టినియా వెర్సికోలర్ అంటే ఏమిటి?
‘మలాసెజియా’ అనబడే బూజు (fungus) చర్మం ఉపరితలంపై సాధారణంగా కనిపిస్తుంటుంది. ఈ మలాసెజియా బూజు చర్మంపై నియంత్రణను మించి పెరిగి చర్మాన్ని బాధిస్తుంది, ఈ రుగ్మత స్థితినే “టినియా వెర్సికోలర్” చర్మరోగంగా పిలుస్తారు. టినియా వెర్సికోలర్ “పిటియారిస్ వర్సికోలర్” గా కూడా పిలవబడుతుంది. ఈ చర్మ రుగ్మతలో మెడ, ఛాతీ, వీపుపైన మరియు చేతులపై చర్మం మీద తేలికైన లేదా ముదురు రంగు మచ్చలు (ప్యాచులు) కనిపిస్తాయి. ఈ చర్మ రుగ్మత హానిరహితమైనదే కానీ దీన్ని నియంత్రించడానికి మరియు పూర్తిగా నయం చేయడానికి మందులు అవసరం అవుతాయి.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
టినియా వెర్సికోలర్ను చర్మవ్యాధి యూనివల్ల కలిగే అత్యంత నిశ్చయాత్మకమైన మరియు గట్టి సంకేతాలు ఏవంటే చర్మంపై రంగు పాలిపోయిన మచ్చలు కనిపించడం. ఈ మచ్చలు (పాచెస్) చర్మం రంగు కంటే కొంత తేలికైన రంగులో ఉంటాయి, అయితే చర్మంరంగుకన్నా ముదురు రంగులోను, పింక్, ఎరుపు లేదా గోధుమ రంగులో కూడా ఈ మచ్చలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, చర్మంపై వచ్చే మచ్చలు (ప్యాచ్లు) పొడిగా మరియు పొలుసులు లేసి ఉంటాయి, ఫలితంగా దురద పుడుతుంది. ఈ చర్మ సంక్రమణ సాధారణంగా చంకల్లో, బాహుమూలాల్లో, రొమ్ముల కింద, కడుపు మీది చర్మం మడతల్లో, లోపలి తొడ, మెడ మరియు వీపు వంటి చమట పుట్టే భాగాల్లో వస్తుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
టినియా వెర్సికోలర్ చర్మరోగం అభివృద్ధి చెందేందుకు ముఖ్య కారణాలు వ్యక్తి నివాసముండే ప్రాంతము చుట్టూ ఉండే వాతావరణానికి సంబంధించిన పర్యావరణ స్థితి మరియు జీవసంబంధమైన కారకాలు. అధికమైన చెమటకు కారణమయ్యే వేడి లేదా వెచ్చని వాతావరణం ఈ రుగ్మతకు కారణం కాగలదు. టినియా వెర్సికోలర్ యొక్క ఇతర కారణాలు:
- టినియా వర్సికోలర్ యొక్క కుటుంబ చరిత్ర.
- రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే మాదకద్రవ్యాల దుర్వినియోగం.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
చర్మవ్యాధి సోకిన భాగం యొక్క శారీరక పరీక్ష పరిస్థితి నిర్ధారణకు సహాయపడుతుంది; అయినప్పటికీ, చాలా అరుదుగా, నిశ్చయాత్మక రోగ నిర్ధారణ కొరకు వైద్యుడు అనేక పరీక్షలను చేయించమని ఆదేశించవచ్చు:
- బూజు (ఫంగల్) పెరుగుదలను కనుక్కోవడానికి ‘స్కిన్ స్క్రాపింగ్ మరియు టెస్టింగ్’ పరీక్ష.
- వుడ్ లాంప్ పరీక్ష వంటి శిలీంధ్ర పెరుగుదలను నిర్ణయించడానికి ల్యాబ్ పరీక్షలు.
ఈ రుగ్మతను అరికట్టడానికి మరియు నయం చేయడానికి, వైద్యుడు యాంటీ-ఫంగల్ మాత్రలు, యాంటీ ఫంగల్ ఔషదం మరియు యాంటీ ఫంగల్ షాంపూ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను సూచించవచ్చు. సాధారణంగా ఈ ఉత్పత్తులలో కేటోకోనజోల్, పెర్మథ్రిన్ (ketoconazole, permethrin ) మరియు ఇతరమందులు ఉంటాయి. వదులుగా ఉండే పత్తినూలు దుస్తులను ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రతను నిర్వహించడం, సబ్బుతో రోజుకు రెండుసార్లు స్నానం చేయడం మరియు చర్మాన్ని పొడిగా ఉంచడం వంటి చర్యలు రుగ్మతను త్వరితంగా నివారించడానికి మరియు వ్యాధి పునరావృతను నివారించడానికి ముఖ్యమైన చర్యలు.