బెల్లం అన్నది చెరకు నుండి తయారుచేయబడే ఒక రకమైన స్వీటెనర్. శుద్ది చేయబడని కారణంగా చక్కెరకు ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయంగా ఇది పరిగణించబడుతుంది. చక్కెర మరియు బెల్లం దాదాపు ఒకే పరిమాణంలో కేలరీలు కలిగిఉన్నప్పటికీ, శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు మరియు ఖనిజాలను కూడా బెల్లం కలిగిఉన్నందు వల్ల దీనిని ఉత్తమమైనదిగా భావిస్తారు.
బెల్లం సాధారణంగా మూడు రూపాల్లో లభిస్తుంది – ఘన, ద్రవ మరియు పొడి రూపాలు. మహారాష్ట్ర మరియు పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాలలో ద్రవ రూపంలో ఉండే బెల్లం బాగా ప్రసిద్ధి చెందింది, అయితే గ్రామీణ ప్రజలలో పొడి బెల్లం సాధారణంగా లభిస్తుంది. బెల్లం విభిన్న రంగులను కలిగిఉంటుంది మరియు ఈ రంగు బంగారు గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగు వరకు మారుతూ ఉంటుంది. గమనించదగ్గ చాలా ముఖ్యమైన విషయాలలో ముదురు గోధుమ రంగు బెల్లం అధికమైన మరియు లోతైన రుచిని కలిగిఉంటుంది అన్నది ఒక్క ముఖ్యమైన విషయం.
దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలోని అనేక దేశాలలో బెల్లమును వినియోగిస్తారు. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు శ్రీలంకలోని స్థానిక వంటలలో బెల్లం విస్తారంగా వాడబడుతుంది మరియు ఇది భారతీయ వంటకాల్లోని అతి ముఖ్యమైన పదార్థాలలో ఒకటి. సాంబారు మరియు రసం యొక్క రుచిని పెంచేందుకు ఒక చిటికెడు బెల్లమును వాటిలో కలుపుతారు. పెద్దలు మరియు పిల్లలలో చాలా ప్రసిద్దిచెందిన చిక్కీలు అన్నవి వేరుశనగ కాయలు మరియు బెల్లంతో తయారుచేయబడతాయి. బెల్లంను స్వీట్లు, మద్య పానీయాలు, చాకొలేట్లు, క్యాండీలు, టానిక్‌లు, సిరప్లు, షరబత్‌లు, కేకులు మొదలైన వాటి తయారీలో కూడా ఉపయోగిస్తారు. ప్రపంచంలోని బెల్లం ఉత్పత్తిదారుల్లో మహారాష్ట్ర అతి పెద్ద ఉత్పత్తిదారు. అమెరికా, ఆసియా, మరియు ఆఫ్రికాలో బెల్లం విస్తృతంగా వినియోగించబడుతుంది. బెల్లంలోని వివిధ రకాలలో చెరకు బెల్లం, ఖర్జూర బెల్లం, తాటి బెల్లం, టాడీ తాటి బెల్లం మొదలైన రకాలు ఉన్నాయి.
బెల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిఉంది. ఇది ఆయుర్వేదం మరియు సంప్రదాయ వైద్యంలో ప్రత్యేక స్థానం కలిగిఉంది. దీనిలో ఇనుము సమృద్ధిగా ఉండడం వల్ల, రక్తహీనతను నివారించడంలో ఇది సహాయపడుతుంది. మీ భోజనం తర్వాత, ఒక చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల, అది జీర్ణక్రియలో సహాయపడుతుందని నమ్ముతున్నారు. మిరియాలతో పాటు బెల్లం తినడం మీ ఆకలిని పెంచుతుంది. ఆయుర్వేద ప్రకారం, బెల్లంను క్రమంగా తీసుకోవడం మీ దృష్టిని పెంచుతుంది. బెల్లం మొటిమల చికిత్సలో మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుటలో కూడా ప్రసిద్ధి చెందింది. రాతి ఉప్పుతో పాటు బెల్లంను తీసుకోవడం ద్వారా పుల్లని త్రేన్పులను నయం చేయవచ్చు.
బెల్లం గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- వృక్ష శాస్త్రీయ నామం: బెల్లం చెరకు యొక్క ఒక ఉప ఉత్పత్తి, సాచరమ్ ఆఫిసీనరమ్
- జాతి: పోసియో (చెరకు కోసం)
- వ్యవహారిక నామం: గుడ్
- సంస్కృత నామం: గుడ్డ్ / శర్కరా
- జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: బెల్లం యొక్క మూలం తూర్పు భారతదేశంలో ఉందని కొంతమంది ప్రజలు నమ్ముతారు, పోర్చుగీసు వారు దీనిని భారతదేశానికి పరిచయం చేసారని ఇతరులు నమ్ముతారు. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ మరియు శ్రీలంక దేశాలు ప్రపంచంలో బెల్లం యొక్క అతి పెద్ద ఉత్పత్తిదారులు.
- ఆసక్తికర అంశం: బెల్లంను తరచుగా “ సూపర్‌ఫుడ్ స్వీటెనర్” గా సూచిస్తారు.