ముక్కులో గుల్ల (లేక ముక్కులో మొటిమ) అంటే ఏమిటి?
మొటిమ అనేది నిరోధించిన రోమకూపాలు (తైలగ్రంధులు లేక సేబాషియస్ గ్రంథులు) లేదా అంటువ్యాధి సోకిన వెంట్రుకల కుదుళ్ళ కారణంగా సంభవించే చిన్న మొటిమ లేక బొబ్బ. నాసికా కుహరం అనేక వెంట్రుకల కుదుళ్ళతో కూడుకుని (హెయిర్ ఫోలికిల్స్తో) ఉంటుంది, అందువల్ల ఒక మొటిమ సంభవించడం అసాధారణమేం కాదు. ముక్కులో గుల్ల సంభవిస్తే చూడటానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, ముక్కులో గుల్ల సంభవించిన వ్యక్తికి మాత్రం నొప్పి చాలా బాధగా ఉంటుంది.
ముక్కులో గుల్ల ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మొటిమలు సాధారణంగా చిన్నగుంటాయి. ముక్కు లోపల వచ్చే గుల్లలు (మొటిమలు) చిన్నచిన్న గడ్డలు వంటివి, ఇవి తేలికపాటి నొప్పిని విడిచి విడిచి కలిగిస్తాయి. అయితే, ఏదైనా పొడిచే సాధనంతో ముక్కులో గుల్లను గుచ్చడమో లేక తాకించడంవల్ల కలిగే సంక్రమణం బొబ్బలేర్పడ్డానికి కారణమై చివరకు అది కురుపు (abscess) గా తయారవుతుంది. ఈ కురుపు చాలా బాధాకరమైనది మరియు తర్వాత చీము లాంటి ద్రవాన్ని కార్చడానికి దారితీస్తుంది. కురుపు కల్గిన చోట దురద పుట్టడం, ఎరుపుదేలడం మరియు వేడిని కల్గి ఉండడం మొటిమ లక్షణాలు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ముక్కులోని వెంట్రుకల కుదుళ్లకు సంక్రమణ లేక అంటువ్యాధి సోకడంవల్ల సెగగుళ్ల ఏర్పడడం ముక్కులోని మొటిమలకు సాధారణమైన కారణాలలో ఒకటిగా చెప్పొచ్చు. ఇతర కారణాలూ ఉన్నాయి, ఫాలిక్యులిటిస్ గా పిలుబబడే ఎరుపుదేలిన (ముక్కులోని) వెంట్రుకల కుదుళ్లు (పుటిక యొక్క శోధము) మరియు సెల్యులైటిస్ అనబడే చర్మ సంక్రమణం. ముక్కులో జుట్టు కుదుళ్ళ నుండి కూడా ‘ముక్కులో మొటిమ’ సంభవించవచ్చు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
నిపుణుడైన వైద్యుడికి నాసికా కుహరం చూపించి పరిశీలింపజేయడం, వ్యాధిలక్షణాల్ని వివరించడంతో రోగ నిర్ధారణ అవుతుంది. చాలా మొటిమలు ఏమీ చేయకుండా వదిలి పెట్టేసినా వాటంతట అవే పోతాయి. మొటిమ మానడానికి 7-10 రోజులు పడుతుంది. ఏమైనప్పటికీ, ముక్కులో మొటిమ కారణంగా చీము ఏర్పడటం లేదా జ్వరం రావడం సంభవిస్తే వైద్యుడ్ని సంప్రదించాల్సిందే. చికిత్స ప్రధానంగా 5 రోజులు యాంటీబయాటిక్స్ తీసుకోవడం ఉంటుంది. చాలా సందర్భాలలో యాంటీబయాటిక్స్ తోనే ముక్కులో మొటిమ మానిపోతుంది. అయితే, కొందరికి మొటిమ నుండి చీమును తొలగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొన్ని నాసికా సిరలు మెదడుకు అనుసంధానించబడినందున చికిత్స చేయని సంక్రమణం సోకిన మొటిమలు ప్రమాదకరం కావచ్చు, అందువల్ల రక్తం గడ్డకట్టడం ఏర్పడవచ్చు. స్వీయ రక్షణలో భాగంగా తరచుగా ముక్కు పీక్కోవడాన్ని మానుకోండి. ఇంకా, నిపుణులచే ముక్కులోని జుట్టును తొలగించుకోవడం, నొప్పిని తగ్గించడానికి వెచ్చని కాపాడాలను ఉపయోగించడం, మరియు ఉపశమనం పొందడానికి కొబ్బరి నూనెను నాశికలో అంతర్గతంగా పూతగా ఉపయోగించడం వంటివి స్వీయరక్షణా చర్యలు.