ప్రోటీన్లు శరీరం యొక్క బిల్డింగ్ బ్లాకులు (శరీర నిర్మాణంలో ఇటుకల వంటివి) మరియు ప్రతి జీవన కణానికి ఇవి అవసరం. ప్రోటీన్ ఒక మాక్రోన్యూట్రియెంట్ మరియు రోజువారీ శరీర కార్యకలాపాలను చేయడానికి మరియు నిర్వహించడానికి మన ఆహారంలో ఇవి చాలా ఎక్కువ పరిమాణంలో అవసరం. ఒక సమతుల్య ఆహారం అందించే కేలరీలలో ప్రోటీన్లు 15-35% గా ఉండాలి.
ప్రోటీన్లు ప్రధానంగా అమైనో యాసిడ్లతో కూడి ఉంటాయి మరియు కణాలకు శక్తిని అందిస్తాయి. ప్రతి గ్రాము ప్రోటీన్‌లో 4 కేలరీలు ఉంటాయి. ప్రోటీన్లు ప్రధానంగా రెండు రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి, అవి, అవసరమైనవి (వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు, మరియు ఆహార వనరుల నుండి వీటిని తీసుకోవలసి ఉంటుంది) మరియు అనవసరమైన అమైనో యాసిడ్లు (వీటిని మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరం సొంతంగా తయారు చేసుకుంటుంది). మొత్తం 20 అమైనో యాసిడ్లలో, 9 అవసరమైనవిగా పరిగణించబడ్డాయి మరియు వీటిని తప్పనిసరిగా ఆహారంలో నుండి తీసుకోవాలి.
ప్రతి వ్యక్తికి ప్రోటీన్లు అవసరమవుతాయి, అయితే పెరుగుతున్న దశలలో, అంటే కౌమార దశ మరియు బాల్యంలో, సరైన పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయం చేయడానికి ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అవసరం. ఇది కాక, కొత్త కణాల మరమ్మత్తు (రిపేర్) మరియు నిర్మాణంలో ప్రోటీన్లు పాల్గొంటాయి. ఇది మన చర్మం, జుట్టు, ఎముకలు, గోర్లు, శరీర కణాలు, కండరాలు, అవయవాల యొక్క పరిపూర్ణ ఆరోగ్యానికి కూడా చాలా అవసరం మరియు శరీర ద్రవాలలో ఇది ఒక భాగం.
ప్రోటీన్ల యొక్క ప్రయోజనాలు మరియు విధులను, అలాగే దాని ఆహార వనరులు, మోతాదు మరియు దుష్ప్రభావాలను తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.