ఫ్రీ రాడికల్ అనేది ఒక అణువు, దీనికి అదనపు జతచేలేని (unpaired) ఎలక్ట్రాన్ ఉంటుంది, కాబట్టి ఒక జతగా ఏర్పడటానికి ఇది అత్యంత రియాక్టివ్‌గా ఉంటుంది. దీన్ని సాధించడానికి, ఇది శరీర కణాలతో చురుకుగా ప్రతిస్పందించి వాటికి నష్టం కలిగిస్తుంది. దీనిని తరచుగా ఆక్సిడేటివ్ డ్యామేజ్ అని పిలుస్తారు ఈ నష్టం శరీరంలోని వివిధ అవయవాలకు మరియు వ్యవస్థలకు హానికరమైనది మరియు అనేక వ్యాధులకు ఒక ప్రధాన కారణం.
ఫ్రీ రాడికల్స్ శరీరం యొక్క సాధారణ జీవక్రియ ప్రక్రియల (metabolic processes) నుండి లేదా పర్యావరణ కాలుష్య కారకాలు, రసాయనాలు, పురుగుమందుల పొగ లేదా యువి (UV) కిరణాలు, ఎక్స్-రేలు వంటి హానికర కిరణాలు వంటి కొన్ని రకాల కారకాలకు గురికావడం నుండి ఉత్పన్నమవుతాయి. ఇవి అధిక మొత్తంలో జంక్ ఫుడ్స్ తీసుకోవడం వంటి అనారోగ్య ఆహారవిధానాలకు ప్రతిస్పందనగా కూడా ఏర్పడతాయి.
ఇవి శరీర కణాలతో, ముఖ్యంగా చర్మ కణాలతో చురుకుగా ప్రతిస్పందిస్తాయి, చర్మం యొక్క అకాల వృద్ధాప్యా లక్షణాలకు మరియు ముడుతలకు కారణమవుతాయి. ఫ్రీ రాడికల్స్ జుట్టుకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి, అది జుట్టు నెరిసిపోవడం లేదా జుట్టు రాలడం ద్వారా ప్రతిబింబిస్తుంది.
వయస్సు-సంబంధిత అలోపేసియా (జుట్టు రాలడం వల్ల ఏర్పడిన బట్టతల అతుకులు) కూడా ఆక్సీకరణ ఒత్తిడి నుండి కలిగిన హాని వల్లనే మొదలవుతుంది. అందువలన, వృద్ధాప్య లక్షణాల ప్రక్రియలో ఆక్సీకరణ ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తుందని సరిగ్గా చెప్పబడింది.
(మరింత చదవండి: బట్టతల చికిత్స)
మానవ శరీరంపై ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఇతర ప్రభావాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
- ఆర్థరైటిస్, లూపస్ ఎరిథెమాటోసస్ వంటి ఇన్ఫలమేటరీ రుగ్మతలు (నొప్పి, వాపు లేదా ఎరుపుదనానికి కు సంబంధించిన రుగ్మతలు) (మరింత చదవండి: కీళ్ల నొప్పి)
- అథెరోస్క్లెరోసిస్, గుండెపోటు, స్ట్రోక్, ఇస్చిమియా, రక్తపోటు వంటి హృదయ సంబంధ రుగ్మతలు (మరింత చదవండి: ఎంజినా చికిత్స)
- గ్యాస్ట్రిక్ అల్సర్ వంటి జీర్ణశయాంతర రుగ్మతలు
- రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ రుగ్మతలు
- చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి వంటి నాడీ సంబంధిత రుగ్మతలు
- కండరాల బలహీనత
- కంటిశుక్లం, అస్పష్టమైన దృష్టి, దృష్టి లోపం ఏర్పడడం వంటి దృష్టి సంబంధిత రుగ్మతలు. (మరింత చదవండి: రేచీకటి)
- మధుమేహం
ఫ్రీ రాడికల్స్ ఏర్పడటం అనేది ఒక అనివార్యమైన ప్రక్రియ. అయితే, ఆహారంలో యాంటీఆక్సిడెంట్ల పరిమాణాన్ని మెరుగుపరచడం ద్వారా ఫ్రీ రాడికల్స్ పై శరీరం యొక్క ప్రతిస్పందనను సవరించవచ్చు.
కొన్ని ఆహార పదార్ధాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌కు అదనపు ఎలక్ట్రాన్‌ను అందిస్తాయి, ఇది అవి ఒక జతగా ఏర్పడటానికి సహాయపడతాయి, తద్వారా వాటి కెమికల్ ఇన్స్టెబిలిటీను తగ్గిస్తుంది. అందువలన యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ యొక్క చర్యలను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు శరీర కణాలకు కలిగే ఆక్సీకరణ నష్టాన్ని నివారించగలవు, ఈ చర్య వాటిని రోజువారీ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా చేస్తుంది.