భారతదేశంలో “శంఖపుష్పి” అని ప్రసిధ్ధంగా పిలవబడే ‘కన్వొల్వులస్ ప్లురికాలిస్’ పువ్వు ఆయుర్వేద వైద్యంలో అనేక ఉపయోగాలున్న ఒక మందు మూలిక. ఆయుర్వేద వైద్యంలో, ఈ మూలికా వస్తువు ప్రధానంగా 'రసాయనం' గా ప్రస్తావించబడింది, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మరియు పునరుజ్జీవన (rejuvenation) చికిత్సల కోసం సిఫార్సు చేయబడింది. వైద్యపరంగా, మొత్తం ఈ మూలికను, అంటే ఈ మొక్క పూలు, ఆకులు మరియు కాండాన్ని, పాలు మరియు జీలకర్రతో కలిపిన మిశ్రమాన్ని నాడీ రుగ్మతలు కలిగినవారికి మరియు జ్ఞాపకశక్తిని కోల్పోయిన వారికి మందుగా ఇస్తారు. ఈ మూలికను జ్ఞాపకశక్తిని పెంపొందించే టానిక్కులు తయారు చేయడానికి అత్యంత ప్రసిధ్ధంగా ఉపయోగించబడుతోంది.
ఈ మొక్క భారతదేశానికి చెందినది మరియు సంవత్సరం పొడుగునా లభించే మొక్క ఇది. శంఖపుష్పి మొక్క రెండు సంవత్సరాలకు పైగా జీవిస్తుంది. ఈ మొక్క యొక్క శాఖలు మైదానంలో 30 సెం.మీ పొడవు వరకూ వ్యాపిస్తాయి. ఈ మొక్క యొక్క అండాకార (ఓవల్-షేప్) పుష్పాలు సాధారణంగా నీలం రంగులో ఉంటాయి. ఈ మూలిక యొక్క వివిధ భాగాలు అనేక వైద్య చికిత్సా ప్రయోజనాలను కలిగి ఉంది. అంతేకాకుండా, మెదడు యొక్క పనితీరును పెంచేదిగా, జ్ఞాపకశక్తిని పెంచేదిగా, నేర్చుకునే శక్తిని ఇనుమడించేదిగా, స్ఫురణశక్తిని పెంచే సామర్థ్యం ఉన్న ఏకైక మూలిక శంఖపుష్పి అని ఆయుర్వేద వైద్యులు నమ్ముతారు.
శంఖపుష్పి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: కన్వోల్వులస్ ప్లురికొలైస్ (Convolvulus pluricaulis)
- కుటుంబం: జెంటియనేసియా (Gentianaceae)
- సాధారణ పేరు: శంక్పుష్పి, శంఖిని, కంబుమాలిని, శంఖ్ పుష్పి, సదాఫులి
- సంస్కృత నామం: లఘువిష్ణుక్రాంత్ (Lagubisnukrnt) , నిలాశంఖపుష్ష్పి, వైష్ణవ, విష్ణుక్రాంతి, విష్ణుకాంత, విష్ణుగంధి, శంక్పుష్పి,
- వాడే భాగాలు: ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఈ పూమొక్క మూలిక భారతదేశానికి స్థానికంగా చెందినది, ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో ఎక్కువగా కన్పిస్తుంది.