటు చాలా పెద్ద శబ్దాలకు బహిర్గతం/గురికావడం
- వారసత్వంగా ఉండవచ్చు
- అనియంత్రకమైన, అధిక ఉప్పు ఆహారం ఉన్న ఆహరం తీసుకోవడం
- అలర్జీలు
- తలకు గాయం
- వైరల్ సంక్రమణ/ఇన్ఫెక్షన్
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వ్యక్తి ఈ సమస్య నుండి బాధపడుతుంటే, వినికిడి మరియు సంతులనం పరీక్షలు విడివిడిగా నిర్వహించబడతాయి.
వినికిడి పరీక్షలు (Hearing tests) - ఆడిటోమెట్రీ (Audiometry) లేదా వినికిడి పరీక్షలు వినికిడి యొక్క నష్టాన్ని నిర్ణయించటానికి చేయవచ్చు. వ్యక్తి ఒకటి లేదా రెండు చెవులలో వినికిడి లోపం ఉందా అని తెలుసుకునేందుకు సహాయపడుతుంది. అదనంగా, అంతర్గత/లోపలి చెవిలో ఎలక్ట్రికల్ చర్యలను (electrical activity) కొలవడానికి ఒక ఎలెక్ట్రోకోక్లియోగ్రఫీ (ECoG, electrocochleography)ని నిర్వహిస్తారు. వినికిడి నరములు (hearing nerves) మరియు మెదడు యొక్క వినికిడి కేంద్రం (hearing centre of the brain) యొక్క పనితీరును తనిఖీ చేయటానికి ఒక ఆడిటరీ బ్రెయిన్స్టెమ్ రెస్పాన్స్ (auditory brainstem response) ను కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షలు సమస్య లోపలి చెవిలో లేదా చెవి నరాలతో ఉన్నదా అని నిర్ణయిస్తాయి.
సంతులన పరీక్షలు (Balance tests) - మీనియర్స్ వ్యాధి తనిఖీ కోసం నిర్వహించే అత్యంత సాధారణ బ్యాలెన్స్ పరీక్ష ఎలక్ట్రానిస్టాగ్మోగ్రఫీ (ENG, electronystagmography).
మీనియర్స్ వ్యాధి కోసం ఖచ్చితమైన చికిత్స లేదు, కానీ కొన్ని మందులు వెర్టిగో, వికారం మరియు టిన్నిటస్ లక్షణాలు తగ్గించడంలో సహాయపడతాయి. వెర్టిగో వంటి సమస్యలలో శరీరంలో అదనపు ద్రవం చేరికను పరిమితం చేయడానికి మరియు తగ్గించడానికి డైయూరేటిక్ (diuretic) మందులు సూచించబడతాయి. పరిస్థితి యొక్క తీవ్రత ఆధారంగా శస్త్రచికిత్స మరియు హియరింగ్ ఎయిడ్స్ (hearing aids) మీనియర్స్ వ్యాధి యొక్క చికిత్స కోసం సూచించబడవచ్చు.
మీనియర్స్ వ్యాధిని నివారించడానికి కొన్ని ముందు జాగ్రత్తలు కూడా సూచించబడ్డాయి. అవి:
- పొగ త్రాగరాదు
- ఆహారంలో ఉప్పు తగ్గించడం
- మద్యం మరియు కెఫిన్ నివారించడం