వాటి ప్రత్యేకమైన రుచి మరియు సరళమైన రంగు వలన పిస్తాపప్పులు బాగా ప్రసిద్ధి చెందాయి, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గింజలలో పిస్తాపప్పులు ఒకటి. జీడిపప్పు కుటుంబానికి చెందిన ఒక మొక్కగా, పిస్తాపప్పు మొక్క మధ్య ఆసియా మరియు తూర్పుమధ్య ప్రాంతాలలో పుట్టింది. తూర్పుమధ్య ప్రాంతాలలో వేలాది సంవత్సరాల నుండి పిస్తా మొక్కలు పెరుగుతున్నాయని నమ్ముతారు. పిస్తాపప్పులు బైబిల్ యొక్క పాత నిబంధనలో కూడా ప్రస్తావించబడ్డాయి, వాటి యొక్క గొప్ప చరిత్ర మరియు వాటిని విలువైన ఆహార వనరుగా దానిలో సూచించబడింది.

పురావస్తు శాస్త్రం, 6750 BC నాటికే పిస్తా విత్తనాలు సాధారణ ఆహారంగా ఉన్నాయని తెలుపింది. ఇవి ఇటలీ మరియు హిస్పానియాలోకి ప్రవేశించబడే వరకు సిరియాకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాయి. పురాతత్వవేత్తలు (Archaeologists) ఈశాన్య ఇరాక్లోని త్రవ్వకాల ద్వారా,అవి అట్లాంటిక్ పిస్తా వినియోగాన్ని సూచిస్తున్నట్లు కనుగొన్నారు. ఆధునిక పిస్తా మొట్టమొదటిసారిగా మధ్యఆసియాలో కాంస్య యుగం (Bronze Age)లో సాగు చేయబడింది, దీనిలో ఆధునిక ఉజ్బెకిస్థాన్ నుండి మొదటి ఉదాహరణ వచ్చింది. ప్రస్తుతం, పిస్తాపప్పు ఆంగ్ల భాష మాట్లాడే దేశాలైన ఆస్ట్రేలియా, న్యూ మెక్సికో మరియు కాలిఫోర్నియాలలో  వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు 1854 లో ప్రవేశపెట్టబడిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ లో కూడా సాగు చేస్తున్నారు. 2014 లో, ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్, పిస్తా పప్పు యొక్క ప్రధాన ఉత్పత్తిదారులుగా, రెండు దేశాలు కలిసి మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 76% వాటాని ఉత్పత్తి చేసాయి.  

రుచికరమైన చిరుతిండిగా మాత్రమే కాక, ఈ పిస్తాపప్పు పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మరియు ఆరోగ్యకరమైన ప్రోటీన్లకు ఒక ముఖ్యమైన వనరు. ఇది గుండె మరియు మెదడు యొక్క ఆరోగ్యానికి అద్భుతముగా పనిచేస్తుంది మరియు పిస్తాపప్పులలో ఉన్న డైటరీ ఫైబర్ బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

ఒక చిరుతిండిగా, తాజాగా లేదా వేయించి లేదా ఉప్పు చల్లి, సలాడ్ పైన వేసుకుని, డ్రై ఫ్రూట్స్ తో కలిపి, కేకులు లేదా చేప లేదా మాంసం వంటి వాటితో కలిపి పిస్తాపప్పులను తినవచ్చు. వీటితో పాటు పిస్తాపప్పులను పిస్తాపప్పు ఐస్క్రీం, కుల్ఫి, పిస్తా బటర్, హల్వా మరియు చాక్లెట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు.

పిస్తాపప్పుల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • శాస్త్రీయ నామం: పిస్తాసియా వేరా (Pistacia vera)
  • కుటుంబ నామం: జీడిపప్పు కుటుంబం (అనకార్డియేసియే [Anacardiaceae]).
  • సాధారణ నామం: పిస్తా, పిస్తా పప్పు
  • ఉపయోగించే భాగాలు: వాస్తవానికి మనం పిస్తా పండు యొక్క విత్తనాలను తింటాం మరియు ఉపయోగిస్తాం.
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఇరాన్, టర్కీ, చైనా, యునైటెడ్ స్టేట్స్, ఆఫ్ఘనిస్తాన్, మరియు సిరియా
  • ఆసక్తికరమైన వాస్తవం: బాబిలోన్ యొక్క హంగింగ్ గార్డెన్స్ 700 BC కాలంలో పిస్తాపప్పు చెట్లను కలిగి ఉన్నట్లు చెప్పబడింది.
  1. పిస్తాపప్పు పోషక వాస్తవాలు - Pistachio nutrition facts in Telugu
  2. పిస్తాపప్పు ఆరోగ్య ప్రయోజనాలు - Pistachio health benefits in Telugu
  3. కొలెస్ట్రాల్ కోసం పిస్తాపప్పు - Pistachio for cholesterol in Telugu
  4. ఆరోగ్యకరమైన మెదడుకు పిస్తాపప్పు - Pistachio for healthy brain in Telugu
  5. బరువు తగ్గుదల కోసం పిస్తాపప్పు - Pistachio for weight loss in Telugu
  6. గుండె ఆరోగ్యానికి పిస్తాలు - Pistachios for heart health in Telugu
  7. మధుమేహం కోసం పిస్తాలు - Pistachio for diabetes in Telugu
  8. పిస్తాపప్పులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి - Pistachios boost immunity in Telugu
  9. పిస్తాపప్పులు వాపు నిరోధక చర్యలను కలిగి ఉంటాయి - Pistachio has anti-inflammatory properties in Telugu
  10. చర్మ ఆరోగ్యం మరియు వృద్ధాప్య వ్యతిరేక లక్షణాల కోసం పిస్తాపప్పులు - Pistachios for skin health and anti ageing in Telugu
  11. పిస్తాపప్పుల దుష్ప్రభావాలు - Pistachios side effects in Telugu
  12. జుట్టు కోసం పిస్తాపప్పు ప్రయోజనాలు - Pistachios benefits for hair in Telugu
  13. మాక్యులర్ డిజెనెరేషన్ కోసం పిస్తాపప్పులు - Pistachios for macular degeneration in Telugu
  14. ఉపసంహారం - Takeaway in Telugu
  15. पिस्ता की तासीर - Pista ki taseer in Hindi
  16. पिस्ता खाने का सही समय - Pista khane ka sahi samay in Hindi

ప్రాచీనమకాలం నుండి, పిస్తాపప్పులను స్వస్థత మరియు బలమైన ఆరోగ్యానికి చిహ్నంగా భావిస్తారు. పిస్తాపప్పులు ఉత్తమమైన ఆరోగ్యానికి అవసరమైన అసంఖ్యాక ప్రయోజనకరమైన పోషకాలను అందిస్తాయి. పిస్తాలు విటమిన్-ఇ, శక్తి, కెరోటిన్ వంటి యాంటియోక్సిడెంట్ ఫైటోకెమికల్స్ మరియు అనేక బి కాంప్లెక్స్ విటమిన్ల యొక్క అద్భుతమైన మూలంగా ఉన్నాయి. వీటిలో కాపర్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం మరియు జింక్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

యు.ఎస్.డి.ఏ (USDA) న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల పిస్తాపప్పులు ఈ క్రింది పోషక విలువలను కలిగి ఉంటాయి:

పోషకాలు

100 గ్రాములకు

శక్తి

560 కిలో కేలరీలు

నీరు

4. 37 గ్రా

కార్భోహైడ్రేట్

27. 17 గ్రా

ప్రోటీన్

20. 6 గ్రా

ఫ్యాట్

45. 32 గ్రా

డైటరీ ఫైబర్

10. 6 గ్రా

చక్కెర

7. 66 గ్రా

మినరల్స్

 

కాల్షియం  

105 mg

ఐరన్

3.92 mg  

మెగ్నీషియం

121 mg

ఫాస్ఫరస్

490 mg

పొటాషియం

1025 mg

జింక్

2.20 mg

కాపర్

1.30 mg

మాంగనీస్

1.2 mg

విటమిన్లు

 

విటమిన్ బి9

51 µg

విటమిన్ బి3

1.3 mg

విటమిన్ బి2

0.16 mg

విటమిన్ బి1

0.87 mg

విటమిన్ ఏ

26 µg

విటమిన్ బి-6

1.7 mg

విటమిన్ ఇ

2.86 mg

ఫ్యాట్స్/ఫ్యాటి యాసిడ్లు 

 

సాచురేటెడ్

5.907 గ్రా

మోనోఅన్సాచురేటెడ్

23.257 గ్రా

పోలిఅన్సాచురేటెడ్

14.380 గ్రా

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

పిస్తాపప్పులు ఆహారంలో చేర్చగల ఆరోగ్యకరమైన గింజల్లో ఒక రకం. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, శక్తి పుష్కలంగా ఉంటుంది, ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి మొత్తాలలో ఉంటాయి ఇవన్నీ ఆరోగ్యాన్ని కాపాడటం మరియు యవ్వనంగా ఉంచడంలో సమర్థవంతమైనవి. పిస్తాపప్పుల యొక్క ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్నింటిని చూద్దాం.

  • కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది: తక్కువగా క్రొవ్వు పదార్ధాలు ఉండే గింజల్లో పిస్తాపప్పులు ఒకటి మరియు రూపంలో ఈ కొవ్వులు ఎక్కువగా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు. పిస్తాపప్పుల వినియోగం చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించి మరియు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుందని, ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
  • మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది: ఆకుపచ్చ మరియు ఊదా రంగు పిస్తాపప్పులు లౌటిన్ మరియు ఆంథోసయానిన్ వంటి పిగ్మెంట్లను కలిగి ఉంటాయి, ఇది జ్ఞానాన్ని(ఆలోచన మరియు అవగాహన) మెరుగుపరచడంలో సమర్థవంతముగా పనిచేస్తాయి.
  • బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది: పిస్తాపప్పులు మరియు గింజలు సాధారణంగా సాధారణంగా బరువుని పెంచేవిగా భావిస్తారు.అయితే, వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు తగినంత డైటరీ ఫైబర్ ఉంటాయి ఇవి ఎక్కువసేపు  కడుపు నిండిన భావనను కలిగించి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
  • యాంటీడయాబెటిక్: పిస్తాపప్పులు డయాబెటిక్ మరియు ప్రీ డయాబెటిక్ వ్యక్తులకు ఒక అద్భుతమైన ఆహారం ఎంపిక అని క్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి మరియు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి, తద్వారా మధుమేహాన్ని నిర్వహించడంలో సహాయం చేస్తాయి.
  • చర్మం కోసం: పిస్తాపప్పులు యాంటియోక్సిడెంట్ల యొక్క గొప్ప మూలాలు, ఇది వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చెయ్యడమే, చర్మంపై యువి (UV) కిరణాల హానికరమైన ప్రభావాలను కూడా తగ్గిస్తాయి. పిస్తాపప్పులు నూనె హైడ్రేటింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, అందువలన ఇది చర్మాన్ని మృదువుగా మరియు నాజూకుగా  చేస్తుంది.

యూ.ఎస్.డి.ఏ (USDA) న్యూట్రిషన్ టేబుల్స్ ప్రకారం, ఒక కప్పు  పిస్తాపప్పు (సుమారుగా 28 గ్రా) లో కేవలం 13 గ్రా కొవ్వు మాత్రమే ఉంటుంది - అన్ని గింజల్లో కంటే ఇది అతి తక్కువగా. ఆ 13గ్రాముల పిస్తాపప్పులో  11 ఆరోగ్యకరమైన మోనోఅన్సాచురేటేడ్ లేదా పోలిఅన్సాచురేటేడ్ కొవ్వులు ఉంటాయి, 2 గ్రాముల మాత్రమే సాచురేటేడ్ కోవ్వు ఉంటుంది. పిస్తాపప్పులో గుండెకు  ఆరోగ్యకరమైన ఫ్యాటీ-యాసిడ్ ప్రొఫైల్తో పాటు ప్రోటీన్, డైటరీ ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ కె, పొటాషియం, గామా-టోకోఫెరోల్ మరియు అనేక ఫైటోకెమికల్స్ వంటి పోషక పదార్థాలు ఉంటాయి.

పిస్తాపప్పులు గుండెకు ఆరోగ్యకరమైన బ్లడ్ లిపిడ్ ప్రొఫైళ్ళను ప్రోత్సహిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి. పిస్తాపప్పుల వినియోగం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతుంది.

ఆసక్తికరంగా, మంచి కొలెస్ట్రాల్ (HDL) కంటెంట్ నేరుగా గుండె జబ్బుల యొక్క తగ్గుదలతో ముడి పడి ఉంటుంది.

(మరింత సమాచారం: అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు)

పిస్తాపప్పులు పోషకాలకు ఒక మంచి నిల్వలు. పైన చెప్పినట్లుగా, పిస్తాపప్పులు ఆరోగ్యకరమైన గుండెను ప్రోత్సహిస్తాయి. గుండెకు ఆరోగ్యకరమైన ఆహార విధానానికి మరియు ఆరోగ్యకరమైన మెదడుకు మధ్య బలమైన సంబంధం ఉంటుందని అధ్యయనాలు తెలిపాయి. ఆరోగ్యకరమైన గుండె మెదడుకు సరైన పోషకాలను మరియు తగినంత ఆక్సిజన్ను పంపుతుంది.

ఆహారవిధానాల వలన మేధాశక్తి  ప్రయోజనాలను కూడా పొందవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. పిస్తాపప్పుల యొక్క ప్రత్యేక ఆకుపచ్చ మరియు ఊదా రంగు వాటిల్లో ఉండే  ల్యూటిన్ మరియు అంథోసియానిన్ కంటెంట్ ఫలితంగా ఏర్పడుతుంది.

ల్యూటిన్ మేధాశక్తి పనితీరును పెంచుతుందని అంటారు.

గింజలు (నట్స్) శక్తి అధికంగా ఉండే ఆహారాలు. వీటిలో కొవ్వులు (ఫ్యాట్స్ ) ఎక్కువగా ఉంటాయి. నట్స్ యొక్క క్రమమైన వినియోగం గురించి ఉండే ప్రధాన వ్యాకులత, అవి బరువును పెంచుతాయని భావిస్తారు. పిస్తాపప్పు యొక్క క్రంచి రుచి అందరికి నచ్చుతుంది, కానీ సహజంగా ఎవరు వారి బరువును పెంచుకోవాలనుకోరు.

యూ.ఎస్.డి.ఏ ప్రకారం, ఒక కప్పు పిస్తాపప్పులు 170 కేలరీలను అందిస్తాయి. ఏది ఏమైనప్పటికీ, గింజల (నట్స్) లేదా పిస్తాపప్పు వినియోగం మరియు బరువు పెరుగుదలకు మధ్య ఎటువంటి సంబంధం ఇప్పటి వరకు ఏ పరిశోధన తెలుపలేదు. అయితే, ఇప్పుడు క్రముముగా ఆహారంలో గింజలును తీసుకోవడం ఆరోగ్యంగా భావిస్తున్నారు. పరిశోధనలు పిస్తాపప్పుల యొక్క శక్తి గురించి; వాటి ఫైబర్ కంటెంట్, ప్రోటీన్, మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాల (అన్సాచురేటేడ్ ఫ్యాటీ యాసిడ్లు) గురించి వివరించాయి; మరియు వాటి క్రాంచినెస్ కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తుంది తద్వారా అతిగా తినడాన్ని నివారిస్తుంది.

(మరింత సమాచారం: ఊబకాయం చికిత్స)

పిస్తాపప్పులు కలిగి ఉండే ఆరోగ్యకరమైన ఆహారవిధానం చెడ్డ కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి మరియు మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతుందని ఒక పరిశోధన సూచించింది, ఇది అనేక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పోషక శాస్త్రవేత్తల ఒక అంతర్జాతీయ బృందం ప్రకారం (International team of nutritional scientists), పిస్తాపప్పులలో ల్యూటీన్, బీటా-కరోటిన్ మరియు గామా-టోకోఫెరోల్ వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ ఎ యొక్క ప్రికస్సర్ (ముందుగా వచ్చే సమ్మేళనం) బీటా-కెరోటిన్ మరియు గామా-టోకోఫెరోల్ విటమిన్ ఇ యొక్క ప్రికస్సర్. ఆరోగ్యకరమైన ఆహారవిధానంలో భాగంగా పిస్తా గింజల వినియోగం రక్తంలో ఈ యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచుతుంది, ఆర్టరీలలో ఫలకం మరియు అథెరోస్క్లెరోసిస్ ఏర్పడటానికి కారణమయ్యే  ఎల్.డి.ఎల్ (LDL) ఆక్సీకరణ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.

మధుమేహం జీవనశైలి, ఆహార ఎంపికలు, మరియు వ్యక్తి యొక్క జన్యువులతో సహా వివిధ శారీరక మరియు మానసిక కారణాల వలన కలిగే ఒక రుగ్మత. గుర్తించకుండా వదిలివేస్తే, ఇది మూత్రపిండాల లోపం మరియు దృష్టి లోపంతో సహా అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి మధుమేహ నిర్ధారణ మరియు చికిత్స అనేది ప్రారంభ దశలలోనే మొదలుపెట్టడం చాలా అవసరం. మధుమేహం చికిత్స కోసం వివిధ మందులు అందుబాటులో ఉన్నాయి కానీ ప్రతి మందు మాదిరిగానే, అవి కూడా దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. అందువలన, ఆధునిక చికిత్సా విధానం వేగంగా సహజ మరియు సురక్షిత చికిత్సా పద్ధతులు వైపు కదులుతుంది.

యాంటీడయాబెటిక్ సంభావ్యత కలిగిన అనేక ఆహార వనరులలో పిస్తా ఒకటి.

మధుమేహం ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో పిస్తాపప్పుల యొక్క క్రమమైన వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఒక క్లినికల్ అధ్యయనం సూచించింది.

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, పిస్తాపప్పులు ప్రిడయాబెటిక్ ప్రజలకు ( రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి కలిగిన వ్యక్తులు) ఒక అద్భుతమైన ఆహార సప్లిమెంట్. పిస్తాపప్పుల యొక్క క్రమమైన వినియోగం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందని మరియు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోస్ స్థాయిలను తగ్గిస్తుందని నివేదించబడింది .

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW

పిస్తాపప్పులు వివిధ విటమిన్లకు మంచి మూలాలు అయితే, విటమిన్ బి6 ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు చాలా అవసరం. వివిధ ప్రీక్లినికల్ మరియు క్లినికల్ అధ్యయనాలు విటమిన్ బి6 శరీరంలోని యాంటీబాడీలు మరియు లింఫోసైట్ల (ఒక రకమైన తెల్లరక్తకణాలు) యొక్క వ్యాప్తిని పెంచుతుందని సూచించాయి, ఇవి శక్తివంతమైన రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరుకు అవసరం. అదనంగా, శరీరంలో సరైన రక్త సరఫరాకు ఇది సహకరిస్తుంది. ఒక మంచి రక్త ప్రసరణ గాయం లేదా సంక్రమణ జరిగిన స్థానానికి యాంటీబాడీల చేరికను సులభతరం చేస్తుంది.

అయితే, ఇప్పటివరకు పిస్తాపప్పుల యొక్క ఇమ్యునోస్టీలేలేటరీ (రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే) ప్రభావాలపై ఎటువంటి ప్రత్యక్ష అధ్యయనాలు జరుగలేదు.

పిస్తాపప్పులలో విటమిన్ ఏ మరియు విటమిన్ ఇ లు సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండూ విటమిన్లు శక్తివంతమైన వాపు నిరోధక చర్యలతో ముడిపడి ఉంటాయి. మ్యూకస్ మెంబ్రేన్ మరియు చర్మం యొక్క సెల్ మెంబ్రేన్ (కణ పొరల) యొక్క సమగ్రతను కాపాడటం ద్వారా పిస్తాపప్పులు వాపును నిరోధిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే పిస్తాపప్పులు హానికరమైన ఆక్సిజన్-ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది, ఇవి కూడా వాపు యొక్క సాధారణ కారణాలలో ఒకటి.

పిస్తాపప్పుల్లోని ఒలియోరెసిన్ (oleoresin) గ్యాస్ట్రిక్ నష్టాన్ని నివారించే బలమైన వాపు నిరోధక చర్యను కలిగి ఉంటుందని ఒక అధ్యయనం తెలిపింది.

అతినీలలోహిత (UV) కాంతికి గురైన సమయంలో ఉత్పన్నమైయ్యే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ (ROS) చర్మ నష్టం మరియు వృద్ధాప్యా లక్షణాలను ప్రేరేపిస్తాయి. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ కు ఉత్తమ వ్యతిరేకి యాంటీఆక్సిడెంట్లు. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తొలగించి ఆక్సిడేటివ్ నష్టం వలన కలిగే చర్మ హాని నుంచి రక్షణ కల్పిస్తాయి. పిస్తాపప్పులలో సహజ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

3-డైమెన్షనల్ (3D) హ్యూమన్ స్కిన్ ఎక్వివేలెంట్ (HSE) టిష్యూ మోడల్ మీద పిస్తాపప్పుల్లోని బయోయాక్టివ్ సమ్మేళనాలను ఉపయోగించి ప్రయోగాలు నిర్వహించారు. పిస్తాపప్పులలో ఉండే ల్యూటీన్ మరియు γ- టోకోఫెరోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు, కణాల యొక్క సమగ్ర మందాన్ని మరియు వ్యవస్థను కాపాడడం ద్వారా అల్ట్రావైయోలెట్ కిరణాల ప్రేరిత నష్టం నుండి HSE ను రక్షించాయని ఫలితాలు తెలిపాయి.

పిస్తాపప్పులలో విటమిన్ ఇ చర్మపు వృద్ధాప్య ప్రక్రియకు అడ్డుకుంటుంది మరియు యవ్వనమైన చర్మాన్ని అందిస్తుంది.

పిస్తా నూనెకు ఎమ్మోలెంట్ (మెత్తనపరచే) లక్షణాలు ఉంటాయి, అంటే ఇది సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది మరియు చర్మాన్ని మృదువుగా మరియు హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇది ఒక ఔషధపూరిత మసాజ్ ఆయిల్ గా కూడా ఉపయోగించబడుతుంది.

  • అలెర్జీ: పిస్తాపప్పులకు ఎవరైనా అలెర్జీక్ అయినట్లయితే, అది వారి జీవితంలోని ప్రారంభ దశల్లో స్పష్టంగా కనిపిస్తుంది మరియు వారి అది జీవితకాలం అంతటా కొనసాగుతుంది. దద్దుర్లు, వాంతులు, దగ్గు, జీర్ణాశయ సమస్యలు మరియు చర్మపు దురద వంటివి పిస్తా అలెర్జీ యొక్క అత్యంత సాధారణ లక్షణాలు. తుమ్ములు మరియు కళ్ళ నుండి నీళ్లు కారడం వంటివి ఇతర లక్షణాలు. పిస్తా గింజలకు అలెర్జీ ఉన్న కొందరిలో ఇతర చెట్ల గింజలకు కూడా సున్నితత్వం ఏర్పడవచ్చు.
  • బరువు పెరుగుట: పిస్తా గింజలు అధిక ప్రోటీన్ మరియు ఫైబర్ కంటెంట్ వాటిని ఒక అనుకూలమైన మరియు ప్రముఖ చిరుతిండిగా తయారు చేసాయి. ఏమైనప్పటికీ, అతి ఏదైనా చాలా చెడ్డ విషయం అవుతుంది. పిస్తా గింజల ఒక  పూర్తి కప్పు 689 కేలరీలు అందిస్తుంది.
  • అఫ్లాటాక్సిన్ కలుషితం: అఫాటాటాక్సిన్లు చాలా అనారోగ్యకరమైన మరియు క్యాన్సర్ కారక రసాయనాలు అవి సరిగ్గా నిల్వ చేయని ఆహారంలో కనిపిస్తాయి. పిస్తాగింజలు పరిపక్వ దశలో అఫ్లాటాక్సిన్ వలన తీవ్రంగా కలుషితమవుతున్నాయని గమనింపబడింది. పిస్తాపప్పు గింజలు సహజంగా చిట్లుతాయి కాబట్టి, సరిగ్గా సంరక్షించబడినవి సులభంగా కీటకాలు మరియు ఫంగస్ మౌల్డ్స్ దాడి చేస్తాయి, తద్వారా అది అఫ్లాటాక్సిన్ కలుషితానికి దారితీస్తుంది.
  • జీర్ణశయా సమస్యలు: ఫ్రూక్టోజ్ కు అసహనం కలిగిన వ్యక్తులు పిస్తాలను నివారించాలి. ఫ్రూక్టోజ్ ఆహారంలో వివిధ రకాలుగా ఉండే ఒక సహజ కార్భోహైడ్రేట్. పిస్తాలు  ఫ్రూక్టోజ్ అసహనం ఉన్న వారిలో ఇది ఉబ్బరం, అతిసారం, మలబద్ధకం, మరియు కడుపు నొప్పికి కారణమవుతాయి. ఇవి సులభంగా గ్రహించబడవు మరియు అవి పెద్దప్రేగులో పులిసి, గ్యాస్ ఉత్పత్తి చేసి పొట్ట సాగేలా  చేస్తాయి.
  • మూత్రపిండాల రాళ్ల ప్రమాదం: పిస్తాపప్పులు గణనీయమైన పరిమాణంలో ఆక్సాలెట్లను మరియు మెథియోనిన్ను కలిగి ఉంటాయి. పిస్తాపప్పులను అధికంగా తీసుకోవడం వలన కాల్షియం ఆక్సాలేట్ మరియు సిస్టైన్ మూత్రపిండాల రాళ్ళు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది.

పిస్తాపప్పులలో ఉండే కొవ్వు ఆమ్లాలు బలమైన మరియు ఆరోగ్యకరమైన పొడవాటి జుట్టును ప్రేరేపిస్తాయి. జుట్టు నష్టానికి బాధ్యత వహించే ఒక ప్రధాన కారకం బయోటిన్ లోపం. పిస్తాపప్పులు బయోటిన్ కు ఒక మంచి మూలాలు మరియు మన రోజువారీ ఆహారంలో వాటిని చేర్చడం ద్వారా జుట్టు నస్టాన్ని నిరోధించవచ్చు.

పిస్తాపప్పులు ఉపయోగించి చేసిన హెయిర్ మాస్క్ బిరుసుగా ఉండే జుట్టు, చివరలు చిట్లిన వెంట్రుకలు, డిహైడ్రేటెడ్ మరియు రంగు కోల్పోయిన జుట్టు కోసం అద్భుతముగా పని చేస్తుందని రుజువైంది. ఈ మాస్క్ జుట్టును బాగా పోషించి మరియు ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. ఇది జుట్టు మరియు నెత్తిని హైడ్రేట్ చేస్తుంది.

మాక్యులర్ డిజెనెరేషన్ అనేది వయస్సు-సంబంధ కంటి వ్యాధి. ఇది క్రమంగా పెద్దలలో చూపును/దృష్టి తగ్గిస్తుంది మరియు చదవడం మరియు పని చెయ్యడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఫ్రీ రాడికల్స్ మాక్యులర్ డిజెనెరేషన్ యొక్క ప్రాధమిక కారణాలు అని పరిశోధనలు సూచించాయి. ల్యూటీన్ మరియు జీయాజాంతిన్ అనే రెండు కెరోటినాయిడ్లు, కంటి యొక్క రెటీనాలో బాగా కేంద్రీకృతమై ఉంటాయి మరియు ఇవి మన చూపుకి  /దృష్టికి ప్రధాన బాధ్యత వహిస్తాయి. వయస్సు-సంబంధిత మాక్యులర్ డిజెనెరేషన్ ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు దాని పురోగతిని ఆలస్యం చేయడంలో కూడా అవి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ల్యూటీన్ మరియు జీయాజాంతిన్ పాలకూర మరియు కాలే వంటి ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలలో కనిపిస్తాయి మరియు పిస్తాపప్పులలో కూడా ఉంటాయి. మీ ఆహారవిధానాన్ని  మార్చి రోజువారీ ఆహారంలోకి వీటిని చేర్చడం ద్వారా మాక్యులర్ డిజెనెరేషన్ ను నివారించడం మరియు మంచి కంటి ఆరోగ్యాన్ని అందించడంలో ఇవి సహాయకరంగా ఉంటాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

పిస్తాలలో  విటమిన్లు మరియు ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యకరమైన గింజలు అనేది నిజం. ఏ సమయంలోనైనా పిస్తాపప్పులు తినవచ్చు అనే వాస్తవం వాటిని మరింత ముఖ్యమైన గింజలుగా చేస్తుంది. అయితే, జీడీమామిడి లేదా జీడిపప్పు వంటి జీడిపప్పు కుటుంబానికి చెందిన ఇతర వాటికి సున్నితముగా లేదా అలెర్జీ ఉన్న వ్యక్తులు పిస్తాపప్పును  తినేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. అవి తినడానికి సరదాగా ఉంటాయి; మీ రోజువారీ ఆహారంలో నియంత్రణతో వాటిని తీసుకుంటే పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి.


Medicines / Products that contain Pistachios

వనరులు

  1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 12151, Nuts, pistachio nuts, raw. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  2. Dreher ML. Pistachio nuts: composition and potential health benefits. Nutr Rev. 2012 Apr;70(4):234-40. PMID: 22458696
  3. Pablo Hernández-Alonso, Mònica Bulló, Jordi Salas-Salvadó. Pistachios for Health. Nutr Today. 2016 May; 51(3): 133–138. PMID: 27340302
  4. Orhan I, Küpeli E, Aslan M, Kartal M, Yesilada E. Bioassay-guided evaluation of anti-inflammatory and antinociceptive activities of pistachio, Pistacia vera L. J Ethnopharmacol. 2006 Apr 21;105(1-2):235-40. Epub 2005 Dec 6. PMID: 16337351
  5. Tomaino A et al. Antioxidant activity and phenolic profile of pistachio (Pistacia vera L., variety Bronte) seeds and skins. Biochimie. 2010 Sep;92(9):1115-22. PMID: 20388531
  6. Chen CO et al. Photoprotection by pistachio bioactives in a 3-dimensional human skin equivalent tissue model. Int J Food Sci Nutr. 2017 Sep;68(6):712-718. PMID: 28122479
  7. Chen CO et al. Photoprotection by pistachio bioactives in a 3-dimensional human skin equivalent tissue model. Int J Food Sci Nutr. 2017 Sep;68(6):712-718. PMID: 28122479
  8. Alireza Ostadrahimi et al. Aflatoxin in Raw and Salt-Roasted Nuts (Pistachios, Peanuts and Walnuts) Sold in Markets of Tabriz, Iran. Jundishapur J Microbiol. 2014 Jan; 7(1): e8674. PMID: 25147653
  9. Bernadette Capili, Joyce K. Anastasi, DrNP, FAAN, Michelle Chang. Addressing the Role of Food in Irritable Bowel Syndrome Symptom Management. J Nurse Pract. 2016 May; 12(5): 324–329. PMID: 27429601
Read on app