స్వరపేటిక వాపు అంటే ఏమిటి?
స్వరపేటిక (larynx) మరియు స్వరతంత్రుల (vocal cords) యొక్క వాపునే “స్వర పేటిక వాపు” గా సూచిస్తారు. స్వర తంత్రుల (vocal cords) అక్రమ కదలిక కారణంగా కంఠధ్వని రాసుకుపోయినట్లు వినబడుతూ ధ్వని మారుతుంది. స్వరపేటిక వాపు రుగ్మత 30-50 సంవత్సరాల వయస్సులో ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీర్ఘకాలిక స్వరపేటిక వాపు రుగ్మత 1000 మందిలో 3.5 మందికి సంభవిస్తోంది..
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రధాన లక్షణాలు:
- స్వరములో మార్పు లేదా గొంతు రాసుకుపోవడం (బొంగురుపోవడం)
- గొంతు నొప్పి
- జ్వరం
- తలనొప్పి
- దగ్గు
- శ్వాస తీసుకునేపుడు గురక శబ్దం
- పడిసెంతో కారుతున్న ముక్కు
ఆమ్లత (కడుపులోంచి ఆమ్లభరిత (పులుపు) ద్రవాలు ఛాతీలోని అన్నవాహిక (ఆహార గొట్టం) లోకి తిరిగి ఎగదన్నుకుని రావడం) వల్ల కడుపులోని ఆమ్లాలు స్వరపేటికను చేరుకున్నప్పుడు స్వరపేటిక వాపు సమస్యలు ఏర్పడతాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
స్వరపేటిక వాపు యొక్క ప్రధాన కారణం వైరల్ లేదా బ్యాక్టీరియల్ సంక్రమణం, అయితే వైరల్ స్వరపేటిక వాపు కేసులే ఎక్కువగా ఉన్నాయి. స్వర తంత్రులు (vocal cords) అలసిపోవటం వలన ఈ పరిస్థితి మరింత పెరిగిపోతుంది. ఈ రుగ్మత 3 వారాలకు పైగా కొనసాగినప్పుడు, దీన్నే దీర్ఘకాలిక స్వరపేటికవాపుగా చెప్పబడుతుంది. స్వరపేటిక వాపు యొక్క ఇతర కారణాలు:
- ధూమపానం
- అధిక మద్య పానం
- విసర్జిత పొగలు (exhaust fumes), కొన్ని రసాయనాలు మరియు పొగ వంటి ప్రకోపకాల్ని లేక మంట కల్గించేవాటిని పీల్చడంవల్ల
- స్వర తంత్రులకు అధిక ఒత్తిడి
స్వరపేటిక వాపును ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఇది సాధారణంగా లక్షణాల అంచనా మరియు శారీరక పరీక్ష ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. వ్యక్తి వైద్య చరిత్ర స్వరపేటిక వాపు వెనుక కారణాన్ని వెల్లడిస్తుంది. స్వరపేటికను సాధారణంగా లారింగోస్కోప్ ఉపయోగించి పరీక్షిస్తారు.
సాధారణంగా, ఈ స్వరపేటిక వాపు పరిస్థితి స్వీయ-పరిమితిని కల్గి ఉంటుంది మరియు దానంతట దానిగా పరిష్కరించుకొంటుంది. రుగ్మతకు కారణమైన ఏజెంట్ ఆధారంగా, చికిత్స ఇవ్వబడుతుంది. వైరల్ సంక్రమణను వైరస్ వ్యతిరేక మందులతో చికిత్స చేయవచ్చు. ఆమ్లత లేక్ ఆమ్ల రిఫ్లక్స్ వల్ల స్వరపేటిక వాపు సంభవిస్తే, యాంటీ ఎసిడిటీ మందులతో ఉపశమనాన్ని కలిగించవచ్చు.
స్వీయ రక్షణ చిట్కాలు:
- శరీరంలో శరీరజన్యవిషపదార్థాలను (టాక్సిన్స్ ను) తొలగించేందుకు ద్రవాహారాలను ఎక్కువగాతీసుకోండి
- మిమ్మల్ని మీరు పొగకు గురి కాకుండా చూసుకోండి.
- వెచ్చని ఉప్పునీటిని పుక్కిలించండి (పుక్కిలి పట్టండి.)
- మీ కంఠధ్వనికి విశ్రాంతినివ్వండి, మరియు బిగ్గరగా మాట్లాడటం నివారించండి
- మూసుకుపోయిన ముక్కు ఉపశమనానికి ఆవిరి పీల్చుకోండి
- ముక్కుద్వారాలను తెరఫిగొలిపించే డేకంజెస్టెంట్లను ఉపయోగించకంజి, అవి మీ గొంతును పొడిగా మార్చేయగలవు.
పైన పేర్కొన్న నివారణలు పని చేయకపోతే, మీ వైద్యుడిని సంప్రదించండి.
తీవ్రమైన సందర్భాల్లో, స్వరపేటిక వాపు శ్వాస కష్టాలకు కారణం కావచ్చు మరియు తీవ్రతరం చికిత్స (ఇంటెన్సివ్ థెరపీ) అవసరమవుతుంది.