మెటబోలిక్ సిండ్రోమ్ - Metabolic Syndrome in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

January 03, 2019

March 06, 2020

మెటబోలిక్ సిండ్రోమ్
మెటబోలిక్ సిండ్రోమ్

మెటబోలిక్  సిండ్రోమ్ అంటే ఏమిటి?

సిండ్రోమ్ అనేది ఆరోగ్య సమస్యల మరియు లక్షణాల యొక్క కూడిక, మరియు ఇది ఒక నిర్దిష్ట వ్యాధిని లేదా సమస్యను సూచిస్తుంది. మెటబోలిక్  సిండ్రోమ్ అనే పరిస్థితిలో అధిక రక్తపోటు, అధిక ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, మధుమేహం మరియు ఊబకాయం కలిపి సంభవిస్తాయి, తద్వారా గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మెటబోలిక్ సిండ్రోమ్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఒక నిర్దిష్టమైనవిగా మరియు ఖచ్చితమైనవిగా ఉండవు. మెటబోలిక్ సిండ్రోమ్ తో బాధపడే వ్యక్తికి ఉండే అత్యంత ముఖ్యమైన మరియు సాధారణ సంకేతాలు:

  • ఎక్కువ కాలం పాటు రక్తపోటు పెరిగి ఉండడం
  • వ్యక్తి నడుము యొక్క చుట్టు కొలత పెరగడం
  • మధుమేహం మరియు ఇన్సులిన్ నిరోధకత వంటి సంకేతాలు వాటిలో పునరావృతమయ్యే  అంటువ్యాధులు, దాహం మరియు ఆకలి పెరగడం, బరువు పెరుగుట, మూత్రవిసర్జన పెరగడం మరియు మొదలైనటువంటివి ఉంటాయి .   

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మెటబోలిక్  సిండ్రోమ్ యొక్క ప్రధాన కారణం ఊబకాయం మరియు శారీరక శ్రమ లేకపోవడం. మెటబోలిక్  సిండ్రోమ్కు దారితీసే ఇతర కారణాలు క్రింది విధంగా ఉంటాయి:

  • అధిక రక్త పోటు
  • ఇన్సులిన్ నిరోధకత (Insulin resistance) ఇది వంశపారంపర్యంగా సంభవించినప్పుడు మరియు టైప్ 2 మధుమేహం యొక్క ప్రధాన కారణం
  • మధుమేహం లేదా గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు అభివృద్ధి చెందినప్పుడు మెటబోలిక్ సిండ్రోమ్ స్త్రీలలో కూడా సంభవించవచ్చు

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఒక వ్యక్తిలో ఈ క్రింది సంకేతాలు కనిపించినప్పుడు మెటబోలిక్  సిండ్రోమ్ యొక్క నిర్ధారణ అవసరం అవుతుంది:

  • రక్తంలో కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉండడం - కొలెస్ట్రాల్ స్థాయిని గుర్తించేందుకు  రక్త పరీక్షలు నిర్వహిస్తారు.
  • అధిక రక్తపోటు - రక్తపోటు నిరంతరంగా  140/90 mm Hg లేదా అంతకన్నా ఎక్కువగా ఉండడమనేది  మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది.
  • ఊబకాయం - పురుషులలో 94 సెం.మీ. లేదా అంతకంటే ఎక్కువ మరియు మహిళల్లో 80 సెం.మీ. లేదా అంతకంటే ఎక్కువ నడుము చుట్టు కొలత ఉన్నట్లయితే అది అసాధారణ మెటబోలిజంను  (జీవక్రియను) సూచిస్తుంది.
  • రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు.

మెటబోలిక్  సిండ్రోమ్ యొక్క లక్షణాలన్ని నియంత్రించడానికి ప్రజలు కొని అలవాట్లను మరియు జీవనశైలి మార్పులను చేసుకోవాలి. వాటిలో కొన్ని:

  • ధూమపానం మానివేయాలి - ధూమపానం హృదయ సంభందిత వ్యాధుల, స్ట్రోక్, క్యాన్సర్ మరియు ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
  • నియంత్రిత ఆహారం - ఆహారాన్ని నియంత్రణలో ఉంచాలి అతిగా తినకూడదు మరియు ఊబకాయాన్ని తగ్గించాలి.
  • శారీరక శ్రమను పెంచాలి - చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు ఊబకాయం, అధిక రక్తపోటు మరియు అనేక ఇతర ప్రాణాంతక పరిస్థితులను నివారించేందుకు కీలకమైనవి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక ట్రైగ్లిజెరైడ్స్ అలాగే ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడానికి బరువు తగ్గడం చాలా ముఖ్యం.

ఈ పరిస్థితుల చికిత్స నివారణ కోసం తీసుకున్న చర్యల వలె ఉంటుంది. అదనంగా, ఈ పరిస్థితిని నిర్వహించటానికి కొన్ని మందులు కూడా ప్రెవేశపెట్టబడతాయి, ఇవి మెటబోలిక్  సిండ్రోమ్ యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో అధిక చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ షాట్లు (Insulin shots) సూచించబడవచ్చు. రక్తపోటు తగ్గించేందుకు రక్తపోటును తగ్గించే మందులు సూచించబడతాయి.



వనరులు

  1. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Metabolic syndrome.
  2. American Heart Association, American Stroke Association [internet]: Texas, USA AHA: About Metabolic Syndrome
  3. National Health Service [Internet]. UK; Metabolic syndrome.
  4. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Metabolic Syndrome.
  5. Kaur J. A comprehensive review on metabolic syndrome. Cardiol Res Pract. 2014;2014:943162. PMID: 24711954

మెటబోలిక్ సిండ్రోమ్ వైద్యులు

Dr. Narayanan N K Dr. Narayanan N K Endocrinology
16 Years of Experience
Dr. Tanmay Bharani Dr. Tanmay Bharani Endocrinology
15 Years of Experience
Dr. Sunil Kumar Mishra Dr. Sunil Kumar Mishra Endocrinology
23 Years of Experience
Dr. Parjeet Kaur Dr. Parjeet Kaur Endocrinology
19 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

మెటబోలిక్ సిండ్రోమ్ కొరకు మందులు

Medicines listed below are available for మెటబోలిక్ సిండ్రోమ్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.