లావుపాటి (ఊబకాయం) అంటే ఏమిటి?
లావుపాటి: ఈ పరిస్థితి గురించి మనము విన్న వెంటనే మన మనస్సులోనికి వచ్చే మొదటి విషయం ఒక “లావుపాటి వ్యక్తి”, రెండు గడ్డాలతో, కేలరీలతో నిండి ఉండడం, బహుశా కొన్ని భౌతికమైన కార్యక్రమాలను చేసే సామర్థ్యము కలిగిఉండక పోవడం. ఇవి మనకు వెంటనే వచ్చే ఆలోచనాలా? అవును, లావు అనగా అధికబరువు కలిగి ఉండడం, అయితే మనం అందరూ అవగాహన చేసుకోవాల్సిన విషయం ఇది ఒక వైద్య పరిస్థితి, ఇది శరీరము యొక్క వివిధ భాగాలలో అసాధారణమైన శరీర క్రొవ్వు చేరి ఉండడం, దీని ఫలితముగా అదనపు శరీర బరువు ఏర్పడుతుంది, ఇది మొత్తం ఆరోగ్యము పైన చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
ఒక వ్యక్తి అధిక బరువు లేక లావు కలిగియున్నాడని ఏ విధముగా నిర్ధారిస్తారు? దీనికి సమాధానం బాడీ మాస్ ఇండెక్స్ (BMI). బిఎమ్ఐ అనునది మీ యొక్క ఎత్తు మరియు బరువు నుండి ఉత్పన్నం చేయబడిన ఒక గణాంక ప్రమాణము. బిఎమ్ఐ ప్రమాణము అనునది ఒక వ్యక్తి యొక్క ఊబకాయమును లెక్కించడం కొరకు ఒక ఉపయోగకరమైన సూచిక. ఒక వ్యక్తి ఊబకాయమును కలిగియున్నాడని ఏ విధముగా సూచిస్తారంటే, ఆ వ్యక్తి యొక్క శరీర బరువు ఉండవలసిన దానికంటే 20% శాతం అధికముగా ఉన్నచో, అప్పుడు అతడు లేక ఆమె ఊబకాయం కలిగిన వ్యక్తిగా పరిగణించబడతాడు. మీ యొక్క బిఎమ్ఐ ఒకవేళ 25 మరియు 29.9 మధ్య ఉంటే మీరు అధికబరువు గల వ్యక్తిగా పరిగణింపబడతారు. ఒకవేళ మీ యొక్క బిఎమ్ఐ 30 లేక అంతకు మించి ఉంటే మీరు ఊబకాయం కలిగిఉంటారు.
ఒకవేళ మీ యొక్క బిఎమ్ఐ 25 కంటే ఎక్కువగా ఉంటే, అప్పుడు మీరు బరువు తగ్గే కార్యక్రమాలు చేయాలి మరియు ఒకవేళ మీ యొక్క బిఎమ్ఐ 30 కంటే ఎక్కువగా ఉంటే, అప్పుడు మీరు బరువు తగ్గడము కొరకు డాక్టరు నుండి సీరియస్ గా సలహాలను తీసుకోవాలి. ఇది ప్రాముఖ్యమైనది ఎందుకనగా ఊబకాయం అనునది అనేక వైద్య పరిస్థితులు అనగా మధుమేహం, హృదయ ధమని వ్యాధి, హైపర్ టెన్షన్, ప్రతిబంధక నిద్ర రుగ్మతలు, కీళ్ల ఎముకల నొప్పులు మొ. వంటి అనేక వైద్య పరిస్థితులు ఏర్పడటానికి లేక పెరగడానికి సాధ్యపడుతుంది. ఈ పరిస్థితితో వ్యవహరించవలసిన మొదటి అడుగు ఏమనగా మీ యొక్క ఊబకాయానికి మూలకారణం కనుగొనడం. ఒక వ్యక్తి తన యొక్క రోజువారీ జీవనశైలిని పరిశీలించడం ద్వారా దీనిని చేయాలి లేక మీ డాక్టరును సంప్రదించాలి లేక ఒక న్యూట్రిషనిస్టును సంప్రదించాలి.
మీకు తెలుసా?
మీ నడుము యొక్క చుట్టుకొలత అనునది మీ ఆరోగ్యమును నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన కారకము. మీ ఆరోగ్యం ప్రమాదములో ఉంటుంది, ఒకవేళ: మీరు ఒక పురుషుడు మరియు మీ యొక్క నడుము చుట్టుకొలత ప్రమాణము అనునది 94 సెంటిమీటర్లు (37ఇంచులు) లేక అంతకంటే ఎక్కువగా ఉంటే మరియు మీరు ఒక స్త్రీ మరియు మీ యొక్క నడుము చుట్టుకొలత ప్రమాణము అనునది 80 సెంటిమీటర్లు (31.5 ఇంచులు) లేక అంతకంటే ఎక్కువగా ఉంటే మీ ఆరోగ్యం ప్రమాదములో ఉంటుంది.
ఊబకాయం గల వారుగా మీరు చాలా అసౌకర్యానికి గురవుతారు మరియు మీ రోజువారీ జీవితాలలో అవాంతరాలను తెచ్చుకుంటారు. మీకు ఊపిరి తీసుకోవడం కష్టముగా ఉంటుంది మరియు నడవడం కూడా మీకు ఒక్కోసారి కష్టముగా ఉంటుంది లేక బౌతికముగా యాక్టివ్ గా ఉండడం కూడా కష్టముగా ఉంటుంది. మీ శరీర రకానికి సరిపోయే సౌకర్యవంతమైన దుస్తులు కనుగొనడం కష్టముగా ఉంటుంది. ఊబకాయం గలవారు కనీసం కొంచెం పని చేసిన తరువాత ఎక్కువగా చెమటను కలిగిఉంటారు. అదనముగా, ఒకవేళ మీరు ఊబకాయిలైతే, మీ యొక్క భావోద్వేగాల పైన కూడా ప్రభావితం చేస్తుంది. మీ యొక్క ఆత్మగౌరవం మరియు నమ్మకం తక్కువగా ఉంటుంది. మరియు కొంతమంది ఊబకాయమును నెగటివ్ గా చూపిస్తున్నారు కాబట్టి మీరు తిరస్కారము, తప్పు, సిగ్గు పడడము మరియు దిగజారిపోవడం వంటి అనేక వాటిని అనుభవిస్తారు. అన్ని సామాజిక నిందలను అధిగమించే క్రమములో, దీని యొక్క కారణాల గురించి మనము తెలుసుకోవాలి మరియు తరువాతి సెక్షన్ లో నివారణము చేపట్టాలి, అందువలన మీరు మీ యొక్క పరిస్థితి నుండి బయటకు వస్తారు మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తారు.