టోక్సోప్లాస్మోసిస్ అంటే ఏమిటి?
టోక్సోప్లాస్మోసిస్ అనేది టోక్సోప్లాస్మా గోండి అని పిలవబడే ఒక పరాన్నజీవి యొక్క సంక్రమణం. ఈ పరాన్నజీవి పలు జంతువులలో మరియు పక్షులలో, ముఖ్యంగా పిల్లులలో ఎక్కువగా కనబడుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ సంక్రమణ ఏటువంటి లక్షణాలను కలిగించకుండా ఉండవచ్చు. అయినప్పటికీ, లక్షణాలు ఏర్పడితే, అవి వ్యక్తి యొక్క రోగనిరోధక ప్రతిస్పందన మీద ఆధారపడి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికీ మారుతూ ఉంటాయి. బలమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులలో ఈ క్రింది లక్షణాలను గమనించవచ్చు:
బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులలో ఈ క్రింది లక్షణాలు కలుగవచ్చు:
- మూర్చ
- తీవ్రమైన తలనొప్పి
- దృష్టి/చూపు సమస్యలు
- మానసిక గందరగోళం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
క్రింది కారణాల వల్ల టోక్సోప్లాస్మోసిస్ సంభవిస్తుంది:
- అనేక జంతు జాతుల (animal species) లో ఈ పరాన్నజీవి ఉంటుంది, అందువలన సరిగ్గా వండని/ఉడకని మాంసం తినడం అనేది ఈ సంక్రమణకు దారి తీస్తుంది.
- కలుషితమైన నీటిని తీసుకోవడం/తాగడం ద్వారా ఈ పరాన్నజీవి మానవ శరీరంలోకి ప్రవేశించవచ్చు.
- వ్యాధి సంక్రమిత పిల్లి మలానికి దగ్గరగా వెళ్లడం వల్ల కూడా సంక్రమణను కలిగిస్తుంది.
- కొన్ని సందర్భాల్లో, సంక్రమిత తల్లి నుండి పుట్టబోయే బిడ్డకు (కంజెనిటల్ వ్యాప్తి) లేదా కలుషిత రక్తంతో రక్త మార్పిడి ద్వారా కూడా వ్యాపించవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
టోక్సోప్లాస్మోసిస్ను నిర్ధారించడానికి, ఈ క్రింది పరీక్షలు నిర్వహించవచ్చు:
- పరాన్నజీవికి వ్యతిరేకంగా శరీరం ఉత్పత్తి చేసిన యాంటీ బాడీలను పరిశీలించడానికి రక్త పరీక్షలు
- సిటి (CT) స్కాన్
- ఎంఆర్ఐ (MRI) స్కాన్
- జీవాణుపరీక్ష (బయాప్సి)
- పరాన్నజీవి ఉనికి యొక్క తనిఖీ కోసం మల పరీక్ష
రోగనిర్ధారణ యొక్క ధృవీకరణ తర్వాత, వైద్యులు అల్పెండజోల్ (Albendazole) వంటి యాంటీహేల్మింతిక్స్ అని పిలవబడే మందులతో చికిత్స చేస్తారు. ఏమైనప్పటికీ, చాలామంది వ్యక్తులలో, ఏ చికిత్స అవసరం లేకుండా కొన్ని వారాలలోనే లక్షణాలు తగ్గిపోవచ్చు.
బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులలో మందులు అత్యవసరం అవుతాయి. ఏవైనా ఇతర సంక్లిష్టతలకు దారితీయకపోతే ఈ సంక్రమణకు సులభంగా చికిత్స చేయవచ్చు.
సంక్రమణను నివారించడానికి, సురక్షితంగా మరియు సరిగ్గా వండిన మాంసాన్ని తీసుకోవాలి మరియు పిల్లి వ్యర్థలతో వ్యహరించే సమయంలో పరిశుభ్రతను మరియు జాగ్రత్తను పాటించాలి. సంక్రమణ వ్యాప్తిని నివారించడం కోసం పచ్చి మాంసాన్ని తాకిన/పట్టుకున్న తరువాత సబ్బు మరియు నీటితో చేతులను శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం.